అది చూసి అవకాశాలు ఇవ్వాలి.. చీఫ్ సెలెక్టర్ అగార్కర్‌పై శార్దూల్ ఠాకూర్ ఫైర్!
భారత క్రికెట్ సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్‌పై వెటరన్ పేస్ ఆల్‌రౌండర్ శార్ధూల్ ఠాకూర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. నైపుణ్యం కలిగిన ఆటగాళ్లకు సెలెక్టర్లు అండగా నిలవాలన్నాడు. ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీలో ముంబై తరఫున అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న శార్దూల్ ఠాకూర్.. జమ్ము కశ్మీర్‌తో గురువారం ప్రారంభమైన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు.
47 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ ముంబై జట్టును శార్దూల్ ఠాకూర్.. మరో టెయిలండర్ తనూష్ కోటియన్(36 బంతుల్లో 5 ఫోర్లతో 26)తో కలిసి గట్టెక్కించాడు. ఈ జోడీ 8వ వికెట్‌కు 63 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. దాంతో ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 120 పరుగులు చేయగలిగింది.

రోహిత్ శర్మ(3), యశస్వి జైస్వాల్(4), అజింక్యా రహానే(12), శ్రేయస్ అయ్యర్(11), శివమ్ దూబే(0) దారుణంగా విఫలమైన వికెట్‌పై 8వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి హాఫ్ సెంచరీ సాధించిన శార్దూల్ ఠాకూర్‌పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి శార్దూల్ ఠాకూర్‌ను ఎంపిక చేయకుండా సెలెక్టర్లు తప్పు చేశారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అతను ఉండి ఉంటే సిరీస్ 2-2తో సమమయ్యేదని అభిప్రాయపడుతున్నారు.
తొలి రోజు ఆట అనంతరం మీడియాతో మాట్లాడిన శార్దూల్ ఠాకూర్.. పరోక్ష వ్యాఖ్యలతో సెలెక్టర్లకు చురకలంటించాడు. 'నా ఆట క్వాలిటీ గురించి నేనేం మాట్లాడాలి? ఇతరులు చెప్పాలి. ముఖ్యంగా సెలెక్టర్లు చూడాలి. ఏ ఆటగాడైన నాణ్యమైన ప్లేయర్ అని భావిస్తే అతనికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలి. కఠిన పరిస్థితుల్లో బ్యాటింగ్ చేయడం నాకిష్టం.
పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు ఎవరైనా రాణిస్తారు. కానీ ప్రతికూల పరిస్థితుల్లో ఎలా రాణిస్తారనేదే ముఖ్యం. నేను కఠిన పరిస్థితులను సవాల్‌గా భావిస్తాను. ఆ సవాల్‌ను ఎలా అధిగమించాలని ఆలోచిస్తాను.'అని చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్ 2025 మెగా వేలంలో అన్‌సోల్డ్‌గా మిగలడంపై స్పందిస్తూ.. గతాన్ని వీలైనంత త్వరంగా మరిచిపోవడం మంచిదన్నాడు. గతం మారనప్పుడు దాని గురించి ఆలోచించడం దండగన్నాడు. వర్తమాన కాలంలో ఉంటూ.. ఏం చేయాలనేదానిపై ఫోకస్ పెట్టాలన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications