ఆ ఒక్క తప్పిదమే సిరీస్ కోల్పోయేలా చేసింది: శిఖర్ ధావన్

క్రైస్ట్ చర్చ్: ఎక్స్‌ట్రా బౌలర్ లేకుండా బరిలోకి దిగడం సిరీస్ కోల్పోయేలా చేసిందని టీమిండియా తాత్కలిక వన్డే కెప్టెన్ శిఖర్ ధావన్ అన్నాడు. న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా బుధవారం జరగాల్సిన ఆఖరి వన్డే వర్షం కారణంగా రద్దయ్యింది. దాంతో తొలి మ్యాచ్‌లో గెలిచిన న్యూజిలాండ్ ఈ వన్డే సిరీస్‌ను 1-0తో కైవసం చేసుకుంది.
మూడో వన్డే రద్దు అనంతరం తమ వైఫల్యంపై స్పందించిన శిఖర్ ధావన్.. వర్షం చికాకుకు గురిచేసిందన్నాడు. తొలి వన్డేలో ఎక్స్‌ట్రా బౌలర్ లేకుండా ఆడటం సిరీస్ ఫలితాన్ని శాసించిందని చెప్పాడు. అప్‌కమింగ్ బంగ్లాదేశ్ పర్యటనలో వర్షంతో ఇబ్బందులుండవని, వరల్డ్‌కప్‌కు కావాల్సిన ప్రిపరేషన్ లభిస్తుందని చెప్పాడు.

బంగ్లాదేశ్ పర్యటన కోసం..
'బంగ్లాదేశ్ పర్యటన కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాం. అక్కడ వాతావరణం మెరుగ్గా ఉంటుంది. మా జట్టు యంగ్ టీమ్. ఈ సిరీస్ ద్వారా బౌలింగ్ విభాగం చాలా నేర్చుకుంది. సరైన ప్రదేశాల్లో బౌలింగ్ ఎలా చేయాలో తెలిసొచ్చింది. తొలి మ్యాచ్‌లో ఎక్స్‌ట్రా బౌలింగ్ ఆప్షన్ లేకపోవడం మా ఓటమిని శాసించింది.
సీనియర్ ఆటగాళ్లంతా బంగ్లాదేశ్ పర్యటనలో రీఎంట్రీ ఇవ్వనున్నారు. వరల్డ్‌కప్ సన్నాహకాలకు ఏషియన్ వికెట్లు సరిగ్గా ఉపయోగపడుతాయి. చిన్న చిన్న విషయాలను సరిచేసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా బౌలర్లు రైట్ లెంగ్త్ వేయడం, బ్యాటర్లు పరిస్థితులకు తగ్గట్లు శరీరానికి దగ్గరిగా ఆడటం వంటివి నేర్చుకోవాలి.

బ్యాటింగ్ వైఫల్యం..
భారత్-న్యూజిలాండ్ మూడో వన్డే వర్షం కారణంగా రద్దయ్యింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 47.3 ఓవర్లలో 219 పరుగులు మాత్రమే చేసింది. వాషింగ్టన్ సుందర్(64 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 51) ఒక్కడే హాఫ్ సెంచరీతో జట్టు పరువును కాపాడగా.. మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. సూర్య, అయ్యర్, దీపక్ హుడాలు కూడా జట్టుకు అండగా నిలవలేకపోయారు.

కివీస్ ధనాధన్ బ్యాటింగ్..
న్యూజిలాండ్ బౌలర్లలో ఆడమ్ మిల్నే, డారిల్ మిచెల్ మూడేసి వికెట్లు తీయగా.. లాకీ ఫెర్గూసర్, మిచెల్ సాంట్నర్ తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన న్యూజిలాండ్ వర్షంతో మ్యాచ్ ఆగిపోయే సరికి 18 ఓవర్లలో వికెట్ నష్టానికి 104 పరుగులు చేసింది. వర్షం ఆగకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications