టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు దేశవాళీ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 12 ఏళ్ల తన సుదీర్ఘ ప్రయాణానికి ముగింపు పలుకుతున్నట్లు శనివారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. టీమిండియాకు సుదీర్ఘ కాలం ఆడటం సంతృప్తినిచ్చే విషయమని చెప్పుకొచ్చాడు. తన కెరీర్‌కు సహకరించిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపాడు.
శిఖర్ ధావన్ రిటైర్మెంట్ నేపథ్యంలో అతనికి అభిమానులు, సహచర క్రికెటర్లు, సినీ, రాజకీయ ప్రముఖులు విషెస్ తెలియజేస్తున్నారు. భవిష్యత్తు మరింత బాగుండాలని కోరుకుంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌లు పెడుతున్నారు. అభిమానులు మాత్రం శిఖర్ ధావన్ ఐకానిక్ ఇన్నింగ్స్‌ను గుర్తు చేస్తున్నారు.

ఐసీసీ టోర్నీల్లో సత్తా చాటే ఏకైక భారత బ్యాటర్ శిఖర్ ధావన్ అని, గణంకాలతో సహా వివరిస్తున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ 2013 భారత్ గెలవడంలో శిఖర్ ధావన్ కీలక పాత్ర పోషించాడు. ఇంగ్లండ్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో గబ్బర్ రెండు శతకాలతో పాటు ఓ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌తో పాటు సెమీఫైనల్, ఫైనల్లో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
2019 వన్డే ప్రపంచకప్‌లో భారత్ విజేతగా నిలవకపోవడానికి శిఖర్ ధావన్ గాయపడటమే ప్రధాన కారణమని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఈ టోర్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో మ్యాచ్‌లో గబ్బర్ సెంచరీ సాధించాడు. ఇంగ్లండ్ గడ్డపై అత్యంత వేగంగా శతకం సాధించిన తొలి ఆసియా ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు. అయితే ఈ మ్యాచ్ ప్రారంభంలోనే ప్యాట్ కమిన్స్ వేసిన ఓ బంతి శిఖర్ ధావన్ బొటన వేలికి బలంగా తాకింది.
అయినా నొప్పిని భరిస్తూనే శిఖర్ ధావన్ బ్యాటింగ్ కొనసాగించి శతకం పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. అనంతరం ధావన్‌కు స్కానింగ్ చేయగా.. బొటన వేలు విరిగినట్లు తేలింది. డాక్టర్ల సూచనల మేరకు ధావన్ ఈ టోర్నీ నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో రిషభ్ పంత్ తుది జట్టులోకి రాగా.. భారత్ సెమీస్‌లో ఓటమిపాలైంది.
శిఖర్ ధావన్ ఉండి ఉంటే టీమిండియా విశ్వవిజేతగా నిలిచేదని ఇప్పటికీ ఫ్యాన్స్ అభిప్రాయపడుతుంటారు. అతని స్థానంలో ఓపెనింగ్ చేసిన కేఎల్ రాహుల్ తీవ్రంగా నిరాశపరిచాడు. ఓపెనింగ్‌లో లెఫ్ట్ రైట్ కాంబినేషన్ లేకపోవడం ప్రత్యర్థి జట్లకు కలిసొచ్చింది. శిఖర్ ధావన్ రిటైర్మెంట్ నేపథ్యంలో మరోసారి ఈ వ్యవహారాన్ని నెటిజన్లు గుర్తు చేసుకుంటున్నారు.
2013 ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు 2015 వన్డే ప్రపంచకప్, 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో శిఖర్ ధావన్ అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. రెండేళ్ల క్రితం బంగ్లాదేశ్‌తో చివరి వన్డే ఆడిన గబ్బర్.. శుభ్‌మన్ గిల్ రాకతో జట్టులో చోటు కోల్పోయాడు. అతనికి ఆడే సత్తా ఉన్నా.. వయసు, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సెలెక్టర్లు అవకాశం ఇవ్వలేదు.
SHIKHAR DHAWAN - MR ICC ❤️
— Johns. (@CricCrazyJohns) August 24, 2024
- Relive the iconic Hundred of Shikhar Dhawan with a broken hand against Australia in the 2019 World Cup. pic.twitter.com/gCGKd2Z6dH
Shikhar Dhawan in Champions Trophy 2013:
— Johns. (@CricCrazyJohns) August 24, 2024
- Player of the tournament.
- Most runs.
- 114(94) vs South Africa.
- 102*(107) vs West Indies.
- 48(41) vs Pakistan.
- 68(92) in Semi Final.
- 31(24) in Final.
THE HERO OF INDIA IN ICC TOURNAMENTS....!!!! 🇮🇳 pic.twitter.com/8vCONCDBJD
- Most runs for India in CT 2013
— Johns. (@CricCrazyJohns) August 24, 2024
- Most runs for India in WC 2015
- Most runs for India in CT 2017
- Most runs for India in Asia Cup 2018
SHIKHAR DHAWAN, AN ABSOLUTE GREAT OF INDIAN WHITE-BALL CRICKET ⭐ Retires from International & Domestic cricket. pic.twitter.com/ApMM0KY8q2