తన జిడ్డు బ్యాటింగ్‌తో పాటు విరాట్ కోహ్లీ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను నేలపాలు చేయడం తమ ఓటమిని శాసించిందని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ తెలిపాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.
ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన శిఖర్ ధావన్.. 10-15 పరుగులు తక్కువగా చేయడం ఓటమికి కారణమైందన్నాడు. 'ఇదో అద్భుతమైన మ్యాచ్. ఈ గేమ్‌లో మేం పుంజుకొని మరి ఓటమిపాలయ్యాం. మేం 10-15 పరుగులు తక్కువగా చేశాం. తొలి 6 ఓవర్లలో నేను చాలా స్లోగా బ్యాటింగ్ చేశాను.

మేం తక్కువగా చేసిన 10-15 పరుగులతో పాటు విరాట్ కోహ్లీ ఇచ్చిన క్యాచ్ నేలపాలు చేయడం మా ఓటమిని శాసించింది. అతని క్యాచ్ వదిలేయడం ఈ మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. క్లాస్ ప్లేయర్ అయిన విరాట్ కోహ్లీ క్యాచ్‌ను వదిలేసి మేం మూల్యం చెల్లించుకున్నాం. మేం ఆ క్యాచ్ పట్టి ఉంటే రెండో బంతికే మాకు మూమెంటమ్ లభించేది. కానీ మేం అవకాశాన్ని చేజార్చుకున్నాం.
పిచ్ చూడటానికి బాగున్నా.. మంచి వికెట్ అయితే కాదు. బంతి ఆగుతూ వచ్చింది. అనూహ్య బౌన్స్‌తో పాటు టర్న్ లభించింది. 70 శాతం బాగానే ఉన్నా.. మరో 30 శాతం విభిన్నంగా స్పందించింది. దాంతో బ్యాటింగ్‌కు ఇబ్బంది అయ్యింది. నేను చేసిన పరుగుల పట్ల సంతోషాంగానే ఉన్నా.. పవర్ ప్లేలో నేను కాస్త వేగంగా ఆడాల్సింది.
ఆ ఒక్క విషయమే నన్ను వెంటాడుతోంది. వరుసగా వికెట్లు కోల్పోవడంతో నేను ఒత్తిడికి గురయ్యాను. స్వల్ప లక్ష్యమే అయినా.. ఆఖరి ఓవర్ వరకు మ్యాచ్‌ను తీసుకెళ్లాం. హర్‌ప్రీత్ బ్రార్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ముఖ్యంగా లెఫ్టాండర్స్‌ను ఇబ్బంది పెట్టాడు. తీవ్ర ఒత్తిడిలోనూ జట్టుకు కావాల్సిన బ్రేక్ త్రూలు అందించాడు.
తొడ కొట్టే సంబరాలు పంజాబ్‌లో చాలా ఫేమస్. ఇది కబడ్డీ నుంచి వచ్చిన సంప్రదాయం. థై ఫైవ్ సెలెబ్రేషన్స్‌కు అభిమానులు బాగా కనెక్ట్ అవుతారు. హర్‌ప్రీత్ బ్రార్ కూడా థైఫైవ్ సెలెబ్రేషన్స్ చేయడం సంతోషంగా ఉంది.'అని శిఖర్ ధావన్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు చేసింది. శిఖర్ ధావన్(37 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 45) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం ఆర్‌సీబీ 19.2 ఓవర్లలో 6 వికెట్లకు 178 పరుగులు చేసి గెలుపొందింది. విరాట్ కోహ్లీ(49 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో 77) విధ్వంసకర హాఫ్ సెంచరీతో రాణించగా.. దినేశ్ కార్తీక్(10 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 28 నాటౌట్) ధాటిగా ఆడాడు.
ఆర్‌సీబీ ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్ తొలి బంతికే విరాట్ కోహ్లీ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను స్లిప్‌లో జానీ బెయిర్ స్టో నేలపాలు చేశాడు. ఈ తప్పిదం ఆ జట్టు ఓటమిని శాసించింది.