Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ranji Trophy: శార్దూల్ ఠాకూర్.. ది వారియర్!

టీమిండియా పేస్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ మరోసారి విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. దేశవాళీ క్రికెట్‌లో ముంబై జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న శార్దూల్ ఠాకూర్.. ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ 2024-25లో ఎలైట్ గ్రూప్-ఏలో భాగంగా జమ్ముకశ్మీర్‌తో గురువారం ప్రారంభమైన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో రాణించాడు.

రోహిత్ శర్మ(3), యశస్వి జైస్వాల్(4), అజింక్యా రహానే(12), శ్రేయస్ అయ్యర్(11), శివమ్ దూబే(0) దారుణంగా విఫలమైన వికెట్‌పై 8వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన శార్దూల్ ఠాకూర్.. 57 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 51 పరుగులతో ముంబై జట్టును ఆదుకున్నాడు. 47 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ జట్టును శార్దూల్ ఠాకూర్.. మరో టెయిలండర్ తనూష్ కోటియన్(36 బంతుల్లో 5 ఫోర్లతో 26)తో కలిసి 8వ వికెట్‌కు 63 పరుగులు జోడించి గట్టెక్కించాడు.

Shardul Thakur Becomes Lone Warrior for Mumbai Scores Fifty After Batting Collapse in Ranji Trophy

శార్దూల్ ఠాకూర్ ఒంటరి పోరాటంతో ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 120 పరుగులు చేయగలిగింది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఇంటర్నేషనల్ స్టార్స్ యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ తమ వైఫల్యాన్ని కొనసాగించారు. జమ్ముకశ్మీర్ బౌలర్లలో ఉమర్ నజీర్ మిర్(4/41), యుధ్వీర్ సింగ్(4/31), ఆకిబ్ నబీ(2/36) ముంబై పతనాన్ని శాసించారు. శార్దూల్ ఠాకూర్ కూడా విఫలమై ఉంటే ముంబై 60 పరుగుల్లోపే ఆలౌటయ్యేది.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన జమ్ముకశ్మీర్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 42 ఓవరల్లో 7 వికెట్లకు 174 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు 54 పరుగుల ఆధిక్యంలో ఉంది.

టీమిండియా తరఫున కూడా శార్దూల్ ఠాకూర్ ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఆస్ట్రేలియా పర్యటన 2020-21లో టీమిండియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో గెలవడంలో శార్దూల్ ఠాకూర్ కీలక పాత్ర పోషించాడు. లోయరార్డ్‌లో అతను విలువైన పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లోనూ కీలక వికెట్లు తీసాడు.

అయితే ఈ సారి అతన్ని సెలెక్టర్లు పట్టించుకోలేదు. శార్దూల్ ఠాకూర్‌కు బదులు తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డిని జట్టులోకి తీసుకున్నారు. నితీష్ బ్యాట్‌తో చెలరేగినా.. బంతితో విఫలమయ్యాడు. దాంతో భారత్‌కు ఘోర పరాజయం తప్పలేదు.

Story first published: Thursday, January 23, 2025, 21:41 [IST]
Other articles published on Jan 23, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+