For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అందుకే సంజూ శాంసన్‌ను పక్కనపెట్టాం: శిఖర్ ధావన్

Shikhar Dhawan Reveals the reason Why Sanju Samson not Playing In 2nd ODI vs New Zealand

హామిల్టన్: టీమ్ కాంబినేషన్‌లో భాగంగానే సంజూ శాంసన్‌ను పక్కనపెట్టాల్సి వచ్చిందని టీమిండియా తాత్కలిక కెప్టెన్ శిఖర్ ధావన్ అన్నాడు. సిక్స్త్ బౌలింగ్ ఆప్షన్ కోసం తప్పని పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పాడు. న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరగాల్సిన రెండో వన్డే వర్షం కారణంగా రద్దయ్యింది. కేవలం 12.5 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమవ్వగా.. వర్షం ఎడతెరిపిలేకుండా కురవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. అయితే ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన టీమిండియా.. ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. జట్టులో రెండు మార్పులు చేసిన గబ్బర్ సేన.. సంజూ శాంసన్‌తో పాటు శార్దూల్ ఠాకూర్‌పై వేటు వేసి దీపక్ హుడా, దీపక్ చాహర్‌లను తీసుకుంది.

ఒక్క మ్యాచ్‌కే..

ఒక్క మ్యాచ్‌కే..

ఈ పర్యటనలో ఒకే ఒక మ్యాచ్‌ ఆడిన సంజూ శాంసన్‌ను అంతలోనే పక్కనపెట్టడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంజూకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. వరుసగా విఫలమవుతున్న రిషభ్ పంత్‌ను కొనసాగిస్తూ.. సంజూను పక్కనపెట్టడం సమంజసం కాదని మండిపడుతున్నారు. ఈ మ్యాచ్ రద్దయిన అనంతరం సంజూను పక్కనపెట్టడానికి గల కారణాన్ని ధావన్ వెల్లడించాడు. వర్షం తమ చేతిలో ఉండదని, మ్యాచ్ రద్దవ్వడం నిరాశగా ఉందని తెలిపాడు. మ్యాచ్ మళ్లీ ప్రారంభం కావాలని చూసామని, కానీ సాధ్యం కాలేదని తెలిపాడు. మూడో వన్డే కోసం ఎదురు చూస్తున్నామని చెప్పాడు.

ఎక్స్‌ట్రా బౌలింగ్ ఆప్షన్ కోసమే..

ఎక్స్‌ట్రా బౌలింగ్ ఆప్షన్ కోసమే..

'వర్షం మన చేతుల్లో లేనిది. కేవలం ఎదురు చూడటమే మనం చేయాల్సింది. కానీ మ్యాచ్ సాధ్యం కాలేదు. మూడో వన్డే కోసం ఎదురు చూస్తున్నాం. ఈ వికెట్‌‌పై ఆడిన తర్వాత నేను కాస్త ఆశ్చర్యానికి గురయ్యా. కాస్త సీమింగ్ ఉంటుందని అనుకున్నా.. కానీ గత మ్యాచ్‌ పిచ్‌లా లేదు. బ్యాటింగ్‌కు పూర్తిగా అనుకూలంగా ఉంది. శుభ్‌మన్ అద్భుతంగా ఆడాడు. ఆరో బౌలర్ కావాలనుకున్నాం. దాంతోనే సంజూ శాంసన్‌కు బదులు దీపక్ హుడాను తీసుకున్నాం. బంతిని స్వింగ్ చేయగలడనే దీపక్ చాహర్‌ను ఎంచుకున్నాం. కొంతమంది మా ఆటగాళ్లు విశ్రాంతిలో ఉన్నా ఈ జట్టు చాలా బలంగా ఉంది. బ్యాటింగ్ డెప్త్ కూడా ఉంది.

కుర్రాడిలా మారా..

కుర్రాడిలా మారా..

యువ జట్టుకు నాయకత్వం వహించడం ఎక్సైటింగ్‌గా ఉంది. నేను కూడా కుర్రాడిలా మారానని అనిపిస్తోంది. మొత్తానికి ఇది యువ ఆటగాళ్లకు మంచి అవకాశం. శుభ్‌మన్ బ్యాటింగ్, ఉమ్రాన్ బౌలింగ్ చూస్తేనే ఈ విషయం అర్థమవుతోంది. చాలా అద్భుతంగా ఆడారు. జట్టుగా మా విధానాన్ని సరిగ్గా కొనసాగించాలనుకుంటున్నాం. మూడో వన్డే జరిగే క్రిస్టన్ చర్చ్‌లో అద్భుత ప్రదర్శన కనబరుస్తామని ఆశిస్తున్నా. ఈ మ్యాచ్ గెలిచి మా ఆనందాన్ని రెట్టింపు చేసుకుంటామనే నమ్మకంతో ఉన్నా'అని ధావన్ చెప్పుకొచ్చాడు.

సిరీస్ గెలవలేరు..

సిరీస్ గెలవలేరు..

ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా వర్షంతో మ్యాచ్ ఆగిపోయే సమయానికి 12.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 89 పరుగులు చేసింది. ఓపెనర్ శిఖర్ ధావన్(3) విఫలమైనా శుభ్‌మన్ గిల్(42 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 45 నాటౌట్), సూర్యకుమార్ యాదవ్(25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 34 నాటౌట్) నిలకడగా ఆడారు. కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీకి ఓ వికెట్ దక్కింది. ఈ మ్యాచ్ రద్దవ్వడంతో టీమిండియా సిరీస్ గెలిచే అవకాశం లేకుండా పోయింది. చివరి వన్డేలో విజయం సాధించినా.. సిరీస్ సమం అవుతుంది. ఓడితే న్యూజిలాండ్ వశం అవుతుంది.

Story first published: Sunday, November 27, 2022, 14:08 [IST]
Other articles published on Nov 27, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+