Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సోనూసూద్ నువ్వు రియల్ హీరో.. నీకు నా సెల్యూట్: ధావన్

Shikhar Dhawan salutes Bollywood actor Sonu Sood for rescuing stranded migrant workers

ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూసూద్‌పై టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ ప్రశంసల జల్లు కురిపించాడు. కరోనా కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న వలస కూలీలకు సోనూసూద్ అండగా నిలిచిన విషయం తెలిసిందే. కరోనా కకాలవికలంతో అస్తవ్యస్తమైన వలస జీవులను సొంతూర్లకు తరలించేందుకు ఈ బాలీవుడ్ యాక్టర్ సొంత ఖర్చుతో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అనుమతులు తీసుకోని వేలాది మంది వలస కూలీలను వారి సొంతూళ్లకు పంపించారు. బడుగు జీవుల నడక కష్టాలను చూసి చలించి పోయిన ఈ బాలీవుడ్ విలన్.. వారికి అండగా నిలిచి రియల్ హీరో అనిపించుకున్నారు.

ఇప్పటికే అతను చేసిన ఈ సాయంపై యావత్ భారతం హర్షం వ్యక్తం చేయగా.. రాజీకియ, సినీ, వ్యాపార రంగాల ప్రముఖులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. 'సోనూ.. నువ్వు సినిమాల్లోనే విలన్.. కానీ రియల్ లైఫ్‌లో మాత్రం సూపర్ హీరో' అంటూ సోషల్ మీడియావేదికగా కొనియాడుతున్నారు. తాజాగా శిఖర్ ధావన్ కూడా సోనూసూద్ చేసిన సాయాన్ని కొనియాడాడు. ట్విటర్ వేదికగా బాలీవుడ్ విలన్‌కు బిగ్ సెల్యూట్ చెప్పాడు. 'సోనూ సూద్.. కష్టాల్లో ఉన్న వలసకూలీలను వాళ్ల సొంత ఊళ్లకు తరిలించడానికి నువ్వు చేసిన వీరోచిత ప్రయత్నానికి నా బిగ్ సెల్యూట్.'అని ట్వీట్ చేశాడు.

సోంతూళ్లకు వెళ్లడానికి వేల కిలోమీటర్లు నడక సాగించిన వలస కూలీల విజివుల్స్ చూసి తాను చలించిపోయానని సోనూసూద్ బీబీసీతో అన్నాడు. తనకు నిద్ర కూడా పట్టలేదని తెలిపాడు.

Story first published: Monday, May 25, 2020, 20:09 [IST]
Other articles published on May 25, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+