For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs New Zealand తొలి వన్డే టర్నింగ్ పాయింట్.. టీమిండియా కొంపముంచిన శార్దూల్ ఠాకూర్!

Shardul Thakur 40th over is turning point in India vs New Zealand 1st ODI

అక్లాండ్: న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా జోరుకు బ్రేక్ పడింది. మూడు టీ20ల సిరీస్‌ను 1-0తో కైవసం చేసుకున్న టీమిండియా.. వన్డే సిరీస్‌లో ఆ జోరును కొనసాగించలేకపోయింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో బౌలింగ్‌లో విఫలమైన గబ్బర్ సేన 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలైంది. 307 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా కాపాడుకోలేకపోయింది. ముఖ్యంగా టీమిండియా ఫలితాన్ని న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 40వ ఓవర్ శాసించింది. శార్దూల్ ఠాకూర్ వేసిన ఈ ఓవరే మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్ అయ్యింది.
సిక్స్, 4 బౌండరీలతో..

సిక్స్, 4 బౌండరీలతో..

39వ ఓవర్ వరకు భారత విజయవకాశాలు సజీవంగా ఉండగా.. 40వ ఓవర్‌లో టామ్ లాథమ్ ఒక సిక్స్, నాలుగు బౌండరీలతో 25 పరుగులు పిండుకోవడంతో మూమెంటమ్ మొత్తం న్యూజిలాండ్ వైపు మళ్లింది. శార్దూల్ ఠాకూర్ వేసిన ఈ ఓవర్ తొలి బంతిని టామ్ లాథమ్ డీప్ బ్యాక్‌‌వార్డ్ దిశగా సిక్సర్ బాదాడు. రెండో బంతిని శార్దూల్ వైడ్ వేయగా.. ఎక్స్‌ట్రా బాల్‌ను ఠాకూర్ బౌండరీ తరలించాడు. ఆ తర్వాత మరో మూడు బంతులను బౌండరీలుగా మలిచాడు. తీవ్ర ఒత్తిడికి గురైన ఠాకూర్ చివరి బంతిని మరో వైడ్ వేయగా.. మరో ఎక్స్‌ట్రా డెలివరీకి సింగిల్ తీసిన లాథమ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పదే పదే షాట్ బాల్స్ వేసిన శార్దూల్ ఠాకూర్ మూల్యం చెల్లించుకున్నాడు.

ఒక్క ఓవర్‌తో రాక్షసుడిగా..

ఒక్క ఓవర్‌తో రాక్షసుడిగా..

అభిమానులతో ముద్దుగా లార్డ్ శార్దూల్‌గా పిలుచుకునే అతను ఈ ఒక్క ఓవర్‌తో రాక్షసుడిగా మారాడు. ఈ ఓవర్ గనుక కట్టుదిట్టంగా వేసుంటే మ్యాచ్ ఆఖరి బంతి వరకు రసవత్తరంగా సాగేది. కేన్ విలియమ్సన్-టామ్ లాథమ్ నాలుగో వికెట్‌కు అందించిన 221 పరుగుల భాగస్వామ్యాన్ని బ్రేక్ చేసినా ఫలితం మరోలా ఉండేది. మొత్తానికి పేలవ బౌలింగ్‌తో టీమిండియా సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమిపాలైంది. మ్యాచ్ అనంతరం ఇరు జట్ల కెప్టెన్లు కూడా.. శార్దూల్ ఠాకూర్ వేసిన 40వ ఓవరే టర్నింగ్ పాయింట్ అని అభిప్రాయపడ్డారు.

భారీ స్కోర్ చేసినా..

భారీ స్కోర్ చేసినా..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 306 పరుగుల భారీ స్కోర్ చేసింది. శ్రేయస్ అయ్యర్(76 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 80), శిఖర్ ధావన్(77 బంతుల్లో 13 ఫోర్లతో 72), శుభ్‌మన్ గిల్(65 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 50) హాఫ్ సెంచరీలతో రాణించగా... చివర్లో వాషింగ్టన్ సుందర్(16 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో టీమ్ సౌథీ, లూకీ ఫెర్గూసన్ మూడేసి వికెట్లు తీయగా.. ఆడమ్ మిల్నే ఓ వికెట్ పడగొట్టాడు.

ఉమ్రాన్ మాలిక్ మినహా..

ఉమ్రాన్ మాలిక్ మినహా..

అనంతరం లక్ష్యచేధనకు దిగిన న్యూజిలాండ్ 47.1 ఓవర్లలో 3 వికెట్లకు 309 పరుగులు చేసింది. టామ్ లాథమ్(104 బంతుల్లో 19 ఫోర్లు, 5 సిక్స్‌ర్లతో 145 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగగా.. కేన్ విలియమ్సన్(98 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 94 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ రెండు వికెట్లు తీయగా.. శార్దూల్ ఠాకూర్ ఓ వికెట్ పడగొట్టాడు. మిగతా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో న్యూజిలాండ్ 1-0తో ఆధిక్యంలో నిలవగా.. రెండో వన్డే ఆదివారం జరగనుంది.

Story first published: Friday, November 25, 2022, 17:31 [IST]
Other articles published on Nov 25, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+