Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ టీమిండియా కెప్టెన్ వల్లే టెస్ట్ క్రికెట్‌కు క్రేజ్: షేన్ వార్న్

Shane Warne Says I Think We Should All Thank Virat Kohli for Pushing Test Cricket

సిడ్నీ: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ వల్లే టెస్టు క్రికెట్‌కు ఆదరణ పెరిగిందని ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ అభిప్రాయపడ్డాడు. తనదైన కెప్టెన్సీతో ఎంతో మందిలో స్ఫూర్తి నింపాడని కొనియాడాడు. కెప్టెన్‌గా టెస్ట్ క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లడంలో విరాట్ సఫలమయ్యాడని, అతనిపై గౌరవం మరింత పెరిగిందని వార్నర్ చెప్పుకొచ్చాడు. ఇక సౌతాఫ్రికా గడ్డపై టెస్ట్ సిరీస్ ఓడిన అనంతరం టీమిండియా కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ తప్పుకున్న విషయం తెలిసిందే. తాజాగా పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో షేన్ వార్న్.. విరాట్ కోహ్లీపై ప్రశంసల జల్లు కురిపించాడు.

విరాట్ కోహ్లీ వల్లే..

విరాట్ కోహ్లీ వల్లే..

'విరాట్‌ కోహ్లీ గొప్ప కెప్టెన్. అందులో ఎలాంటి సందేహం లేదు. అతని నాయకత్వంలోనే భారత్‌ టెస్టు క్రికెట్లో అత్యున్నత శిఖరాలను అధిరోహించింది. వ్యూహాల విషయంలో అతను మెరుగు పడాల్సి ఉన్నా.. నాయకుడిగా కొనసాగినంత కాలం జట్టు సభ్యుల్లో స్ఫూర్తి నింపాడు. తన ఆటతీరుతో టెస్టు క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లిన తీరు చూశాక అతనిపై గౌరవం మరింత పెరిగింది. అతనో అద్భుతమైన క్రికెటర్‌. టెస్టు క్రికెట్‌కు గొప్ప అంబాసిడర్.సుదీర్ఘ ఫార్మాట్ పట్ల అతనికి మక్కువ ఎక్కువ. ప్రస్తుత టీ20 క్రికెట్‌ యుగంలో కూడా టెస్టు క్రికెట్‌కు ఆదరణ పెరిగిందంటే అది కోహ్లీ వంటి గొప్ప ఆటగాళ్ల వల్లనే సాధ్యమైంది.

కోహ్లీ థ్యాంక్స్ చెప్పాలి..

కోహ్లీ థ్యాంక్స్ చెప్పాలి..

ఇలాంటి ఆటగాళ్లు లేకుంటే ఇప్పటికే చాలా దేశాలు సుదీర్ఘ ఫార్మాట్‌కు దూరమయ్యేవి. టెస్టుల ద్వారానే ఆటగాళ్ల సత్తా వెలుగులోకి వస్తుంది. టెస్టు క్రికెట్‌ను ప్రోత్సహించడంలో బీసీసీఐ కూడా ఎప్పుడూ ముందుంటుంది. ఆ విషయంలో మనమంతా కోహ్లీకి, అతనికి సహకరించిన బీసీసీఐకి ధన్యవాదాలు చెప్పాలి' అని షేన్ వార్న్‌ పేర్కొన్నాడు. విరాట్‌ కోహ్లీ అనంతరం.. భారత జట్టు టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే విషయంలో రోహిత్‌ శర్మకే తొలి ప్రాధాన్యం ఇస్తానని షేన్‌వార్న్‌ తెలిపాడు.

రోహిత్ శర్మనే తదుపరి కెప్టెన్..

రోహిత్ శర్మనే తదుపరి కెప్టెన్..

'పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కెప్టెన్‌గా రోహిత్ శర్మ సత్తా చాటాడు. కాబట్టి అతనే టెస్ట్ సారథ్య బాధ్యతలు తీసుకునే చాన్సుంది. కేఎల్ రాహుల్, రహానేలకు కూడా అవకాశం ఇవ్వచ్చు. అయితే రహానే ఫామ్‌లో లేడు. మళ్లీ లయ అందుకుంటే అతనికి సారథ్య బాధ్యతలు ఇవ్వవచ్చు. అతను మంచి కెప్టెన్. ఇన్ని ఆప్షన్స్ ఉన్న ఇండియా చాలా లక్కీ. నా వరకు అయితే రోహిత్ శర్మనే టెస్ట్ కెప్టెన్ అవుతాడనిపిస్తుంది. వికెట్ కీపర్లను కెప్టెన్ చేయాలనే కాన్సెప్ట్ నేను నమ్మను. కెప్టెన్ కంటే కీపర్లు వైస్ కెప్టెన్‌గా ఉండాలి. భారత జట్టులో జస్‌ప్రీత్ బుమ్రాను కూడా కెప్టెన్ చేయవచ్చు.'అని వార్నర్ చెప్పుకొచ్చాడు.

Story first published: Tuesday, January 25, 2022, 12:42 [IST]
Other articles published on Jan 25, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+