For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Shikhar Dhawan-Ayesha Mukherjee ప్రేమ అలా మొదలై.. ఇలా ముగిసింది! ఇంతకీ ఎవరీ అయేషా?!!

Shikhar Dhawan And Ayesha Mukherjee Love Story To Divorce Story

హైదరాబాద్: టీమిండియా సీనియర్ ఓపెనర్ శిఖర్‌ ధావన్, ఆతడి సతీమణి అయేషా ముఖర్జీ విడిపోయారు. ఈ విషయాన్ని అయేషా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. దీంతో ఈ జంట ఒక్కసారిగా అందరికి షాక్‌ ఇచ్చింది. విడిపోవడానికి అసలు కారణం ఏంటో ఆమె చెప్పలేదు. దీంతో ఎప్పుడూ కలిసిమెలిసి ఉన్న ఈ జోడి ఎందుకు విడిపోయిందో అని ఫాన్స్ అనుకుంటున్నారు. అయేషాను ప్రేమించిన ధావన్‌ 2012లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు 2014లో కుమారుడు జొరావర్ జన్మించాడు. దాదాపు తొమ్మిది ఏళ్ల కలిసి ఉన్న తర్వాత అయేషా ఇలాంటి ప్రకటన చేయడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.

భావోద్వేగపూరిత పోస్టు

భావోద్వేగపూరిత పోస్టు

విడాకుల గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో అయేషా ముఖర్జీ భావోద్వేగపూరితంగా ఓ పోస్టు పెట్టింది. రెండో సారి విడాకులు తీసుకునే వరకు విడాకులు అనే పదం తనకు చెత్త పదంగా అనిపించేదని అయేషా పేర్కొంది. 'మొదటిసారి విడాకులు తీసుకున్నప్పుడు నేను చాలా భయపడ్డా. ఏదో తప్పు చేస్తున్నానా అని అనిపించింది. జీవితంలో నేనేదో కోల్పోయినట్లు బాధపడ్డాను. నా స్వార్థం కోసం తల్లిదండ్రులు,పిల్లలను ఇబ్బంది పెడుతున్నానని అనుకున్నాను. అలాంటిది ఇప్పుడు రెండోసారి విడాకులు తీసుకోబోతున్నాను. జీవితంలో నేను నేంటో నిరూపించుకోవడానికి ఇంకా చాలా చేయాల్సి ఉంది' అంటూ అయేషా రాసుకొచ్చింది.

వ్యాపారవేత్తతో పెళ్లి

వ్యాపారవేత్తతో పెళ్లి

పశ్చిమ బెంగాల్‌కి చెందిన అయేషా ముఖర్జీ కుటుంబం ఆమె 8 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడే ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌కు వెళ్లిపోయింది. వ్యాపారం కారణంగా అక్కడే స్థిరపడింది. కిక్ బాక్సింగ్‌లో ప్రావీణ్యం పొందిన అయేషా.. జాతీయ స్థాయి కిక్‌ బాక్సర్‌గా ఎదిగింది. శిఖర్ ధావన్‌ను వివాహం చేసుకోవడానికి ముందు ఆయేషా.. ఆస్ట్రేలియా వ్యాపారవేత్తను పరిణయం ఆడింది. అయితే కొన్నాళ్లకే వారి వైవాహిక బంధానికి తెరపడింది. వాళ్ల దాంపత్య జీవితానికి గుర్తుగా ఇద్దరు ఆడ పిల్లలు కూడా ఉన్నారు. విడాకుల అనంతరం పిల్లలను చూసుకుంటూ ఆయేషా ఆస్ట్రేలియాలోనే ఉండిపోయింది.

అచ్చం ఎంఎస్ ధోనీలాగే.. భారత ఆల్‌రౌండర్‌ హెలికాప్టర్‌ షాట్‌ ఇరగదీశాడుగా! అందుకోసమేనా ఈ భారీ షాట్లు(వీడియో)!

ఫేస్‌బుక్ ద్వారా

ఫేస్‌బుక్ ద్వారా

శిఖర్ ధావన్‌తో అయేషా ముఖర్జీ మొదటి పరిచయం ఫేస్‌బుక్ ద్వారా జరిగింది. వీరిద్దరికి టీమిండియా వెటరన్‌ క్రికెటర్ హర్భజన్ సింగ్ కామన్ ఫ్రెండ్. భజ్జీ ఫేస్‌బుక్‌లో అయేషా ఫోటోను చూసిన గబ్బర్.. తొలి చూపులోనే ప్రేమలో పడ్డాడు. వెంటనే ఫ్రెండ్ రిక్వెస్ట్ కూడా పంపాడు. ఈ విషయం హర్భజన్‌తో మాట్లాడిన అనంతరం ధావన్‌ రిక్వెస్ట్ ఒకే చెప్పింది. దాంతో ధావన్‌కు లైన్‌ క్లియర్‌ అయిపోయింది. అలా స్నేహంతో మొదలైన ఆ పరిచయం ప్రేమగా మారింది. తరువాత వీరిద్దరూ పెళ్లి చేసుకోవడానకి నిశ్చయించుకున్నారు. అయితే ఈ పెళ్లికి ధావన్‌ కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. గబ్బర్ కంటే అయేషా దాదాపు 10 ఏళ్లు పెద్ద కావడం, అప్పటికే ఇద్దరు పిల్లలుఉండడం ఇందుకు ఒక కారణమని అప్పట్లో వార్తలు వచ్చాయి.

తల్లి అంగీకారంతో

తల్లి అంగీకారంతో

శిఖర్ ధావన్ తన తల్లి అంగీకారంతో 2009లో ఇంటి నుంచి బయటకు వచ్చి.. 2012 సంవత్సరంలో అయేషా ముఖర్జీని పెళ్లి చేసుకున్నాడు. అయేషాకు అప్పటికే ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు. అయితే వారిద్దరిని తన పిల్లలుగానే ప్రకటించిన ధావన్‌.. బాధ్యతను కూడా తీసుకొన్నాడు. వారిని ఆస్ట్రేలియాలోనే ఉంచి చదివించాడు.

సెలవులు దొరికినప్పుడు ఇంటికి వచ్చేవారు. వారితో గబ్బర్ సంతోషంగా గడిపేవాడు. లాక్ డౌన్ సమయంలోనూ అయేషాతో గబ్బర్ టిక్ టాక్ వీడియోలు చేశాడు. ఎప్పుడూ సంతోషంగా, హుషారుగా కనిపించే ఈ జంట ఉన్నట్టుండి ఈ నిర్ణయం తీసుకోవడం అభిమానులను షాక్‌కు గురిచేస్తోంది. ప్రస్తుతం యూఏఈలో ఉన్న ధావన్ ఈ విషయంపై ఇంతవరకు స్పందించలేదు.

Story first published: Wednesday, September 8, 2021, 18:53 [IST]
Other articles published on Sep 8, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+