కుర్రాళ్లే అయినా...
'జట్టులోని ఆటగాళ్లంతా కుర్రాళ్లే అయినా పరణితితో ఆడారు. మైదానంలో వారు కనబర్చిన ప్రదర్శన, సమన్వయపరుచుకున్న తీరును చూస్తే గర్వంగా ఉంది. ఇది జట్టుకు శుభసూచకం. నా వ్యక్తిగత ప్రదర్శన నాకు సంతృప్తినిచ్చింది. నేను చాలా కాలంగా వన్డే ఫార్మాట్‌లో ఆడుతున్నా. అయితే, ఈ సిరీస్‌లో తొలి, మూడో మ్యాచ్‌లో ఆడిన తీరు చాలా సంతోషాన్నిచ్చింది. మరోవైపు ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్‌గిల్ (98) పరుగులు చేయడం చూస్తే చాలా ఆనందం వేసింది. ప్రతి ఒక్కరూ మంచి ప్రదర్శన చేశారు.
చిరస్మరణీయ విజయం..
ఇక్కడికి రావడం మేమంతా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ విజయం చాలా అద్భుతంగా ఉంది. అలాగే మాకు అండగా నిలిచిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. మా బౌలింగ్ యూనిట్‌ను చూస్తే చాలా ముచ్చటేస్తుంది. వారి ప్రదర్శన పట్ల నేను గర్వంగా ఉన్నా. వాళ్లు జట్టుకు వందశాతం తిరిగిచ్చారు. సిరాజ్ తొలి ఓవర్‌లోనే రెండు వికెట్లు తీసి శుభారంభం చేశాడు. తర్వాత చాహల్, శార్దూల్ సైతం అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఈ విజయం చిరస్మరణీయం' అని ధావన్ చెప్పుకొచ్చాడు.
వర్షం అంతరాయం కలిగించడంతో..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా వర్షంతో మ్యాచ్ ఆగిపోయే సమయానికి 36 ఓవర్లలో 3 వికెట్లకు 225 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్ ( 98 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 98 నాటౌట్)సెంచరీకి 2 పరుగుల దూరంలో నిలవగా.. శిఖర్ ధావన్(74 బంతుల్లో 7 ఫోర్లతో 58) హాఫ్ సెంచరీతో రాణించాడు. అనంతరం డక్‌వర్త్ లూయీస్ పద్ధతిన టీమిండియా నిర్దేశించిన 257 పరుగుల లక్ష్యాన్ని వెస్టిండీస్ చేధించలేకపోయింది. 26 ఓవర్లలో 137 పరుగులకే కుప్పకూలింది. వెస్టిండీస్ ఆటగాళ్లలో బ్రాండన్ కింగ్ (42), నికోలస్ పూరన్( 42), హోప్(22) మినహా అంతా విఫలమయ్యారు. భారత బౌలర్లో యుజ్వేంద్ర చహల్ (4/17) నాలుగు వికెట్లతో విండీస్ పతనాన్ని శాసించగా.. సిరాజ్, శార్దూల్ ఠాకూర్ చెరో రెండు వికెట్లు, అక్షర్ పటేల్, ప్రసిద్ధ్ కృష్ణా చెరో వికెట్ పడగొట్టారు.


Click it and Unblock the Notifications
