
ఐపీఎల్‌తో రీఎంట్రీ..
ఈ టోర్నీ అనంతరం జట్టులో చోటు కోల్పోయిన పాండ్యా తన ఫిట్‌నెస్ సీరియస్‌గా ఫోకస్ పెట్టాడు. సుమారు 6 నెలల పాటు జట్టుకు దూరంగా ఉండి ఐపీఎల్ 2022 సీజన్‌తో రీఎంట్రీ ఇచ్చాడు. తనదైన బౌలింగ్, బ్యాటింగ్‌తో పాటు కెప్టెన్‌గా అదరగొట్టి తన జట్టు గుజరాత్ టైటాన్స్‌కు టైటిల్ అందించాడు. ఈ ప్రదర్శన మళ్లీ జట్టులోకి వచ్చిన హార్దిక్ దూసుకెళ్తున్నాడు. ప్రతీ సిరీస్‌లో సత్తా చాటుతున్నాడు. ఈ క్రమంలోనే ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శంకర్ బసు.. హార్దిక్ గురించి మాట్లాడాడు.

ఫిట్ అయ్యేలా చూడాలని..
'హార్ధిక్ పాండ్యా ఫిట్‌నెస్ విషయంలో చాలా కేర్ తీసుకుంటాడు. కష్టపడడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. 2019 వరల్డ్ కప్‌కి ముందు ఐపీఎల్‌లో హార్ధిక్ పాండ్యా గాయపడ్డాడు. నొప్పి భరించలేక ఆడడానికి కూడా చాలా ఇబ్బందిపడ్డాడు. ఓ రోజు నా దగ్గరికి వచ్చి.. 'సర్ ప్లీజ్.. ఎలాగైనా వరల్డ్ కప్ ఆడేలా చూడండి. నేను ఎలాగైనా ఫిట్‌గా మారాలంటూ వేడుకున్నాడు.. అతని తపన చూసి నేను ఆశ్చర్యపోయాను. కొన్ని రోజుల పాటు శ్రమించి, అతన్ని పూర్తి ఫిట్‌గా చేయగలిగాం.. అనుకున్నదాని కంటే చాలా తక్కువ సమయంలోనే హార్దిక్ ఫిట్‌నెస్ సాధించాడు.

జూనియర్ క్రికెట్ ఆడకనే..
హార్ధిక్ పాండ్యా ఎక్కువ జూనియర్ క్రికెట్ ఆడలేదు. సెడన్‌గా అంతర్జాతీయ స్థాయికి ఎంపికై, స్టార్‌గా మారిపోయాడు. అందుకే ఇప్పుడు తనని తాను మెరుగుపర్చుకోవడానికి నిత్యం శ్రమిస్తూనే ఉన్నాడు. జూనియర్ క్రికెట్ ఆడి ఉంటే ఇంత కష్టపడాల్సి వచ్చేది కాదు. అయితే ఇప్పుడు ఫాస్ట్ బౌలర్లు, ఆల్‌రౌండర్లు నిత్యం గాయపడుతూనే ఉన్నారు. ఇప్పుడు గాయాలు కూడా ఆటలో భాగంగా మారిపోయాయి.'అని శంకర్ బసు చెప్పుకొచ్చాడు.

దూసుకెళ్తున్న హార్దిక్..
ఇంగ్లండ్ పర్యటనలో దుమ్మురేపిన హార్దిక్ పాండ్యా వన్డే సిరీస్‌లో 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డు గెలిచాడు. బెస్ట్ టీ20 స్కోరు నమోదు చేసిన హార్ధిక్ పాండ్యా, వన్డేల్లో తొలిసారి నాలుగు వికెట్లు తీసి బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ కూడా క్రియేట్ చేసుకున్నాడు.. ఇంగ్లండ్‌లో 4 వికెట్లు తీసి, 50+ స్కోరు చేసిన మొట్టమొదటి భారత ప్లేయర్‌గా సరికొత్త చరిత్ర లిఖించాడు. సిరీస్ డిసైడర్ కీలక మూడో వన్డే రిషభ్ పంత్ కలిసి జట్టును ఆదుకొని చిరస్మరణీయ విజయాన్నందించాడు.


Click it and Unblock the Notifications
