IPL vs PSL: పీఎస్‌ఎల్ మొత్తం ప్రైజ్ మనీ.. ఐపీఎల్‌లో నాలుగో స్థానంలో నిలిచిన జట్టు కంటే తక్కువ!!

హైదరాబాద్: కరాచీ కింగ్స్ జట్టు పాకిస్థాన్ ప్రిమియర్ లీగ్ (పీఎస్‌ఎల్) టైటిల్‌ను కైవసం చేసుకుంది. మంగళవారం జరిగిన ఫైనల్ మ్యాచులో కరాచీ 5 వికెట్ల తేడాతో లాహోర్ ఖలందర్స్‌ను ఓడించింది. కరాచీకి ఇదే తొలి పీఎస్‌ఎల్ టైటిల్. మార్చిలో పూర్తవ్వాల్సిన పీఎస్‌ఎల్ ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు కరోనా మహమ్మారి కారణంగా నిలిచిపోయాయి. ఆ తర్వాత ఐపీఎల్ 2020 సీజన్ అడ్డంకిగా నిలిచింది. చివరకు ఐపీఎల్ ముగియడంతో పీఎస్‌ఎల్‌కు లైన్ క్లియర్ అయింది. మంగళవారం రాత్రి జరిగిన ఫైనల్‌తో పీఎస్‌ఎల్ 2020 సీజన్‌కు సక్సెస్‌ఫుల్‌గా ఎండ్ కార్డ్ పడింది.

ఐపీఎల్‌తో పోటీ పడలేవు
పీఎస్ఎల్ ప్రారంభమైన నాటి నుంచి ప్రతి విషయంలో ఈ లీగ్‌ను ఐపీఎల్‌తో పోల్చుతున్నారు. ఐపీఎల్‌తో పోల్చుకుంటే పీఎస్ఎల్ ఎందులోనూ తక్కువ కాదు అని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ అన్నాడు. కానీ ప్రపంచంలోనే బలమైన క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐ కనుసన్నల్లో నడుస్తోన్న ఐపీఎల్‌లో ప్రైజ్ మనీ, ఆటగాళ్లకు ఇచ్చే వేతనాలు, స్పాన్సర్ల ద్వారా వచ్చే ఆదాయం భారీ మొత్తంలో ఉంటుంది. పీఎస్‌ఎల్‌లో మాత్రం ఇలా ఉండదు. పీఎస్‌ఎల్ మాత్రమే కాదు ఏటా జరిగే ఏ లీగ్‌లలో అయినా ప్రైజ్ మనీ విషయంలో ఐపీఎల్‌తో పోటీ పడలేవు.

రూ.20 కోట్లు vs రూ.3.75 కోట్లు
యూఏఈ వేదికగా ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 2020 విజేత ముంబై ఇండియన్స్ జట్టుకు రూ.20 కోట్లు ప్రైజ్ మనీ దక్కింది. రన్నరప్‌గా నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రూ.12.5 కోట్లు అందుకుంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ సీజన్ ప్రారంభానికి ముందు ప్రైజ్ మనీలో సగం కోత విధిస్తున్నట్లు ప్రకటించిన బీసీసీఐ.. ఆ తర్వాత మాత్రం మనసు మార్చుకుంది. ఇక పీఎస్‌ఎల్ 2020 విజేతగా నిలిచిన కరాచీ కింగ్స్ జట్టుకు రూ.3.75 కోట్లు.. రన్నరప్‌గా నిలిచిన లాహోర్ ఖలందర్స్ జట్టుకు రూ.1.5 కోట్ల చొప్పున ప్రైజ్ మనీ దక్కింది. అంటే ఐపీఎల్ ప్రైజ్ మనీ దాదాపు పీఎస్‌ఎల్ కంటే ఆరు రెట్లు ఎక్కువ.

పీఎస్ఎల్ మొత్తం ప్రైజ్ మనీ రూ.7.5 కోట్లు
ఐపీఎల్ 2020లో ప్లేఆఫ్ చేరి మూడు, నాలుగో స్థానాల్లో నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీలకు రూ.8.75 కోట్ల చొప్పున ప్రైజ్ మనీ దక్కింది. ఇక పీఎస్ఎల్‌లో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లకు మాత్రం అసలు ప్రైజ్ మనీనే లేదు. పీఎస్ఎల్‌లో మొత్తం ప్రైజ్ మనీ రూ.7.5 కోట్లు. అంటే ఐపీఎల్‌లో నాలుగో స్థానంలో నిలిచిన జట్టు కంటే.. పీఎస్ఎల్‌లో మొత్తం ప్రైజ్ మనీ కూడా తక్కువే.

ప్లేయర్స్ అవార్డుల్లో మాత్రం
ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ, బెస్ట్ బ్యాట్స్‌మెన్, బెస్ట్ బౌలర్, బెస్ట్ ఫీల్డర్, బెస్ట్ వికెట్ కీపర్, ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డులను గెలుచుకున్న ఆటగాళ్లకు పీఎస్ఎల్‌లో రూ.10 లక్షల చొప్పున ప్రైజ్ మనీ దక్కింది. ఐపీఎల్ 2020లోనూ ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్, ఎమర్జింగ్ ప్లేయర్, మోస్ట్ సిక్సెస్ అవార్డు, పవర్ ప్లేయర్ అవార్డ్‌లను గెలుచుకున్న వారికి కూడా రూ.10 లక్షల చొప్పున ప్రైజ్ మనీ అందింది. ఈ విషయంలో మాత్రం పీఎస్ఎల్.. ఐపీఎల్‌తో సమానంగా ఉంది.
'కోహ్లీ ప్రతి బంతి బౌండరీ లక్ష్యంగా ఆడుతాడు.. గొప్ప ఆటగాళ్లలో ప్రత్యేకత అదే'
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications