Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అందుకే షెహ్‌బాజ్ అహ్మద్, వాషింగ్టన్ సుందర్‌ను తీసుకున్నాం: శిఖర్ ధావన్

Shikhar Dhawan reveals The reason why India included Washington Sundar and Shahbaz Ahmed in 2nd ODI vs SA

రాంచీ: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో సౌతాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు ఇరు జట్లు రెండేసి మార్పులతో బరిలోకి దిగాయి. అనారోగ్యంతో సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా, షంసీ ఈ మ్యాచ్‌కు దూరంగా కాగా.. రీజా హెండ్రీక్స్, బ్జోర్న్ ఫర్చ్యూన్ జట్టులోకి వచ్చారు. తాత్కలిక సారథి కేశవ్ మహరాజ్ జట్టును నడిపిస్తున్నాడు. భారత జట్టులోకి వాషింగ్టన్ సుందర్, షెహ్‌బాజ్ అహ్మద్ జట్టులోకి రాగా.. రుతురాజ్ గైక్వాడ్, రవి బిష్ణోయ్‌లపై వేటు పడింది. షెహ్‌బాజ్ అహ్మద్‌కు ఇది అరంగేట్ర మ్యాచ్.

అయితే బ్యాటింగ్ డెప్త్ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని టీమిండియా తాత్కలిక సారథి శిఖర్ ధావన్ అన్నాడు. ఇద్దరు స్పిన్ ఆల్‌రౌండర్లు తీసుకోవడం వల్ల అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌కు సమతూకం లభించిందన్నాడు. తొలి వన్డే ఓటమి నేపథ్యంలోనే టీమ్‌మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకుందని చెప్పాడు.

టాస్ గెలిస్తే ఫీల్డింగ్‌నే ఎంచుకునేవాడినని, సెకండ్ ఇన్నింగ్స్‌లో డ్యూ కీలక పాత్ర పోషించనుందన్నాడు. టాస్ గెలిచిన కేశవ్ మహరాజ్.. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉందని భావించి చేజింగ్‌కు మొగ్గు చూపలేదు. ఇక్కడి పరిస్థితులను సరిగ్గా వాడుకోని సిరీస్ గెలవడం కోసం ప్రయత్నిస్తామని కేశవ్ తెలిపాడు.

తుది జట్లు:
భారత్: శిఖర్ ధావన్(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్(కీపర్), వాషింగ్టన్ సుందర్, షెహ్‌బాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ఆవేశ్ ఖాన్

సౌతాఫ్రికా: జన్నెమన్ మలాన్, క్వింటన్ డి కాక్(కీపర్), రిజా హెన్రీక్స్, ఎయిడెన్ మార్క్‌రమ్, హెన్రీచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, వ్యాన్ పార్నెల్, కేశవ్‌ మహరాజ్, ఫర్చ్యూన్, కగిసో రబడా, అన్రిచ్ నోర్జ్

Story first published: Sunday, October 9, 2022, 13:38 [IST]
Other articles published on Oct 9, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+