Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ రెండు తప్పిదాలే మా ఓటమిని శాసించాయి: శిఖర్ ధావన్

Shikhar Dhawan says We gave away too many runs and fielding wasnt great

న్యూఢిల్లీ: చెత్త ఫీల్డింగ్, పేలవ బౌలింగే సౌతాఫ్రికాతో తమ ఓటమికి ప్రధాన కారణాలని టీమిండియా తాత్కాలిక సారథి శిఖర్ ధావన్ అన్నాడు. ఈ ఓటమి తమకు ఓ గుణపాఠమని చెప్పిన ధావన్.. సంజూ శాంసన్, శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా ఆడారని కొనియాడారు.

సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన తొలి వన్డేలో టీమిండియా 9 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆఖరి వరకు సంజూ శాంసన్ పోరాడినా ఫలితం లేకుండా పోయింది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన ధావన్.. ప్రణాళికలకు తగ్గట్లు ఆడలేకపోయామని చెప్పాడు.

ఓడినా.. గర్వంగా ఉంది..

ఓడినా.. గర్వంగా ఉంది..

తమ ఆటగాళ్ల పోరాటం మాత్రం ఆకట్టుకుందన్నాడు. 'మా ఆటగాళ్ల పోరాటం పట్ల గర్వపడుతున్నా. మేం మంచి ఆరంభం అందుకోలేదు. అయినా శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, శార్దూల్ ఠాకూర్ అద్భుత బ్యాటింగ్‌తో లక్ష్యానికి చేరువగా తీసుకెళ్లారు. బౌలింగ్‌కు అనుకూలమైన ఈ పిచ్‌పై మేం ధారళంగా పరుగులిచ్చాం. దానికితోడు చెత్త ఫీల్డింగ్ మా ఓటమిని శాసించింది. కానీ ఈ ఓటమి మాకు ఓ గుణపాఠంలాంటిది.'అని గబ్బర్ చెప్పుకొచ్చాడు.

ఇక్కడ డెత్ ఓవర్ల సమస్యే..

ఇక్కడ డెత్ ఓవర్ల సమస్యే..

దక్షిణాఫ్రికాపై టీ20 సిరీస్‌ను చేజిక్కించుకున్న రోహిత్‌ సేన ఆస్ట్రేలియాకు పయనం కాగా..ధావన్‌ నేతృత్వంలోని మరో భారత జట్టు మాత్రం వన్డే సిరీస్‌లో శుభారంభం చేయలేకపోయింది. బౌలింగ్‌లో సగం ఇన్నింగ్స్‌ వరకు పైచేయి సాధించినా.. బ్యాటింగ్‌లో ఆరంభ తడబాటును అధిగమించి మెరుగైన స్థితికి చేరుకున్నా.. ఆఖర్లో పట్టు విడవడంతో ఓటమి తప్పలేదు. రవి బిష్ణోయ్ 69 పరుగులు సమర్పించుకోగా.. ఆవేశ్ ఖాన్ 51 పరుగులిచ్చుకున్నాడు.

40 ఓవర్ల మ్యాచ్‌లో

40 ఓవర్ల మ్యాచ్‌లో

వర్షం వల్ల 40 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో మొదట 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' హెన్రీ క్లాసెన్‌ ( 65 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 74 నాటౌట్‌)తో పాటు డేవిడ్‌ మిల్లర్‌ ( 63 బంతుల్లో 5 ఫోర్లు, 3సిక్స్‌లతో 75 నాటౌట్‌), డికాక్‌ (54 బంతుల్లో 5 ఫోర్లతో 48) రాణించడంతో సౌతాఫ్రికా 4 వికెట్లకు 249 పరుగులు సాధించింది. ఆరంభంలో శార్దూల్‌ ఠాకూర్‌ (2/35) ఆ జట్టును దెబ్బ తీశాడు. అనంతరం ఛేదనను పేలవంగా ఆరంభించిన భారత్‌ 18 ఓవర్లకు 51/4తో నిలిచింది. ఈ దశలో శ్రేయస్‌ అయ్యర్ (37 బంతుల్లో 8 ఫోర్లతో 50), శార్దూల్‌ ఠాకూర్‌ (31 బంతుల్లో 5 ఫోర్లతో 33)లతో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పిన సంజు శాంసన్‌ (63 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 86 నాటౌట్‌) జట్టును విజయానికి చేరువ చేశాడు. కానీ ఆఖర్లో వరుసగా వికెట్లు పడడం, బంతులు వృథా కావడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు.

Story first published: Friday, October 7, 2022, 7:42 [IST]
Other articles published on Oct 7, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+