'ఏ జట్టూ రాణించనపుడు భారత్‌నే టార్గెట్ చేస్తారేం'?

హైదరాబాద్: విదేశాల్లో టీమిండియా చతికిలపడటం కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది. సొంతగడ్డపై రెచ్చిపోయి విజృంభించే భారత ఆటగాళ్లు విదేశీ పిచ్‌లపై పేలవంగా చేతులెత్తేస్తున్నారు. దీనిపై ఇప్పటికే ఎన్నో విమర్శలు వస్తూనే ఉన్నాయి. అయితే కోచ్ రవిశాస్త్రి మాత్రం ఈ విషయంలో అనవసరంగా ఒక్క భారత జట్టునే టార్గెట్ ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు.

కోహ్లీసేన.. గెలిచే అవకాశాలున్నా
అత్యుత్తమ పర్యాటక జట్టుగా భారత్‌ను తయారు చేయడమే తన లక్ష్యమని ఇంతకు ముందు ఆయన పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది సొంతగడ్డపై అదరగొట్టిన కోహ్లీసేన దక్షిణాఫ్రికా (1-2), ఇంగ్లాండ్ (1-4)లో తేలిపోయింది. గెలిచే అవకాశాలున్నా సమర్థంగా వినియోగించుకోలేదు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా టూర్‌పై రవిశాస్త్రి మీడియా సమావేశంలో ఓ ప్రశ్నకు బదులిస్తూ.. ఇలా అన్నాడు.
'నాలుగేళ్లలో కోహ్లీ చాలా మారాడు'

పర్యాటక జట్టు అదరగొట్టిన సందర్భాలు లేవు
‘పొరపాట్ల నుంచి పాఠాలు నేర్వాలి. ప్రపంచ వ్యాప్తంగా పరిశీలిస్తే పర్యాటక జట్టు అదరగొట్టిన సందర్భాలు ఇటీవలి కాలంలో లేవు. 90ల్లో ఆసీస్.. ఆ తర్వాత దక్షిణాఫ్రికా హవా నడిచింది. కానీ గత ఐదారేళ్లలో విదేశాల్లో ప్రతిభ కనబరిచిన జట్లు చూపగలరా? మరి భారత్‌నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు' అని శాస్ర్తి ఎదురు ప్రశ్నించాడు.

కొన్ని సందర్భాల్లో పొరపాట్లు చేశాం
‘టెస్టు మ్యాచుల్లో స్కోర్లు అసలైన కథ చెప్పవు. మీరోసారి పరిశీలిస్తే మేం కొన్ని సందర్భాల్లో పొరపాట్లు చేశాం. చివరికి సిరీస్ చేజార్చుకున్నాం. ఆసీస్ బలహీనంగా ఉందని చెప్పం. ఒకరిద్దరు ఆటగాళ్లు లేనంత మాత్రాన అలా అనుకోవడానికి వీల్లేదు. ఆస్ట్రేలియా పిచ్‌లపై మా బౌలర్లు బౌలింగ్‌ను ఆస్వాదిస్తారు. ఫిట్‌గా ఉండటమే అత్యవసరం. హార్దిక్‌పాండ్య లేకపోవడం ఇబ్బందే. అతడుంటే జట్టుకు సమతూకం వచ్చేది' అని రవిశాస్త్రి అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications