న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నో డౌట్.. బాక్సింగ్ డే టెస్ట్ కూడా ఆసీస్‌దే: షేన్ వార్న్

 Shane Warne says India have class players but Australia will blow them away in Melbourne
Ind v Aus 2020,2nd Test: Australia Will Blow Away India At Melbourne -Shane Warne | Oneindia Telugu

సిడ్నీ: భారత జట్టులో క్లాస్ ప్లేయర్లు ఉన్నా బాక్సింగ్ డే టెస్ట్‌లో ఆస్ట్రేలియానే పైచేయి సాధిస్తుందని ఆ జట్టు దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ జోస్యం చెప్పాడు. ఫస్ట్ టెస్ట్‌లో చిత్తయిన భారత్ శనివారం నుంచి ప్రారంభమయ్యే మెల్ బోర్న్ టెస్ట్‌కు సమాయాత్తం అవుతుంది. అయితే ఈ ఘోర ఓటమి నుంచి భారత జట్టు ఇంకా కోలుకోలేదని, ఆటగాళ్లు ఇంకా ఆ లోయెస్ట్ స్కోర్ షాక్‌లో ఉన్నారని వార్న్ తెలిపాడు. తాజాగా ఫాక్స్ క్రికెట్‌తో మాట్లాడిన వార్న్ రెండో టెస్ట్‌కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

'భారత జట్టులో కేఎల్‌ రాహుల్‌, శుభ్‌మన్‌ గిల్‌, అజింక్య రహానే, పుజారా వంటి క్లాస్‌ ప్లేయర్స్‌ ఉన్నా..ఆస్ట్రేలియా ఆధిపత్యమే కొనసాగుతోంది. రెండో టెస్ట్‌లో కంగారులే పైచేయి సాధిస్తారు. మరోవైపు విరాట్ కోహ్లీ, మహ్మద్ షమీ వంటి స్టార్ ఆటగాళ్ల సేవలను కోల్పోవడం భారత జట్టుకు లోటే. మెల్‌బోర్న్‌ లాంటి పిచ్‌కు షమీ బౌలింగ్‌ సరిగ్గా సరిపోతుంది.

ఫస్ట్ టెస్టులో భారత బ్యాట్స్‌మెన్‌ విఫలమయ్యారని విమర్శించడం కన్నా ఆసీస్ పేసర్లు హెజిల్‌వుడ్‌, పాట్‌ కమిన్స్‌ అద్భతంగా రాణించారని ప్రశంసించడం ఉత్తమం. వారికి తోడుగా స్టార్క్‌, నాథన్‌ లయన్‌ కూడా రాణించారు. ఈ నలుగురు ఆస్ట్రేలియా తరఫున అత్యుత్తమ బౌలింగ్‌ దళం. వీరి జోరును ఇలానే మరో నాలుగైదేళ్లు కొనసాగిస్తే ఆసీస్ ఆల్‌టైమ్ అత్యుత్తమ పేసర్లుగా గుర్తించవచ్చు.'అని వార్న్ చెప్పుకొచ్చాడు.

ఇక ఫస్ట్ టెస్ట్‌లో చిత్తుగా ఓడిన భారత్ నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో 0-1తో వెనుకబడింది. సిరీస్ నిలవాలంటే బాక్సింగ్ డే టెస్ట్‌లో భారత్ గెలవడమో.. డ్రాతో గట్టెక్కడమో చేయాలి. కానీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గైర్హాజరీ, మహ్మద్ షమీ గాయం నేపథ్యంలో భారత జట్టు ఎలా రాణిస్తుందో..? తాత్కలిక సారథి అజింక్యా రహానే జట్టును ఎలా నడిపిస్తాడో అనేది ఆసక్తికరంగా మారింది.

ధోనీ చెప్పిన ఆ ఒక్క మాటతో లేచి రెండు చేతులు జేబులో పెట్టుకొని నడుచుకుంటూ వెళ్లిపోయానుధోనీ చెప్పిన ఆ ఒక్క మాటతో లేచి రెండు చేతులు జేబులో పెట్టుకొని నడుచుకుంటూ వెళ్లిపోయాను

Story first published: Thursday, December 24, 2020, 16:12 [IST]
Other articles published on Dec 24, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X