చాహల్ వద్దు.. కోహ్లీ లాంటోడు కావాలి: బిగ్ బాస్ బ్యూటీ
టీమిండియా వెటరన్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌తో తాను డేటింగ్ చేస్తున్నట్లు వచ్చిన వార్తలను బిగ్‌బాస్ 13 ఫేమ్, ప్రముఖ స్పోర్ట్స్ యాంకర్ షెఫాలీ బగ్గా కొట్టిపారేసింది. ఇలాంటి వార్తలతో తాను విసిగిపోయానని అసహనం వ్యక్తం చేసింది. కలిసి డిన్నర్ చేసినంత మాత్రాన డేటింగ్ అంటూ ప్రచారాం చేస్తారా? అని మండిపడింది.
యుజ్వేంద్ర చాహల్‌తో కలిసి షెఫాలీ బగ్గా ఉన్న వీడియో ఒకటి వైరల్ కావడంతో ఈ ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారనే పుకార్లు వెలువడ్డాయి. తాజాగా ఈ వార్తలపై స్పందించిన షెఫాలీ బగ్గా.. తనకు చాహల్ వద్దని, కోహ్లీలాంటి అబ్బాయి కావాలని పేర్కొంది. ఇలాంటి చిన్న చూపుతో తాను విసిగిపోయానని పేర్కొంది. వాస్తవం ఏంటో తనకు, తన ఆత్మీయులకు తెలుసు అని పేర్కొంది. తనకు క్రికెటర్లతో డేటింగ్ చేసే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది.

'ఇది నా వృత్తి. నా ప్రొఫెషన్, వ్యక్తిగత జీవితాన్ని కలిపే ఉద్దేశం అస్సలు లేదు. అందుకే క్రికెటర్లతో డేటింగ్ చేసే ఆలోచన నాకు లేదు. నాకు విరాట్ కోహ్లీ లాంటి భాగస్వామి కావాలి. అతను ఎంత బిజీగా ఉన్నా అనుష్క పట్ల చూపించే ప్రేమ, అంకితభావం, ఆరాధన నాకు చాలా ఇష్టం.
నా భాగస్వామి నాతో ఉన్నప్పుడు పూర్తిగా నాకే సమయం కేటాయించాలి. నాపైనే పూర్తి శ్రద్ద పెట్టాలి. నా పార్ట్‌నర్‌కు లగ్జరీల కంటే ప్రేమించే మనసు,నన్ను కేర్ చేసే గుణం ఉంటే చాలు. ప్రస్తుతానికి ప్రేమ, పెళ్లి లాంటి విషయాల కంటే నా కెరీర్‌కే అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాను. 'అని షెఫాలీ బగ్గా చెప్పుకొచ్చింది. ఐపీఎల్ లాంటి ప్రతిష్టాత్మక టోర్నీలకు యాంకర్‌గా వ్యవహరిస్తున్న షెఫాలీ.. త్వరలో బాలీవుడ్, సౌత్ ఇండియన్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాల వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications