Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

KKR vs SRH:బౌండరీ లైన్‌పై శశాంక్ సింగ్ స్టన్నింగ్ క్యాచ్.. బిత్తరపోయిన రహానే! (వీడియో)

Shashank Singhs Stunnnig Catch Close to The Boundary To Dismiss Ajinkya Rahane

పుణే: సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ ప్లేయర్ శశాంక్ సింగ్ కళ్లు చెదిరే క్యాచ్‌తో ఔరా అనిపించాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బౌండరీ లైన్ వద్ద అద్భుత ఫీల్డింగ్ విన్యాసంతో అందర్నీ మైమరిపించాడు. అతని స్టన్నింగ్ క్యాచ్‌కు కోల్‌కతా ఓపెనర్ అజింక్యా రహానే(28) నిరాశగా పెవిలియన్ చేరాడు. శశాంక్ క్యాచ్ పట్టడమే కాకుండా ఓ భారీ సిక్సర్‌ను అడ్డుకున్నాడు. ప్రస్తుతం శశాంక్ సింగ్ స్టన్నింగ్ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఉమ్రాన్ మాలిక్ వేసిన 8వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అప్పటి వరకు ధాటిగా ఆడిన నితీశ్ రాణా(25), అజింక్యా రహానేలను ఉమ్రాన్ మాలిక్ తన తొలి ఓవర్‌లోనే పెవిలియన్‌కు చేర్చాడు. ఈ ఇద్దరి క్యాచ్‌లను శశాంక్ సింగే అందుకోవడం గమనార్హం. ఇటీవల దారళంగా పరుగులిస్తున్న ఉమ్రాన్‌ను లేట్‌గా బౌలింగ్‌కు దించిన కేన్ మామ ఊహించని ఫలితాన్ని అందుకున్నాడు. అతను వేసిన 8వ ఓవర్ మూడో బంతిని భారీ షాట్ ఆడే క్రమంలో నితీష్ రాణా పెవిలియన్ చేరాడు. ఇక చివరి బంతిని రహానే అప్పర్ కట్ ఆడగా.. బంతి సిక్సర్‌గా దూసుకెళ్లింది. స్వీపర్ కవర్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న శశాంక్ అద్భుతంగా బంతిని అందుకున్నాడు. సిక్సర్‌గా భావించిన రహానే శశాంక్ స్టన్నింగ్ క్యాచ్‌కు బిత్తర పోయాడు.

నితీష్ రాణా, రహానే విధ్వంసకర బ్యాటింగ్‌తో పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 55 పరుగులు చేసిన కేకేఆర్.. ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయి 177 పరుగులకే పరిమితమైంది. ఆండ్రీ రస్సెల్, సామ్ బిల్లింగ్స్ సూపర్ బ్యాటింగ్‌తో కేకేఆర్ పోరాడే లక్ష్యాన్నందుకుంది. ఉమ్రాన్ మాలిక్(3/33) మూడు వికెట్లతో సత్తా చాటగా.. భువీ, మార్కో జాన్సెన్, నటరాజన్ తలో వికెట్ తీసారు.

Story first published: Saturday, May 14, 2022, 22:38 [IST]
Other articles published on May 14, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+