Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Shardul Thakur అరుదైన ఘనత.. మెరుపు బ్యాటింగ్‌తో సెహ్వాగ్ రికార్డు బద్దలు!

Shardul Thakur breaks Virender Sehwag record, hits fastest Test fifty in England

ఓవల్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో టీమిండియా టెయిలెండర్ శార్దూల్ ఠాకూర్ (36 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 57) అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ధనాధన్ బ్యాటింగ్‌తో వేగవంతమైన హాఫ్ సెంచరీ సాధించిన శార్దూల్.. తద్వార టెస్ట్‌ల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ నమోదు చేసిన రెండో భారత బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందాడు. ఈ క్రమంలో టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ రికార్డు బద్దలు కొట్టాడు. ఈ జాబితాలో దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ 30 బంతుల్లో హాఫ్ సెంచరీ బాది అగ్రస్థానంలో ఉండగా.. 31 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన శార్దూల్ ఠాకూర్ రెండో స్థానంలో నిలిచాడు. ఇక వీరేంద్ర సెహ్వాగ్ 32 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించి మూడో బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్ గడ్డపై టెస్ట్‌ల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేసిన బ్యాట్స్‌మన్‌గా శార్దూల్ నిలిచాడు. ఇప్పటి వరకు ఇయాన్ బోథమ్(32 బంతుల్లో) పేరిట ఈ రికార్డు ఉండగా.. శార్దూల్ అతన్ని అధిగమించాడు. 1986లో ఓవల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లోనే ఇయాన్ బోథమ్ 32 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు.

ఇక 127 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును శార్దూల్ తన ధనాధన్ బ్యాటింగ్‌తో గట్టెక్కించాడు. టీ20 తరహా బ్యాటింగ్‌తో 8వ వికెట్‌కు ఉమేశ్ యాదవ్(10)తో కలిసి 63 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని అందించాడు. ధాటిగా ఆడుతూ ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఏడు ఫోర్లు, 3 సిక్సర్లతో వీరవిహారం చేశాడు. రాబిన్సన్ వేసిన 60వ ఓవర్‌లో4, 6 బాదిన శార్దూల్.. 31 బంతుల్లో కెరీర్‌లో రెండో అర్థశతకం అందుకున్నాడు. తనకు వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. ఇక శార్దూల్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (96 బంతుల్లో 8 ఫోర్లతో 50) మినహా మరేవరూ రాణించలేదు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్(4/55), ఓలి రాబిన్సన్(3/38) భారత్ పతనాన్ని శాసించగా.. జేమ్స్ అండర్సన్, క్రైగ్ ఓవర్టన్ చెరొక వికెట్ తీశారు.

అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ ఆదిలోనే ఓపెనర్లు రోరీ బర్న్స్(5), హసీబ్ అహ్మద్(0) వికెట్లు కోల్పోయింది. జస్‌ప్రీత్ బుమ్రా ధాటికి 6 పరుగులకే రెండు వికెట్లు చేజార్చుకుంది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన జోరూట్(21 బ్యాటింగ్), డేవిడ్ మలాన్(25 బ్యాటింగ్) ధాటిగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్తున్నారు. 13 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ 2 వికెట్ల నష్టానికి 51 రన్స్ చేసింది. ఇంకా 140 పరుగుల వెనుకంజలో ఉంది.

Story first published: Thursday, September 2, 2021, 22:57 [IST]
Other articles published on Sep 2, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+