Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Shikhar Dhawan: రిటైర్మెంట్ ప్రకటించిన గబ్బర్..!(వీడియో)

టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ రిటైర్మెంట్‌ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు దేశవాళీ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు తెలిపాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా గబ్బర్ ఓ వీడియోను షేర్ చేశాడు. 12 ఏళ్ల తన సుదీర్ఘ కెరీర్‌కు అండగా నిలిచిన భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ), ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ)లకు శిఖర్ ధావన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు.

క్లిష్ట సమయంలోనూ మద్దతు తెలిపిన ఫ్యాన్స్ కృతజ్ఞతలు చెప్పాడు. 2010-2022 వరకు భారత్ తరఫున శిఖర్ ధావన్ 167 వన్డేలు, 34 టెస్ట్‌లు, 68 టీ20లు ఆడాడు. వన్డేల్లో 6793, టెస్ట్‌ల్లో 2315 పరుగులు చేశాడు. టీ20ల్లో 1759 రన్స్ చేసిన గబ్బర్.. వన్డేల్లో 17, టెస్ట్‌ల్లో 7 సెంచరీలు నమోదు చేశాడు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు.

Shikhar Dhawan announces retirement from international and Domestic cricket

దేశవాళీ క్రికెట్‌కు కూడా దూరంగా ఉంటానని చెప్పిన గబ్బర్.. ఐపీఎల్‌కు వీడ్కోలు పలకడంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. టీమిండియాకు ఆడటం తన కలని, అది నేరవేరిందని శిఖర్ ధావన్ వీడియోలో పేర్కొన్నాడు. 'నాకు ఒకే ఒక కల ఉండేది. అది టీమిండియాకు ఆడటం. ఆ లక్ష్యాన్ని నేను అందుకున్నాను. నా క్రికెట్ జర్నీలో ఎంతో మంది అండగా నిలిచారు.

వారందరికీ ధన్యవాదాలు. ముందుగా నా కుటుంబానికి, చిన్ననాటి కోచ్ దివంగత తారక్ సిన్హా‌కు, క్రికెట్ బేసిక్స్ నేర్పిన మదన్ శర్మకు కృతజ్ఞతలు. నా క్రికెట్ సహచరులతో పాటు నాకు ఫేమ్ ఇచ్చి ప్రేమను పంచిన అభిమానులకు స్పెషల్ థ్యాంక్స్. పూర్తి కథను చదవాలంటే పేజీని తిరగేయాలనే గొప్ప నానుడీ ఉంది. దాన్ని నేను చేయబోతున్నాను. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు దేశవాళీ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నాను.

దేశం తరఫున సుదీర్ఘ కాలం ఆడినందుకు సంతృప్తిగా ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన బీసీసీఐ, డీడీసీఏకు ధన్యవాదాలు. కొన్నేళ్లుగా నాపై ప్రేమను చూపిస్తున్న అభిమానులకు కృతజ్ఞతలు. నా అంతరాత్మకు ఒకటే చెప్పుకుంటా.. మళ్లీ టీమిండియా తరఫున ఆడలేమని బాధపడవద్దు. టీమిండియాకు సుదీర్ఘ కాలం ఆడినందుకు సంతోషంగా ఉన్నాను. 'అని ధావన్ ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు.

2010లో ఆస్ట్రేలియాతో విశాఖపట్నం వేదికగా జరిగిన మ్యాచ్‌తో శిఖర్ ధావన్ అరంగేట్రం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలో కలిపి 10వేలకు పైగా పరుగులు చేశాడు. ధోనీ సారథ్యంలో టీమిండియా గెలిచిన 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో గబ్బర్ కీలక పాత్ర పోషించాడు.

Story first published: Saturday, August 24, 2024, 8:27 [IST]
Other articles published on Aug 24, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+