శార్దూల్‌కు.. ఎంత ప్రయత్నించినా 7వారాల విశ్రాంతి తప్పదట!!

హైదరాబాద్: ఇటీవల హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టు ద్వారా ఈ ఫార్మాట్‌లో అరంగేట్రం చేసిన టీమిండియా పేసర్ శార్దూల్ ఠాకూర్.. అదే మ్యాచ్‌లో చీలమండ గాయం తిరగబెట్టడంతో వన్డే సిరీస్‌కు సైతం దూరమయ్యాడు. వెస్టిండీస్‌తో తొలి రెండు వన్డేల కోసం ప్రకటించిన భారత జట్టులో కీలక మార్పు చేశారు.

శార్దూల్ స్థానంలో ఉమేశ్ యాదవ్‌ను జట్టులోకి
ఇటీవల విండీస్‌తో టెస్టు మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తుండగా గాయపడిన యువ పేసర్ శార్దూల్ ఠాకూర్ స్థానంలో సీనియర్ పేసర్ ఉమేశ్ యాదవ్‌ను జట్టులోకి ఎంపిక చేసినట్లు బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. సూపర్ ఫామ్‌లో ఉన్న ఉమేశ్ టీమ్‌లోకి రావడంతో భారత్ పేస్‌విభాగం మరింత బలపడింది. కాగా, వచ్చే నెల్లో ఆస్ట్రేలియాతో జరుగనున్న టీ20 సిరీస్‌కు కూడా దూరమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి.
'కోహ్లీ రిటైర్‌మెంటా..!! దానికింకా చాలా సమయముంది'

దాదాపు 7 వారాల పాటు విశ్రాంతి అవసరమని
శార్దూల్‌కు దాదాపు 7 వారాలు విశ్రాంతి అవసరమని వైద్యులు తెలపడంతో అతను ఆసీస్‌తో జరిగే టీ20 సిరీస్‌తో పాటు తొలి రెండు టెస్టులకు అందుబాటులో ఉండకపోవచ్చనే సంకేతాలిచ్చాడు. ఆసీస్‌తో మూడు టీ20 సిరీస్ తర్వాత నాలుగు టెస్టుల సిరీస్ ఆరంభం కానుంది. తాజాగా తన ఫిట్‌నెస్‌పై శార్దూల్ మాట్లాడాడు.

అప్పటివరకూ వేచి చూడక తప్పదు
‘నేను ఎంత ప‍్రయత్నించినా ఆసీస్‌తో రెండో టెస్టు నాటికి ఫిట్‌కావడం కష్టమే. అందులోనూ టీ20లతో పాటు టెస్టుల్లో చోటు సంపాదించడం ప‍్రస్తుతం చాలా కష్టంగా మారింది. దాంతో నేను వన్డేలు నాటికి ఫిట్ కావడంపైనే దృష్టి సారించా. జట్టు పునరావాస శిబిరంలో నా తదుపరి శిక్షణను కంటిన్యూ చేస్తా. ఏడువారాల్లో ఎంతవరకూ ఫిట్ అవుతానో అనేది తెలియాలంటే అప్పటివరకూ వేచి చూడక తప్పదు' అని శార్దూల్ పేర్కొన్నాడు.

కోహ్లి, ఫిజియో సూచన మేరకు మైదానం వీడాడు
వెస్టిండీస్‌తో రెండో టెస్టులో ఈ యువబౌలర్ అంతర్జాతీయ టెస్ట్‌ల్లో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. తొలి టెస్ట్ ఉత్సాహంతో బంతి అందుకున్న శార్థుల్ సరిగ్గా 10 బంతులు వేసాడో లేదో అతని చీలమండ గాయం తిరగబెట్టింది. ఈ నొప్పితో అతను విలవిలలాడాడు. చివరకు, కెప్టెన్ కోహ్లి, ఫిజియో సూచన మేరకు మైదానం వీడాడు. ఫలితంగా విండీస్‌తో వన్డే సిరీస్‌కు కూడా శార్దూల్ దూరం కావాల్సి వచ‍్చింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications