Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కేఎల్ రాహుల్ ఫామ్‌పై పార్లమెంట్‌లో చర్చ? ట్వీట్‌తో ఆజ్యం పోసిన శశి థరూర్!

 Shashi Tharoor slams BCCI over Sanju Samson, fuels KL Rahul debate

న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ పేలవ ఫామ్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వరుసగా విఫలమవుతున్న రాహుల్‌కు అవకాశం ఇవ్వడంపై మాజీ క్రికెటర్లు, అభిమానులు మండిపడుతున్నారు. రాహుల్ పేలవ ఫామ్‌పై మాజీ క్రికెటర్లు ఆకాశ్ చోప్రా, వెంకటేశ్ ప్రసాద్ ట్విటర్ వేదికగా మాటల యుద్దానికి కూడా దిగారు. మరోవైపు హర్భజన్ సింగ్ వంటి ఆటగాళ్లు రాహుల్ ఏం నేరం చేయలేదని, అతన్ని వదిలేయాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎంపీ శశి థరూర్ చేసిన ట్వీట్ రాహుల్ సెగకు మరింత ఆజ్యం పోసినట్లు అయ్యింది.

సీనియర్ జర్నలిస్ట్‌లు సైతం..

టీమిండియా సెలెక్షన్ విధానాన్ని తప్పుబడుతూ సీనియర్ జర్నలిస్ట్ శేఖర్ గుప్తా చేసిన ట్వీట్‌కు బదులుగా స్పందించిన శశి థరూర్.. బీసీసీఐపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. టీమిండియా సెలెక్షన్ విధానంపై శేఖర్ గుప్తా అసంతృప్తి వ్యక్తం చేస్తూ సెటైరిక్‌గా ట్వీట్ చేశాడు. 'సమష్టి ప్రదర్శనతో పాటు భావోద్వేగపూరితమైన నిర్ణయాలు లేకుండా జట్టు ఎంపిక నిష్పాక్షికంగా ఉన్నప్పుడు భారత క్రికెట్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచింది. అయితే ఇప్పుడు ఇది పూర్తిగా మారినట్లుంది. 49 టెస్ట్‌ ఇన్నింగ్స్‌ల్లో 25 యావరేజ్‌తోనే కేఎల్ రాహుల్ 2017 నుంచి టాపార్డర్ బ్యాటర్‌గా కొనసాగుతున్నాడంటేనే ఈ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. అది కూడా అపారమైన ప్రతిభ కలిగిన గిల్‌ను పక్కనపెట్టి'అని శేఖర్ గుప్తా విమర్శలు గుప్పించాడు.

పార్లమెంట్‌లో చర్చ..

పార్లమెంట్‌లో చర్చ..

ఈ ట్వీట్‌కు బదులుగా శశి థరూర్ స్పందిస్తూ.. సంజూ శాంసన్ అంశాన్ని ప్రస్తావించాడు. 'సంజూ శాంసన్ పరిస్థితి ఏంటి? వన్డేల్లో 76 సగటు ఉన్న ప్లేయర్‌ను మరోసారి ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు పట్టించుకోలేదు. పెర్పామ్ చేయని వారికి అవకాశాలు ఇవ్వడం సరే కానీ.. ప్రతిభావంతులకు అన్యాయం చేయడం ఏంటి?'అని శశి థరూర్ ప్రశ్నించాడు. దాంతో అభిమానులంతా టీమిండియా సెలెక్షన్‌పై పార్లమెంట్‌లో చర్చించాలని, సౌతిండియా ఆటగాళ్లకు జరగుతున్న అన్యాయంపై గళమెత్తాలని శశి థరూర్‌ను కోరారు. రాహుల్ వ్యవహంతో టీమిండియా సెలెక్షన్ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

గత 24 టెస్ట్‌ల్లో దారుణం..

గత 24 టెస్ట్‌ల్లో దారుణం..

గత ఐదేళ్ల నుంచి కేఎల్ రాహుల్ ప్రదర్శన అత్యంత సాధారణంగా ఉంది. 2018 ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ఆడిన 24 టెస్టుల్లో రాహుల్ సగటు 27.53 మాత్రమే. ఇందులో మూడు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలు మాత్రమే ఉన్నాయి. గత కొన్ని నెలల నుంచి అయితే రాహుల్‌ మరీ దారుణంగా విఫలమవుతున్నాడు. గత 10 టెస్ట్‌ల్లో 1, 17, 20, 2, 10, 23, 22, 10, 12, 8.. అత్యంత పేలవ ప్రదర్శన కనబర్చాడు. ఇందులో చివరి ఏడు ఇన్నింగ్స్‌లు ఉపఖండ పరిస్థితుల్లో ఆడినవే.

బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టుల్లో రాహుల్ ఆడిన 4 ఇన్నింగ్స్‌ల్లో అతడు చేసిన అత్యధిక స్కోరు 23. ఆస్ట్రేలియాతో జరిగిన రెండు టెస్టుల్లో అత్యధికంగా 20 పరుగులు మాత్రమే చేయగలిగాడు. రాహుల్‌పై వేటు వేయడానికి ఈ పేలవ ప్రదర్శన చాలదా అన్నది విమర్శకుల ప్రశ్న.

Story first published: Wednesday, February 22, 2023, 11:47 [IST]
Other articles published on Feb 22, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+