
ఆర్‌సీబీలో ఆ ఏమోషన్ లేదు..
2019 సీజన్ ఫైనల్లో కూడా రాణించిన వాట్సన్.. విజయం ముంగిట రనౌటయ్యాడు. అయితే గత సీజన్‌లో చెన్నై దారుణ ప్రదర్శనతో లీగ్‌లోనే నిష్క్రమించగా.. ఈ ఆసీస్ ప్లేయర్ ఆటకు అల్విదా ప్రకటించాడు. ఐపీఎల్ ప్రారంభ సీజన్ చాంపియన్ రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన వాట్సన్.. ఆ తర్వాత ఆర్‌సీబీ, సీఎస్‌కేకు ప్రాతినిథ్యం వహించాడు. ఈ నేపథ్యంలో ఆర్‌సీబీ, సీఎస్‌కే జట్లలోని తేడాలను చెప్పుకొచ్చాడు. 'ఆర్‌సీబీ జట్టుతో సాగిన నా ప్రయాణం అద్భుతం. మంచి అనుభవం. ఎందుకంటే వరల్డ్‌క్లాస్ ఆటగాళ్లతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకున్నా. అయితే ఆ జట్టు యాజమాన్యం పూర్తిగా కార్పోరేట్ స్టైల్‌లో ఉంటుంది. ఓనర్స్ ఏమాత్రం ఏమోషనల్ కనెక్షన్ ఉండదు.

అత్యుత్తమ కోచ్..
సీఎస్‌కేతో ఆడటం ఇంక్రీడబుల్ ఎక్స్‌పీరియన్స్. వయసుపైబడిన జట్టు అయినా.. అత్యుత్తమ కెప్టెన్ ధోనీ, ది బెస్ట్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ పర్యవేక్షణలో ఆడటం గొప్ప అనుభూతి. నేను ఇప్పటి వరకు చూసిన ఉత్తమ కోచ్ ఫ్లెమింగ్. అతని మేనేజ్‌మెంట్ స్కిల్స్, ఆటగాళ్లను, టీమ్ వాతావరణాన్ని అర్థం చేసుకునే విధానం అమోఘం. అతని క్రికెట్ నాలెడ్జ్ అల్టిమేట్. ధోనీతో ఉన్న అతని సంబంధం కూడా సూపర్'అని వాట్సన్ కొనియాడాడు.

ఆల్‌రౌండ్ షో..
ఐపీఎల్‌లో 145 మ్యాచ్‌లు ఆడిన వాట్సన్ 3874 పరుగులు చేశాడు. అలాగే 92 వికెట్లు పడగొట్టాడు. తన కెరీర్‌లో రెండు సార్లు టైటిల్ అందుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆరంభ సీజన్‌లో, 2018లో చెన్నై తరఫున చాంపియన్‌గా నిలిచాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో 10,950 పరుగులు చేసిన వాట్సన్ 291 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్‌లో టైటిల్ లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్న సీఎస్‌కే ఆటగాళ్లను కూడా మార్చేసింది. షేన్ వాట్సన్ రిటైర్మెంట్ ప్రకటించగా.. జట్టుకు అక్కర్లేదని భావించిన హర్భజన్ సింగ్, కేదార్ జాదవ్, పియూష్ చావ్లాను వదులుకుంది. ఫిబ్రవరి 18న జరిగిన వేలంలో మొయిన్ అలీ, కృష్ణప్ప గౌతమ్‌లను కొనుగోలు చేసింది.


Click it and Unblock the Notifications












