Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీ అంత పని చేస్తాడనుకోలేదు.. హార్దిక్‌తో నన్ను పోల్చకండి : శార్దూల్ ఠాకూర్

Shardul Thakur says Virat Kohli Quit Test Captaincy Was an Emotional Moment For Everyone

న్యూఢిల్లీ: టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ తప్పుకుంటాడని అస్సలు ఊహించలేదని స్టార్ పేసర్ శార్దూల్ ఠాకూర్ అన్నాడు. భారత్‌కు ఎన్నో విజయాలు అందించిన విరాట్.. ఇలా కెప్టెన్సీ వదులుకోవడం చాలా బాధాకరమని చెప్పాడు. ఇక హార్దిక్ పాండ్యాతో తనకు ఎలాంటి పోటీ లేదన్న శార్దూల్ ఠాకూర్.. అతనితో పోల్చవద్దని రిక్వెస్ట్ చేశాడు. కెప్టెన్లు మారినా జట్టులో తన పాత్రలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశాడు. తాజాగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శార్దూల్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

అలా చేస్తాడనుకోలేదు..

అలా చేస్తాడనుకోలేదు..

'కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీ వదులుకోవడం చాలా బాధాకరం. అతను ఇలా చేస్తాడని ఎవరం ఊహించలేదు. కోహ్లీ సారథ్యంలో టీమిండియా గొప్ప విజయాలు సాధించింది. ప్రత్యేకించి విదేశాల్లో అద్భుత విజయాలతో చరిత్ర సృష్టించింది. చాలా తక్కువ మ్యాచ్‌ల్లో టీమిండియా ఓడింది. అది కూడా స్వల్ప తేడాతోనే పరాజయం పాలైంది. ఏదేమైనా కోహ్లీ తీసుకున్న నిర్ణయాన్ని మనమంతా గౌరవించాల్సిన అవసరం ఉంది.'అని శార్దూల్ ఠాకూర్ చెప్పుకొచ్చాడు.

హార్దిక్‌తో నాకు పోలిక వద్దు..

హార్దిక్‌తో నాకు పోలిక వద్దు..

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాతో తనకు ఎలాంటి పోలిక లేవని, తామిద్దరిది భిన్నమైన శైలని శార్దూల్ చెప్పుకొచ్చాడు. 'హార్దిక్ పాండ్యా ఐదు లేదా ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతాడు. నేను 7 లేదా 8 స్థానాల్లో క్రీజులోకి వస్తాను. మా ఇద్దరి బ్యాటింగ్ శైలీ వేర్వేరుగా ఉంటుంది. మా మధ్య ఎలాంటి పోటీ కానీ, పోలికలు కానీ లేవు. అతని స్థానాన్ని ఆక్రమించాలని నేనెప్పుడూ అనుకోలేదు. అతను కూడా నాకు ఎల్లప్పుడూ మద్దతుగానే నిలిచాడు. తన అనుభవాలను నాతో పంచుకునేవాడు'అని శార్దూల్ చెప్పుకొచ్చాడు.

IND vs SA 2nd Test : Lord Shardul Thakur Scripts History | Oneindia Telugu
కెప్టెన్ మారినా..

కెప్టెన్ మారినా..

కెప్టెన్లు మారినా జట్టులో తన పాత్ర మాత్రం మారదని శార్దూల్ ఠాకూర్ ధీమా వ్యక్తం చేశాడు. 'జట్టును నడిపించే కెప్టెన్లు మారినా.. నా పాత్రలో ఎటువంటి మార్పు ఉండదు. ఒక్కో కెప్టెన్‌కు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. కానీ, అంతిమ లక్ష్యం మాత్రం ఒక్కటే. జట్టును విజయ తీరాలకు చేర్చడం. మనం ఎవరి నాయకత్వంలో ఆడుతున్నామన్నది ముఖ్యం కాదు. జట్టు విజయం కోసం ఏ మేరకు కృషి చేశామన్నదే ముఖ్యం'అని శార్దూల్ ఠాకూర్ పేర్కొన్నాడు. ఇక శార్దూల్ ఠాకూర్ విరాట్ కోహ్లీతో పాటు అజింక్యా రహానే, కేఎల్ రాహుల్, రోహిత్ శర్మల కెప్టెన్సీలో ఆడాడు.

Story first published: Thursday, February 3, 2022, 20:20 [IST]
Other articles published on Feb 3, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+