Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సీక్రెట్‌గా అమ్మాయిని రూమ్‌లోకి తెచ్చుకున్న శిఖర్ ధావన్.. కాపలా కాసిన రోహిత్!

టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ తన జ్ఞాపకాలతో ఓ బుక్ రాశాడు. ఇందులో తన జీవిత ప్రయాణంతో పాటు లవ్ ఎఫైర్స్, స్నేహాల గురించి.. మైదానం లోపల, బయట తన చుట్టూ ఉన్న వివాదాల గురించి ప్రస్తావించాడు. ఈ పుస్తకానికి 'ద వన్ క్రికెట్, మై లైఫ్ అండ్ మోర్'అని పేరు పెట్టాడు. ఈ పుస్తకాన్ని ధావన్ తాజాగా ఆవిష్కరించాడు. 'నా క్రికెట్ ప్రయాణం ఎన్నో ఒడిదొడుకులతో సాగింది. ఓ వ్యక్తిగా నేను ఈ రోజు ఇలా ఉండటానికి నా కష్టాలే కారణం. ఎలాంటి దాపరికం లేకుండా నిజాయితీగా నా ప్రయాణాన్ని ఈ పుస్తకంలో పంచుకున్నానని తెలిపాడు.

అయితే ఈ పుసక్తంలో తన లవ్ ఎఫైర్ గురించి శిఖర్ ధావన్ ప్రస్తావించాడు. 2006 ఆస్ట్రేలియా పర్యటనలో ఓ యువతిని సీక్రెట్‌గా రూమ్‌కి తెచ్చుకున్నట్లు గబ్బర్ పేర్కొన్నాడు. ఆ అమ్మాయితో రిలేషన్ కారణంగా టీమిండియా తరఫున తన అరంగేట్రం ఆలస్యమైందని అభిప్రాయపడ్డాడు. '2006‌లో భారత్-ఏ తరఫున ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాను. ఆ సమయంలో భారత్-ఏ టీమ్ ఆటగాళ్లకు రూమ్ షేరింగ్ ఉండేది. నాకు, రోహిత్ శర్మకు ఒకే గది కేటాయించారు. అయితే నేను ఒక అమ్మాయిని చూసిన వెంటనే ఆమె ప్రేమలో పడిపోయాను. ఆమె చాలా అందంగా ఉండేది. నా కోసమే పుట్టిందని అనిపించేది. ఆమెను పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాను.

Shikhar Dhawan Smuggled Girlfriend into Shared Room with Rohit Sharma

ఆ పర్యటనలో ప్రాక్టీస్ మ్యాచ్‌లో నేను హాఫ్ సెంచరీ చేశాను. నా ప్రదర్శన బాగుంది. ప్రాక్టీస్ ముగిసిన వెంటనే ఆ అమ్మాయిని కలిసేవాడిని. ఆ తర్వాత రహస్యంగా రూమ్‌కు తీసుకురావడం కూడా మొదలుపెట్టాను. రోహిత్, నేను ఒకే రూమ్ కావడంతో అతను చాలా ఇబ్బంది పడ్డాడు. ఇంగ్లీష్‌లో మాట్లాడితే ఆమెకు అర్థమవుతుందని హిందీలో మాట్లాడేవాడు. 'నన్ను పడుకోనిస్తారా?'అని అసహనం వ్యక్తం చేసేవాడు.

ఓ రోజు సాయంత్రం నేను ఆ అమ్మాయితో కలిసి డిన్నర్‌కు వెళ్లాను. ఈ విషయం మా జట్టు మొత్తం తెలిసిపోయింది. నేను ఆమెతో నడుస్తుంటే అప్పటి సెలెక్టర్ ఒకరు నన్ను చూశారు. ఆ సమయంలో నా స్థానంలో ఎవరున్నా ఆ అమ్మాయి చేతిని వదిలేసేవారు. అయితే నాకు మాత్రం నేనేం తప్పుడు చేయడం లేదనిపించింది. నేను అలాగే చేతిని వదలకుండా గట్టిగా పట్టుకున్నా. దాంతో ఆ సెలెక్టర్ ఆగ్రహానికి గురయ్యాడు. ఛాన్స్ దొరికితే నన్ను జట్టులో నుంచి తీసేస్తారనే విషయం అర్థమైంది. మెరుగైన ప్రదర్శన చేయాలని గట్టిగా అనుకున్నా. కానీ నేను ఆశించిన రీతిలో ఆడలేకపోయాను. మ్యాచ్ మ్యాచ్‌కు నా ప్రదర్శన దిగజారిపోయింది. దాంతో టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వడం ఆలస్యమైంది.'అని శిఖర్ ధావన్ తన బుక్‌లో పేర్కొన్నాడు.

Story first published: Friday, June 27, 2025, 12:59 [IST]
Other articles published on Jun 27, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+