Shikhar Dhawan: మాకు ఇదో గోల్డెన్ చాన్స్.. కెప్టెన్ టెస్ట్‌కు నేను రెడీ!

ముంబై: భారత జట్టుకు సారథ్యం వహించడం తనకు కొత్త సవాల్ అని స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ అన్నాడు. ఈ నెల 13 నుంచి జరిగే మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌ల్లో ధావన్ కెప్టెన్సీలోని భారత జట్టు సోమవారం శ్రీలంకకు బయల్దేరింది. ముంబైలో 14 రోజుల క్వారంటైన్ ముగించుకున్న 20 మంది సభ్యులతో కూడిన టీమ్.. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో కలిసి సమరోత్సాహంతో లంక ఫ్లైట్ ఎక్కింది.
ఈ పర్యనకు బయల్దేరే ముందు జరిగిన వర్చువల్ మీడియా కాన్ఫరెన్స్‌లో కోచ్ ద్రవిడ్‌తో కలిసి ధావన్ మాట్లాడాడు. ఈ టూర్‌కు ముందు రెండు వారాల క్వారంటైన్ తమకు చాలా ఉపయోగపడిందన్నాడు. ఈ సమయంలో ప్లేయర్ల మధ్య టీమ్ బాండింగ్ పెరిగిందని, అది గ్రౌండ్‌లో పెర్ఫామెన్స్‌పై ప్రభావం చూపిస్తుందని చెప్పాడు.
ఆత్మవిశ్వాసంతో..
పలువురు కొత్త ఆటగాళ్లతో కూడిన టీమ్ చాలా బాగుందని శిఖర్ ధావన్ అన్నాడు. 'ఇది చాలా మంచి టీమ్. అందరిలో పాజిటివిటీ, కాన్ఫిడెన్స్ ఉంది. ఈ టూర్లో సత్తా చాటుతాం అని ప్రతి ఒక్కరూ నమ్మకంగా ఉన్నారు. అదే టైమ్‌లో అందరిలో చాలా ఉత్సాహం ఉంది. నా వరకు ఇది కొత్త చాలెంజ్. అలాగే, మా టాలెంట్‌ను చూపించేందుకు ఇదో గొప్ప అవకాశం. గ్రౌండ్‌లోకి వచ్చేందుకు ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఉన్నారు. సిరీస్ కోసం ఎదురు చూస్తున్నారు'అని గబ్బర్ చెప్పుకొచ్చాడు.

కుర్రాళ్లు బాగున్నారు
ఈ టూర్లో ఐపీఎల్ యంగ్‌స్టర్ దేవదత్ పడిక్కల్, పృథ్వీ షా బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. వీరితో పాటు రుతురాజ్ గైక్వాడ్, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, స్పిన్ ద్వయం యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్ కూడా చాన్నాళ్ల తర్వాత కలిసి ఆడే చాన్స్ ఉంది. ఓవరాల్‌గా సీనియర్లు, యంగ్‌స్టర్స్‌తో టీమ్ బ్యాలెన్స్‌డ్‌గా ఉందని ధావన్ అంటున్నాడు. 'కుర్రాళ్లు స్మార్ట్ వర్క్ చేస్తున్నారు. మ్యాచ్‌ల కోసం ఎదురు చూస్తున్నారు. టీమ్‌లోని చాలా మంది ప్లేయర్లు ఇప్పటికే బాగా పెర్ఫామ్ చేశారు. ఓవరాల్‌గా టీమ్ ఎక్స్‌పీరియన్స్, యూత్‌తో చాలా బాగుంది.

గౌరవంగా...
అందరు ప్లేయర్ల మధ్య సానుకూల వాతావరణం తేవడంపై ఫోకస్ పెట్టా. కెప్టెన్‌గా టీమ్‌ను నడిపించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. కెప్టెన్‌గా టీమ్‌గా నడిపించే చాన్స్ కోసం ఎదురు చూస్తున్నా. అదే టైమ్‌లో ఓ టీమ్‌గా మేం రాహుల్ భయ్యా (ద్రవిడ్)తో కలిసి పని చేసేందుకు ఆతృతగా ఉన్నాం. ద్రవిడ్ కోచింగ్‌లో నేను ఓసారి ఇండియా--ఎ తరఫున ఆడా. కాబట్టి ప్రస్తుత టీమ్‌లో ఉన్న మెంబర్స్ అందరం బాగా కలిసిపోతామనుకుంటున్నా. కోచ్, సపోర్ట్ స్టాఫ్, మేం అంతా ఈ సిరీస్ కోసం ఆతృతగా ఉన్నాం' అని ధావన్ చెప్పుకొచ్చాడు.

తొలిసారి కోచ్‌గా ద్రవిడ్..
ఈ ఏడాది చివర్లో టీ20 వరల్డ్‌కప్‌నకు ముందు ఆడనున్న ఈ లిమిటెడ్ ఓవర్ల సిరీస్‌లో శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్, హార్దిక్ పాండ్యా వంటి సీనియర్లతో పాటు ఆరుగురు అన్‌క్యాప్డ్ ప్లేయర్లు పోటీ పడుతున్నారు. ఈ టూర్లో సత్తా చాటి టీ20 వరల్డ్‌కప్‌లో ప్లేస్ దక్కించుకోవాలని సీనియర్లతో పాటు యంగ్‌స్టర్స్ భావిస్తున్నారు. ఇండియా-ఎ, అండర్-19 కోచ్‌గా ఎంతో సక్సెస్ సాధించి, ఎంతో మంది యంగ్‌స్టర్స్‌ను తీర్చిదిద్దిన రాహుల్ ద్రవిడ్ తొలిసారి నేషనల్ టీమ్‌కు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ టూర్ విషయంలో తన ఆలోచన చాలా క్లియర్‌గా ఉందని ద్రవిడ్ తెలిపాడు. టూర్లో తమ ప్రధాన టార్గెట్ సిరీస్‌లు నెగ్గడమే అని చెప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications