Asia Cup 2022 టైటిల్ భారత్‌దే.. షేన్ వాట్సన్ జోస్యం.. ఎందుకంటే..?

దుబాయ్: ఆసియా కప్ 2022 టైటిల్ టీమిండియానే గెలుస్తుందని ఆస్ట్రేలియా దిగ్గజం షేన్ వాట్సన్ అన్నాడు. టైటిల్ గెలిచే సత్తా రోహిత్ సేనకే ఉందని చెప్పాడు. అన్ని విభాగాల్లో టీమిండియా పటిష్టంగా ఉందని అభిప్రాయపడ్డాడు. ఇక భారత్‌కు పాకిస్థాన్ నుంచి గట్టి పోటీ ఎదురవుతుందని చెప్పాడు. ఐసీసీ రివ్యూ షోలో మాట్లాడిన షేన్ వాట్సన్ ఆసియా కప్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్ X పాకిస్థాన్ మధ్య జరిగే హై ఓల్టేజ్ మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే వారికే టైటిల్ వరిస్తుందని, తన అభిప్రాయం ప్రకారం బ్యాటింగ్‌లో ఫైర్ పవర్ కలిగిన భారత్ గెలుస్తుందని తెలిపాడు.

భారత్‌దే టైటిల్..
'నా అంచనా ప్రకారం ఆసియాకప్ విన్నర్ భారత్. ఆ జట్టు చాలా బలంగా ఉండటమే కాకుండా పరిస్థితులను త్వరగా అడాప్ట్ చేసుకుంటుంది. భారత్, పాకిస్థాన్ మధ్య జరిగే తొలి మ్యాచ్ చాలా కీలకం. ఎందుకంటే భారత్ ఓడించే సత్తా తమకు ఉందనే ఆత్మవిశ్వాసంతో పాక్ బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టే ఆసియా కప్ గెలిచే అవకాశం ఉంది. నా స్ట్రాంగ్ ఫీలింగ్ మాత్రం భారతే గెలుస్తుందనిపిస్తుంది. ఆ జట్టు బ్యాటింగ్‌లో చాలా ఫైర్ పవర్ ఉంది. కాబట్టి ఆ జట్టును ఓడించడం అంత సులువైన పని కాదు.'అని వాట్సన్ చెప్పుకొచ్చాడు.

ఒక్క ఇన్నింగ్స్ చాలు..
కోహ్లీ రీఎంట్రీ షేన్ వాట్సన్ ప్రత్యేకంగా మాట్లాడాడు. కోహ్లీ మానసికంగా, శారీరకంగా నూతనోత్సాహంతో ఉన్నాడని అభిప్రాయపడ్డాడు. 'ఐపీఎల్ 2021 సీజన్‌లోనే కోహ్లీ తన శక్తిని కోల్పోయినట్లు అనిపించాడు. వరుసగా క్రికెట్ ఆడటంతో చాలా అలసిపోయినట్లు కనిపించాడు. ఈ క్రమంలో నెల రోజులు ఆటకు దూరంగా ఉన్న కోహ్లీ ఆసియా కప్‌లోకి దిగుతున్నాడు. మరో యాభై రోజుల్లో ఆసీస్ వేదికగా టీ20 ప్రపంచకప్ జరగనుంది.
అందుకే విరాట్ వంటి నాణ్యమైన ఆటగాడు ఫామ్‌లోకి రావాలంటే తప్పనిసరిగా విశ్రాంతి అవసరం. అప్పుడే మరింత చురుగ్గా ఆడగలడు. ఫామ్ అందుకోవాలంటే కోహ్లీకి ఒక్క ఇన్నింగ్స్ చాలు. ఆసియా కప్‌లో రాణిస్తాడనే విశ్వాసం ఉంది'' అని షేన్ వాట్సన్ చెప్పుకొచ్చాడు.

సెంచరీ లేక మూడేళ్లు..
ఆగస్ట్ 28న ఆసియా కప్‌లో తమ తొలి మ్యాచ్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడతాయి. ఆటకు విరామం తీసుకుని మైదానంలోకి అడుగు పెడుతున్న విరాట్ ఎలా ఆడతాడో తెలియాలంటే మరో మూడు రోజులు ఆగాల్సిందే. 2019 నవంబర్ నుంచి ఇప్పటి వరకు కోహ్లీ ఒక్క శతకం కూడా సాధించలేకపోయాడు. అయితే అడపాదడపా అర్ధశతకాలు సాధించినా తన స్థాయి ఆటను మాత్రం ప్రదర్శించలేకపోయాడు. విండీస్, జింబాబ్వే పర్యటనలకు దూరంగా ఉన్న కోహ్లీ విశ్రాంతి తీసుకుని ఆసియా కప్‌లో ఆడనుండటంతో అంచనాలు భారీగా పెరిగాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications