
రహానే 107.. ఠాకూర్ 117
అజింక్యా రహానే నాలుగో టెస్ట్‌ల్లోని ఐదు ఇన్నింగ్స్‌ల్లో 107 పరుగులు చేస్తే.. శార్దూల్ ఠాకూర్ ఒకే ఒక్క మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 117 పరుగులు చేశాడని, ఈ లెక్కన రహానే కంటే శార్దూల్ ఎంతో నయమంటున్నారు. పైగా శార్దూల్ బౌలింగ్ కూడా చేస్తాడని, రహానే ఒక బ్యాటింగ్ తప్పా మరేమి చేయలేడని, అందులో కూడా విఫలమవుతున్నాడని మండిపడుతున్నారు.
ఇక నాలుగో టెస్ట్ తొలి తొలి ఇన్నింగ్స్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన శార్దూల్ 57 పరుగులు చేసి జట్టు గౌరవ ప్రదమైన స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. రెండో ఇన్నింగ్స్‌లో రిషభ్ పంత్‌తో కలిసి ఏడో వికెట్‌కు 100 పరుగుల భాగస్వామ్యాన్ని అందించి ఇంగ్లండ్ ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించడంలో కీలక పాత్ర పోషించాడు.

దేశవాళీ క్రికెట్ ఆడాలి..
ఇక అజింక్యా రహానేపై వేటు వేయాల్సిందేనని భారత దిగ్గజ క్రికెటర్ల జహీర్ ఖాన్, వీవీఎస్ లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. రహానే దేశవాళీ క్రికెట్ ఆడి మళ్లీ తన ఫామ్ అందుకోవాలని జహీర్ ఖాన్ సూచించాడు. బలహీనతలపై మరింత దృష్టి పెట్టి ఆటను మెరుగుపరుచుకునేందుకు డొమెస్టిక్ క్రికెట్ ఎంతో ఉపయోగపడుతుందని రహానేకుహితవుపలికాడు. 'ఫామ్ లేకనే రహానే విఫలమవుతున్నాడు. అతను దేశవాళీ క్రికెట్‌లోకి వచ్చి తన బలహీనతలను సరిదిద్దుకోవాలి. అలాగే మానసిక ఒత్తిడిని అధిగమించుకోవాలి. ఆటగాడిగా కమ్ బ్యాక్ చేసేందుకు దేశవాళీ క్రికెట్ ఎంతో సహకరిస్తుందని'జహీర్ ఖాన్ చెప్పుకొచ్చాడు.

రహానేను తీసేయాలి..
నిలకడలేమి ఫామ్‌తో సతమతమవుతున్న రహానేను పక్కనపెట్టాలని దిగ్గజ బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నాడు. 'రహానేను పక్కనపెట్టాల్సిన టైమ్ ఆసన్నమైంది. అతని భవిష్యత్తు ఏంటనేది అర్థం కావడం లేదు. కానీ అతనో నాణ్యమైన ఆటగాడు. క్వాలిటీ ప్లేయర్లు జట్టులోకి వస్తారని నేను ఎప్పుడూ నమ్ముతా. అయితే తాజా సిరీస్‌లో అతను చాలా తడబడుతున్నాడు. ఆత్మవిశ్వాసంగా లేడు. ఒక్కసారి కాదు ఇప్పటికే అనేకసార్లు విఫలమయ్యాడు'అని లక్ష్మణ్ ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ ఫోకు తెలిపాడు. పాకిస్థాన్ మాజీ క్రికెట్ డానిష్ కనేరియా సైతం రహానే పేలవ ప్రదర్శనపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసలు రహానేను జట్టులో ఎందుకు కొనసాగిస్తున్నారో అర్థం కావడం లేదని ప్రశ్నించాడు.

9 ఇన్నింగ్స్‌లు.. ఒక్క హాఫ్ సెంచరీ..
ఇంగ్లండ్ పర్యటనలో ఇప్పటి వరకు 9 ఇన్నింగ్స్‌లు ఆడిన రహానే.. ఒకే ఒక్క హాఫ్ సెంచరీ చేశాడు. అది కూడా లార్డ్స్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో 61 రన్స్ చేశాడు. న్యూజిలాండ్‌తో జరిగిన వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో 49, 15 పరుగులు చేసిన రహానే.. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో 5, 1, 61, 18, 10, 14, 0 పరుగులు చేసాడు. తాజా మ్యాచ్‌లో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 14 రన్స్ చేసిన రహానే రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. వేటు వేద్దామనే సమయానికి సెంచరీ లేదా హాఫ్ సెంచరీ చేయడం మరో ఏడు ఎనిమిది ఇన్నింగ్స్‌లు విఫలమవడం రహానేకు అలవాటే. ఈ తరహా బ్యాటింగ్‌తో అతను గొప్ప ఆటగాడు కాలేకపోయాడు.


Click it and Unblock the Notifications












