Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కిడ్స్ జోన్‌లో టీమిండియా క్రికెటర్ల ఆట పాట!(వీడియో)

Shikhar Dhawan Posts Video Of Rohit Sharma, Rishabh Pant And Kuldeep Yadav Having A Blast In Kids Zone

అహ్మదాబాద్‌: ఇంగ్లండ్‌పై టెస్ట్ సిరీస్ విజయాన్ని భారత క్రికెటర్లు వినూత్న రీతీలో ఆస్వాదిస్తున్నారు. ఆదివారం ఆటగాళ్లంతా చిన్న పిల్లల్లా మారిపోయారు. కిడ్స్ జోన్‌లోకి వెళ్లి ఆస్వాదించారు. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ కోసం టీమ్‌తో కలిసిన ఓపెనర్ శిఖర్ ధావన్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అయింది.

ఈ వీడియోలో మన క్రికెటర్లు విజయం తర్వాత ఎంత జోష్‌లో ఉన్నారో అర్థమవుతుంది. అందులో ధావన్‌తోపాటు రోహిత్ శర్మ, రిషబ్ పంత్‌, కుల్దీప్ యాదవ్ కూడా ఉన్నారు. పిల్లలు ఆడుకునే జోన్‌లోకి వెళ్లి అక్కడి మూడు చక్రాల సైకిల్‌పై తిరుగుతూ, బాల్స్‌తో ఒకరినికొరు కొట్టుకుంటూ సరదాగా గడిపారు. జీవితంలో ఎంత పెద్దగా అయినా చిన్నతనం మాత్రం పోకూడదు. పని ఎంత ముఖ్యమైనా కూడా ఇలాంటి మస్తీ కూడా అవసరమే అని ధావన్ ఆ వీడియోకు క్యాప్షన్‌గా పేర్కొన్నాడు. ఈ పిల్లలు చేస్తున్న మస్తీని నేను రూమ్‌లో నుంచి చూశాను అంటూ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ కామెంట్ చేయడం విశేషం.

తొలి ఇన్నింగ్స్‌లో 160 పరుగులు వెనుకబడిన ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లోనూ కుప్పకూలింది. కేవలం 54.5 ఓవర్లలోనే ఆ జట్టు 135 పరుగులకు ఆలౌటైంది. డాన్‌ లారెన్స్‌ (95 బంతుల్లో 50; 6 ఫోర్లు) మినహా అంతా విఫలయ్యారు. అశ్విన్‌ (5/47), అక్షర్‌ పటేల్‌ (5/48) పోటీ పడి ఐదేసి వికెట్లు పడగొట్టారు. అంతకుముందు భారత్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 365 పరుగులకు ఆలౌటైంది. వాషింగ్టన్‌ సుందర్‌ (174 బంతుల్లో 96 నాటౌట్‌; 10 ఫోర్లు, 1 సిక్స్‌) త్రుటిలో సెంచరీ అవకాశం కోల్పోయాడు. అశ్విన్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌'.... పంత్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' పురస్కారాలు లభించాయి.

ఈ గెలుపుతో వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు కూడా అర్హత సాధించి న్యూజిలాండ్‌తో పోరుకు సిద్ధమైంది. జూన్‌ 18 నుంచి 22 వరకు లండన్‌లోని లార్డ్స్‌ మైదానంలో డబ్ల్యూటీసీ ఫైనల్‌ నిర్వహిస్తారు. భారత్, ఇంగ్లండ్‌ మధ్య ఈ నెల 12 నుంచి అహ్మదాబాద్‌లోనే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ జరుగుతుంది.

Story first published: Sunday, March 7, 2021, 20:15 [IST]
Other articles published on Mar 7, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+