For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గబ్బర్‌తో మిథాలీ రాజ్ ప్రేమాయాణం నిజమేనా? ‘శభాష్ మిథూ’లో ఈ లవ్ స్టోరీ ఉంటుందా?

Shikhar Dhawan Loves Mithali Raj: Will This Pair Get Married?

హైదరాబాద్: భారత మహిళల మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'శభాష్ మిథూ' ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సినిమాలో మిథాలీ జీవిత ప్రయాణాన్ని చూపించనున్నారు. 16 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన మిథాలీ.. 23 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించింది. వ్యక్తిగతంగా మరెన్నో ఘనతలను అందుకుంది. ముఖ్యంగా దేశంలో మహిళల క్రికెట్‌కు ఆదరణ పెరగడంలో కీలక పాత్ర పోషించింది. అందుకే మిథాలీని లేడీ సచిన్‌గా పిలుస్తారు. ఇలా పిలవడం ఆమెకు ఇష్టం లేకున్నా.. క్రికెట్ ప్రేమికులు మాత్రం ఆమెను అలానే గౌరవిస్తారు.

లవ్ స్టోరీ ఉంటుందా?

లవ్ స్టోరీ ఉంటుందా?

అయితే భారత దిగ్గజ క్రికెటర్లు అయిన మహేంద్ర సింగ్ ధోనీ, సచిన్ టెండూల్కర్, అజారుద్దీన్‌ జీవిత కథల ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ మూవీల్లో వారి లవ్ స్టోరీలు చూపించారు. మరి మిథాలీరాజ్ బయోపిక్ 'శభాష్ మిథూ'లో కూడా ఆమె ప్రేమాయణం చూపిస్తారా? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. అసలు ఆమె జీవితంలో ఏదైనా లవ్‌స్టోరీ ఉందా? 39 ఏళ్ల వయసు వచ్చినా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటి? ఏదైనా లవ్ ఫెల్యూర్ స్టోరీ ఉందా? ఇలా అనేక ప్రశ్నలకు 'శభాష్ మిథూ' మూవీలో సమాధానం దొరుకుతుందా? అని ఆమె అభిమానులు ఎదురు చూస్తున్నారు.

హైదరాబాద్ ప్లేయర్‌గా..

హైదరాబాద్ ప్లేయర్‌గా..

1982 డిసెంబర్ 3న రాజస్థాన్‌లోని జోద్‌పూర్‌లో మిథాలీ రాజ్ జన్మించింది. వారి కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడటంతో ఆమె ప్రాథామిక విద్యభ్యాసంతో పాటు క్రికెట్ ఓనమాలను ఇక్కడే నేర్చుకుంది. హైదరాబాద్ అమ్మాయిగానే ప్రపంచానికి పరిచయం అయ్యింది. ఆంధ్రా టీమ్ తరుపున దేశవాళీ క్రికెట్ టోర్నీలు ఆడిన మిథాలీ రాజ్... ఎయిర్ ఇండియా, రైల్వేస్ టీమ్స్‌కు కూడా ప్రాతినిథ్యం వహించింది. 39 ఏళ్ల మిథాలీ రాజ్, ఇప్పటిదాకా ఎందుకు పెళ్లి చేసుకోలేదనేది ఎవ్వరికీ తెలియని విషయం.

క్రికెట్‌కే జీవితం అంకితం..

క్రికెట్‌కే జీవితం అంకితం..

తన జీవితాన్ని క్రికెట్‌కు అంకితం చేయాలనే మిథాలీ పెళ్లి చేసుకోలేదని ఆమె సన్నిహితులు చెప్పే మాట. మిథాలీ రాజ్‌కు 22 ఏళ్లు వచ్చినప్పటి నుంచే ఆమె కోసం పెళ్లి సంబంధాలు చూశారని, క్రికెటర్‌గా బిజీగా ఉండటం మిథాలీరాజ్ పెళ్లి విషయాన్ని పక్కనపెట్టేసిందని సన్నిహితులు పేర్కొన్నారు. ఆమె తల్లి పట్టుబట్టినా మిథాలీ వినలేదని చెప్పారు. అయితే 27-30 ఏళ్లు వచ్చిన తర్వాత మిథాలీ రాజ్ పెళ్లిపై ఆసక్తి కనబర్చినా.. వచ్చిన సంబంధాల్లో చాలా మంది క్రికెట్‌ని వదిలేయాలని చెప్పడంతో మిథాలీ పెళ్లి ఆలోచన పక్కనపెట్టిసిందన్నారు. మిథాలీ సైతం ఓ ఇంటర్వ్యూలో తనకు సింగిల్‌గా ఉండటమే ఇష్టమని స్పష్టం చేసింది.

గబ్బర్‌తో ప్రేమాయణం..

గబ్బర్‌తో ప్రేమాయణం..

టీమిండియా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్‌తో మిథాలీ రాజ్ పీకల్లోతు ప్రేమలో ఉందని గతంలో వార్తలు వచ్చాయి. ఈ ఇద్దరూ వివాహం చేసుకోబోతున్నారని కూడా కొన్ని వెబ్‌సైట్లు రాసాయి. మిథాలీ కోసం ధావన్.. అయేషా ముఖర్జీతో తన 8 ఏళ్ల వైవాహిక జీవితానికి తెరదించుకున్నాడని కూడా ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలపై ఇటు మిథాలీ, అటు ధావన్ ఇంతవరకు స్పందించలేదు. ఈ ప్రచారానికి బలం చేకూర్చే సాక్ష్యాలు కూడా లేవు. ఈ పుకార్లను మిథాలీ సన్నిహితుల వద్ద ప్రస్తావించగా.. ఇవన్నీ గాలి వార్తలేనని వారు కొట్టిపారేసారు. అయితే మిథాలీ పెళ్లి చేసుకోకపోవడానికి బలమైన కారణం ఉంటుందని, అది సినిమాలో చూపిస్తారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

Story first published: Tuesday, July 12, 2022, 12:15 [IST]
Other articles published on Jul 12, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+