Shikhar Dhawan: సినిమాల్లోకి గబ్బర్ ఎంట్రీ.. ఆ సినిమాతో అరంగేట్రం! ఫొటోలు వైరల్!

న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ నటుడిగా మారనున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. చాలా కాలంగా అతను వెండి తెరపై కనిపించనున్నాడనే ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా ఈ విషయంపై క్లారిటీ వచ్చింది. ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్స్ సోనాక్షి సిన్హా, హ్యూమా ఖురేషీ ప్రధాన పాత్రల్లో నటించిన 'డబుల్ ఎక్స్‌ఎల్ ' సినిమాలో ధావన్ అతిథి పాత్రలో నటించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఒక ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ ఫొటోలో శిఖర్ ధావన్.. హ్యూమాతో కలిసి డ్యాన్స్ చేస్తున్నాడు. ఈ ఫొటోను హ్యూమా రీట్వీట్ చేయడంతో గబ్బర్ వెండితెర ఎంట్రీ ఖాయమనే విషయం స్పష్టమైంది.
ధావన్ సైతం..
ఇక తన సినిమా అరంగేట్రం గురించి ధావన్ తాజాగా ఓ మీడియా సంస్థతో మాట్లాడాడు. ''దేశం తరఫున ఆడే నా లాంటి అథ్లెట్ జీవితం క్షణం ఖాళీ లేకుండా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ నేను తీరిక చేసుకుని అప్పుడప్పుడు మంచి సినిమాలు చూస్తుంటాను. ఈ సినిమా అవకాశం నాకు వచ్చినప్పుడు ముందు కథ విన్నాను. అది నా మనసును తాకింది. ఈ చిత్రం సమాజానికి మంచి సందేశాన్నిస్తుంది. మనం ఎలా ఉన్నా.. మన కలలను నెరవేర్చుకోవచ్చన్న విశ్వాసాన్ని నింపుతుంది'' అని ధావన్ చెప్పుకొచ్చాడు.

సైజ్ జీరో తరహాలో..
సతరమ్ రమానీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సోనాక్షి, హ్యూమా ఖురేషి లావుగా ఉండే అమ్మాయిల్లా కన్పించనున్నారు. సమాజంలో బొద్దుగా ఉండే మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంతో వినోదాత్మకంగా తీర్చిదిద్దిన ఈ సినిమా నవంబరు 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ ఆకట్టుకుంటోంది. గతంలో సౌతిండియా హీరోయిన అనుష్క శర్మ సైతం ఇదే తరహా 'సైజ్ జీరో' చిత్రంలో నటించి చేతులు కాల్చుకుంది. మరీ ఈ బాలీవుడ్ హీరోయిన్ల పరిస్థితి ఏంటోనని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

సినిమాల్లో క్రికెటర్ల సెకండ్ ఇన్నింగ్స్..
శిఖర్ ధావన్ సినిమాల్లోకి రానున్నట్లు గతంలోనూ వార్తలు వచ్చాయి. ఆ మధ్య అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న 'రామ్‌సేతు' సినిమా సెట్‌లో ధావన్ కన్పించాడు. దీంతో ఈ సినిమాలో అతడు నటిస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగింది. అయితే అందులో ధావన్ నటించట్లేదని ఆ తర్వాత నిర్మాణ సంస్థ వెల్లడించింది. గబ్బర్‌కు నటనపై ఆసక్తి ఎక్కువే. అనేక సందర్భాల్లో సోషల్ మీడియాలో పలు రీల్స్ చేస్తూ ఆకట్టుకున్నాడు. కాగా.. ఇప్పటికే క్రికెటర్లు ఇర్ఫాన్ పటాన్, శ్రీశాంత్, హర్హజన్ సింగ్ సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. మాజీ క్రికెటర్ సురేశ్ రైనా కూడా వెండితెరపై కన్పించే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications