For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కేవలం ఏడు రోజులు.. ఐపీఎల్, పీఎస్ఎల్ టైటిల్స్ గెలిచిన కరేబియన్ క్రికెటర్!!

Sherfane Rutherford lifting IPL 2020 and PSL 2020 Trophies

హైదరాబాద్: పాకిస్థాన్ సూపర్ లీగ్‌ (పీఎస్ఎల్) 2020 టైటిల్‌ను కరాచీ కింగ్స్ కైవసం చేసుకుంది. మంగళవారం జరిగిన తుది పోరులో కరాచీ 5 వికెట్ల తేడాతో లాహోర్‌ ఖలందర్స్‌ను ఓడించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన లాహోర్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 134 పరుగులు చేసింది. తమిమ్‌ ఇక్బాల్‌ (35) టాప్‌ స్కోరర్‌. వకాస్‌ మహ్మద్‌, అర్షద్‌ ఇక్బాల్‌ తలో రెండు వికెట్లు తీశారు. లక్ష్య ఛేదనలో బాబర్‌ అజామ్‌ (63) హాఫ్ సెంచరీ చేయడంతో కరాచీ 18.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కరాచీకి ఇదే తొలి పీఎస్‌ఎల్‌ టైటిల్‌.

రెండు టీ20 టైటిళ్లు:

రెండు టీ20 టైటిళ్లు:

ఐపీఎల్ 2020లో ముంబై ఇండియన్స్ తరఫున బరిలో దిగిన కరేబియన్ క్రికెటర్ షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్.. పీఎస్ఎల్ 2020‌లో కరాచీ కింగ్స్ తరఫున ఆడాడు. నవంబర్ 10న ఐపీఎల్ టైటిల్ గెలిచిన జట్టులో భాగమైన రూథర్‌ఫోర్డ్.. నవంబర్ 17న కరాచీ తరఫున కప్ కొట్టాడు. ఒక వారం వ్యవధిలో రెండు టీ20 టైటిళ్లు కొట్టిన ఆటగాడిగా రూథర్‌ఫర్డ్ నిలిచాడు. ఐపీఎల్ 2020 సీజన్‌లో రూథర్‌ఫర్డ్‌ ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడలేదు. ముంబై జట్టు ఫైనల్‌తో సహా 16 మ్యాచ్‌లాడినా.. ఆఖరి వరకు రూథర్‌ఫర్డ్ రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఇక పీఎస్ఎల్ 2020‌లో మాత్రం రెండు మ్యాచులు ఆడాడు. ఫైనల్లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు.

ముంబై ఇండియన్స్ గ్లోవ్స్‌తోనే:

ముంబై ఇండియన్స్ గ్లోవ్స్‌తోనే:

ఐపీఎల్ టైటిల్ గెలవగానే.. ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు ధరించే డ్రెస్‌లో దుబాయ్ నుంచి పాకిస్థాన్ వెళ్లిన షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్.. నవంబర్ 14న జరిగిన తొలి ప్లేఆఫ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ గ్లోవ్స్‌తో బరిలో దిగాడు. దీంతో పీఎస్ఎల్ లీగ్‌ను ఫ్యాన్స్ ట్రోల్ చేశారు. కనీసం ఆటగాళ్ల కిట్లకు కూడా దిక్కులేదా అని కొందరు ఎత్తిపొడిశారు. సొంత డబ్బులతో లీగ్ నిర్వహించలేరా? అని మరికొందరు విమర్శించారు. కానీ ముంబై ఇండియన్స్ గ్లోవ్స్ ధరించడమే ఆ జట్టుకు కలిసొచ్చిందేమో. కరాచీ తొలిసారి పీఎస్ఎల్ టైటిల్ గెలిచింది. దీంతో ఆ జట్టు ఆటగాళ్లు సంబరాల్లో మునిగితేలారు.

నేరుగా పాక్ గడ్డకు:

నేరుగా పాక్ గడ్డకు:

పీఎస్‌ఎల్ 2020 సీజన్ వాస్తవానికి మార్చిలోనే ముగియాల్సింది. కానీ కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు నిలిచిపోయాయి. అప్పట్లో వాయిదాపడిన టోర్నీ చివరి భాగాన్ని ఇప్పుడు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నిర్వహిస్తోంది. దాంతో ఐపీఎల్ 2020 సీజన్ ముగియగానే.. పీఎస్‌ఎల్‌లో ఆడే విదేశీ క్రికెటర్లు నేరుగా పాక్ గడ్డకు చేరుకున్నారు. ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ ఆటగాడు రూథర్‌ఫర్డ్ కూడా అక్కడి వెళ్లగా.. అతనికి కిట్‌ని కరాచీ కింగ్స్ ఫ్రాంఛైజీ మ్యాచ్ సమయానికి సమకూర్చలేకపోయింది. దాంతో ముంబై ఇండియన్స్ కిట్‌తోనే అతను బరిలోకి దిగాడు.

అచ్చం ముంబైలానే:

అచ్చం ముంబైలానే:

మరోవైపు ఐపీఎల్ 2020 ఫైనల్లో ముంబై ఇండియన్స్ మరో 8 బంతులు మిగిలి ఉండగా.. ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓపెనర్ రోహిత్ శర్మ (68) హాఫ్ సెంచరీ చేశాడు. పీఎస్ఎల్ 2020‌లోనూ కరాచీ కింగ్స్ జట్టు అచ్చం అలాగే గెలుపొందింది. మరో 8 బంతులు మిగిలి ఉండగా.. ఐదు వికెట్ల తేడాతో కరాచీ విజయం సాధించింది. ఓపెనర్ బాబర్‌ అజామ్‌ హాఫ్ సెంచరీ బాదాడు. దీంతో కరాచీ కూడా ముంబై మాదిరిగానే విజయాన్ని అందుకుంది అని ఫ్యాన్స్ అంటున్నారు.

IPL vs PSL: పీఎస్‌ఎల్‌ మొత్తం ప్రైజ్ మనీ.. ఐపీఎల్‌లో నాలుగో స్థానంలో నిలిచిన జట్టు కంటే తక్కువ!!

Story first published: Wednesday, November 18, 2020, 15:35 [IST]
Other articles published on Nov 18, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+