Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వన్డే ప్రపంచకప్ ఆడటమే నా టార్గెట్: శిఖర్ ధావన్

Shikhar Dhawan says Focus is Definitely on Next Year’s World Cup

లండన్: వచ్చే ఏడాది భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ ఆడటమే తన లక్ష్యమని టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ అన్నాడు. దాని కోసం తన ఆటను మరింత మెరుగుపరుచుకుంటానని తెలిపాడు. దేశవాళీ వన్డే, టీ20 క్రికెట్ ఆడేందుకు కూడా తాను సిద్దంగా ఉన్నానని చెప్పాడు. ఇక చాలా రోజుల తర్వాత శిఖర్ ధావన్ జట్టులో చోటు దక్కించుకున్నాడు.

గతేడాది జూలైలో శ్రీలంక పర్యటనలో భాగంగా పరిమిత ఓవర్ల సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన గబ్బర్‌.. ఆ తర్వాత జట్టులో స్థానం కోల్పోయాడు. అప్పటి నుంచి జట్టుకు దూరంగా ఉన్న ధావన్.. రెగ్యులర్‌ ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో అతని స్థానంలో ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు ఎంపికయ్యాడు.

వన్డే ప్రపంచకప్ ఆడటమే..

వన్డే ప్రపంచకప్ ఆడటమే..

నేడు(మంగళవారం) జరగనున్న తొలి వన్డేలో రోహిత్‌ శర్మతో కలిసి ధావన్‌ ఓపెనింగ్‌ చేయనున్నాడు. అంతేకాకుండా ధావన్ కెరీర్‌లో ఈ మ్యాచ్ 150వది. ఈ మ్యాచ్ నేపథ్యంలో తాజాగా మీడియాతో మాట్లాడిన గబ్బర్.. తన భవిష్యత్తు ప్రణాళికలను వెల్లడించాడు. 'ప్రస్తుతం నా దృష్టి మొత్తం వన్డే ప్రపంచకప్‌ టోర్నీ మీదే ఉంది. ఈ గ్యాప్‌లో వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడాలని అనుకుంటున్నా. అప్పుడే ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కుతుంది. నన్ను నేను నిరూపించుకునే అవకాశం లభిస్తుంది.

తీవ్రంగా శ్రమించా..

తీవ్రంగా శ్రమించా..

ఇక అంతకంటే ముందు ఐపీఎల్‌లో మరింత గొప్పగా రాణించాలని భావిస్తున్నాను. అంతేకాకుండా దేశవాళీ వన్డే క్రికెట్‌, టీ20 మ్యాచ్‌ల్లో ఆడాలనుకుంటున్నా. ఇంగ్లండ్‌ పర్యటనకు ముందు నేను పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యాను. నెట్స్‌లో తీవ్రంగా ప్రాక్టీసు చేశాను. ఈ సిరీస్‌తో పూర్తి స్థాయిలో ఫామ్‌లోకి వస్తానని ఆశిస్తున్నా.

ఓపెనర్‌గా నాకు చాలా అనుభవం ఉంది. నా టెక్నిక్‌ను మరింతగా మెరుగుపరచుకుంటున్నా. ఏదేమైనా.. సంయమనంతో పరిస్థితులకు తగ్గట్లుగా సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ.. చిన్న చిన్న స్కోర్లను సైతం భారీ స్కోర్లుగా మలచడంపై దృష్టి సారించాలి. అప్పుడే అనుకున్న ఫలితాలను పొందగలం'అని శిఖర్‌ ధావన్‌ చెప్పుకొచ్చాడు.

వయసుతోనే ఇబ్బంది..

వయసుతోనే ఇబ్బంది..

కాగా ఐపీఎల్‌-2022లో పంజాబ్‌ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన గబ్బర్‌.. 14 ఇన్నింగ్స్‌లో కలిపి 460 పరుగులు సాధించాడు. అత్యధిక పరుగుల వీరుల జాబితాలో ఎనిమిదో స్థానంలో నిలిచాడు. అయినప్పటికీ సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక కాలేదు. 36 ఏళ్ల వయసున్న ధావన్‌ను టీ20 ప్రపంచకప్ జట్టుకు భారత సెలెక్షన్ కమిటీ పరిగణలోకి తీసుకోవడం లేదు. ఆ కారణంగానే అతన్ని టీ20 సిరీస్‌లకు దూరంగా ఉంచుతుంది.

Story first published: Tuesday, July 12, 2022, 16:09 [IST]
Other articles published on Jul 12, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+