న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'సంజూ శాంసన్‌ అద్భుతమైన ఆటగాడు.. అతడు జట్టులో లేకపోవడమా?'

Shane Warne said I am surprised Sanju Samson not playing for India across formats

దుబాయ్‌: కేరళ యువ వికెట్ కీపర్ సంజూ శాంసన్‌పై ఆస్ట్రేలియా స్పిన్‌ దిగ్గజం, రాజస్థాన్‌ రాయల్స్‌ మెంటార్‌ షేన్‌ వార్న్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. అతడో అద్భుతమైన ప్లేయర్‌ అని, భారత జట్టులో ఉండాల్సిన ఆటగాడు అని పేర్కొన్నాడు. భారత జట్టు తరఫున మూడు ఫార్మాట్లలో అతడికి చోటు దక్కకపోవడం తనకు ఆశ్చర్యం కలిగిస్తోందని వార్న్‌ అన్నాడు. ఐపీఎల్ 2020 తొలి మ్యాచ్‌లోనే రాజస్థాన్‌ జట్టు చెన్నైతో తలపడింది. ఆ మ్యాచ్‌లో సంజూ 32 బంతుల్లోనే 9 సిక్సర్ల సాయంతో 74 పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు.

భారత జట్టులో ఉండాల్సిన ఆటగాడు:

భారత జట్టులో ఉండాల్సిన ఆటగాడు:

శనివారం ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో షేన్‌ వార్న్ మాట్లాడుతూ... 'సంజూ శాంసన్‌ అద్భుతమైన ఆటగాడు. నేను చాలా రోజుల నుంచి అంటున్నదే మళ్లీ మళ్లీ అంటున్నా. శాంసన్‌ భారత జట్టులో ఉండాల్సిన ఆటగాడు. అన్ని ఫార్మాట్లలో రాణించే సత్తా ఉన్న బ్యాట్స్‌మన్‌. పెద్ద పెద్ద బ్యాట్స్‌మెన్‌కే కష్టమైన షాట్లు సైతం అలవోకగా బాదగలడు. చాలాకాలం నుంచి సంజూని గమనిస్తూనే ఉన్నా. అతడు టీమిండియాలో లేకపోవడం నన్ను ఇప్పటికీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది' అని అన్నాడు.

భారత జెర్సీలో చూస్తా

భారత జెర్సీలో చూస్తా

సంజూ శాంసన్‌ ఇలాగే రాణిస్తే రాజస్థాన్ రాయల్స్‌‌ జట్టు టైటిల్‌ గెలుస్తుందనడంలో ఎలాంటి అనుమానం లేదని షేన్‌ వార్న్ ధీమా వ్యక్తం చేశాడు. త్వరలోనే సంజూని భారత జెర్సీలో చూస్తానని భావిస్తున్నానన్నాడు. ఎంఎస్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత వికెట్‌ కీపర్‌ కోసం చాలామంది క్రికెటర్లు పోటీ పడుతున్నారు. కేఎల్‌ రాహుల్‌, రిషభ్ పంత్‌తో పాటు సంజూ శాంసన్‌ ముందు వరుసలో ఉన్నాడు. ఈ ఐపీఎల్ సీజన్‌లో సంజూ ఇదే ఫామ్‌ కొనిసాగించి భారత జట్టులోకి రావాలని చాలా మంది ఆశిస్తున్నారు.

2015లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసినా

2015లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసినా

ఐపీఎల్, దేశవాళీ క్రికెట్‌లో పరుగుల మోత మోగించే సంజు శాంసన్‌కు దురదృష్టవశాత్తు అంతర్జాతీయ క్రికెట్‌లో రావాల్సిన అవకాశాలు రాలేదు. ఇక రాక రాక వచ్చిన అవకాశాల్లో అతను నిరూపించుకోలేకపోయాడు. 2015 జింబాబ్వేతో జరిగిన టీ20 ద్వారా భారత జట్టులోకి వచ్చిన శాంసన్​.. మరో అవకాశం కోసం నాలుగేళ్లు వేచి చూడాల్సి వచ్చింది. గతేడాది బంగ్లాదేశ్​తో టీ20 సిరీస్​కు ఎంపికైనా.. తుది జట్టులో చోటు దక్కలేదు. బెంచ్‌కే పరిమితమయ్యాడు. అయితే ఈ ఏడాది జనవరిలో న్యూజిలాండ్‌తో జరిగిన రెండు టీ20ల్లో తుది జట్టులో చోటు దక్కించుకున్న శాంసన్.. వరుసగా 8, 2 పరుగులు చేశాడు.

బ్రాండ్‌ అంబాసిడర్‌గా

బ్రాండ్‌ అంబాసిడర్‌గా

రాజస్థాన్‌ రాయల్స్ జట్టుకు ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్‌ వార్న్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్నాడు. లెజండరీ క్రికెటర్ వార్న్‌ను వరుసగా రెండో ఏడాది తమ బ్రాండ్ అంబాసిడర్‌గా ఆర్‌ఆర్ ఫ్రాంఛైజీ ఐపీఎల్ ప్రారంభం ముందే నియమించింది. అంతేకాదు వార్న్ ఆర్‌ఆర్ జట్టుకు‌ మెంటార్‌గానూ వ్యవహరిస్తున్నాడు. వార్న్‌ సారథ్యంలో రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు ఆరంభ ఐపీఎల్‌ సీజన్‌ 2008లో చాంపియన్‌గా నిలిచింది.‌ జట్టులోని యువ ఆటగాళ్లకు వార్న్‌ మార్గనిర్దేశనం చేయడానికి ఫ్రాంఛైజీ టైటిల్‌ విన్నింగ్‌ కెప్టెన్‌ను మళ్లీ ఆహ్వానించింది.

KKR v SRH: 'అతడు లేకుండా సన్‌రైజర్స్ 180 రన్స్ చేయడం కష్టం.. 140 పరుగులు మాత్రమే వస్తాయి'

Story first published: Sunday, September 27, 2020, 16:39 [IST]
Other articles published on Sep 27, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X