ఆ ఒక్క ఫీల్డింగ్ మార్పు విజయాన్నందించింది: శిఖర్ ధావన్

పోర్ట్‌ఆఫ్ స్పెయిన్: వెస్టిండీస్‌తో తొలి వన్డేలో తమ విజయానికి గల కారణాన్ని టీమిండియా తాత్కలిక కెప్టెన్ శిఖర్ ధావన్ వెల్లడించాడు. విండీస్ ఇన్నింగ్స్ చివర్లో ఫైన్‌లెగ్ ఫీల్డర్‌ను వెనక్కి పెడుతూ తాము చేసిన మార్పు జట్టు గెలిచేలా చేసిందన్నాడు. శుక్రవారం ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ 3 పరుగులతో గెలుపొందిన విషయం తెలిసిందే. దాంతో మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఈ విజయానంతరం మాట్లాడిన శిఖర్ ధావన్.. ఫైన్‌లెగ్ ఫీల్డర్‌ను వెనక్కిపెట్టడం వల్ల మూడు బౌండరీలు ఆపామని, అవి విజయానికి ఎంతో సహకరించాయని తెలిపాడు. సెంచరీ చేజార్చుకోవడం నిరాశ కలిగించిందన్న గబ్బర్.. తన ఆటను పూర్తిగా ఆస్వాదించానని చెప్పాడు.

ధాటిగా ఆడటమే..
'సెంచరీ చేయకపోవడం నిరాశ కలిగించింది. కానీ నేను చేసిన 97 పరుగులతో సంతృప్తిగానే ఉన్నా. ఈ ఇన్నింగ్స్‌ను పూర్తిగా ఆస్వాదించా. వికెట్‌పై అంటిపెట్టుకోవడంతో పాటు కాస్త టర్న్ ఉండటంతో బ్యాటింగ్‌కు ఇబ్బంది అయింది. నాతో పాటు శుభ్‌మన్, శ్రేయస్ ధాటిగా ఆడి యువ ఆటగాళ్లకు సులువు చేయాలనుకున్నాం. జట్టుగా ప్రత్యర్థి ముందు మంచి లక్ష్యాన్ని ఉంచాం. అయితే ప్రత్యర్థి జట్టు మా లక్ష్యానికి ఇంత చేరువగా వస్తుందని అస్సలు ఊహించలేకపోయాం. దాంతో కాస్త కంగారు పడ్డాం. కానీ ప్రశాంతంగా ఉంటూ మా ప్రణాళికలను పకడ్బందీగా అమలు చేశాం.

ఫైన్ లెగ్ ఫీల్డర్‌ను..
చివర్లో ఫైన్ లెగ్ ఫీల్డర్‌ను వెనక్కిపెట్టడం మాకు మంచి ఫలితాన్ని ఇచ్చింది. అలా చేయడం వల్ల మూడు బౌండరీలు అడ్డుకున్నాం. అవి మా విజయానికి సహకరించాయి. మైదానంలో పెద్ద బౌండరీని వాడుకోవాలని మేం చర్చించుకున్నాం. ఫైన్ లెగ్ వైపు డబుల్స్ మాత్రమే ఇచ్చాం. రనౌట్ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాం. ప్రతీ రోజు మనది కాదు. కాబట్టి మా తప్పులను సరిదిద్దుకొని ఇతర మ్యాచ్‌లకు సిద్దమవుతాం'అని ధావన్ తెలిపాడు. ఆఖరి ఓవర్‌లో విండీస్ విజయానికి 15 పరుగులు అవసరమవ్వగా సిరాజ్ కట్టడిగా బౌలింగ్ చేసి విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.

గర్జించిన గబ్బర్..
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలలో 7 వికెట్లకు 308 పరుగులు చేసింది. కెప్టెన్ శిఖర్ ధావన్ (99 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 97) తృటిలో సెంచరీ చేజార్చుకోగా... శుభ్‌మన్ గిల్ (53 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 64), శ్రేయస్ అయ్యర్ (57 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 54) హాఫ్ సెంచరీలతో రాణించారు. విండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్, గుడకేశ్ మోతీ చెరో 2 వికెట్లు తీయగా.. అకీల్ హోసిన్, రొమరియో షెఫర్డ్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

సిరాజ్ సూపర్ బౌలింగ్..
అనంతరం భారీ లక్ష్యచేధనకు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 305 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. విండీస్ జట్టులో కైల్ మేయర్స్(68 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 75), బ్రాండన్ కింగ్(66 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 54) హాఫ్ సెంచరీలతో రాణించినా.. చివర్లో అకీల్ హోసిన్(32 బంతుల్లో 2 ఫోర్లతో 32 నాటౌట్), రొమారియో షెఫర్డ్ (25 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39 నాటౌట్) చెలరేగినా ఫలితం లేకపోయింది. భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, చహల్ ముగ్గురూ కూడా రెండేసి వికెట్లు తీశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications