న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అంపైర్ తప్పిదంతోనే సచిన్ బతికిపోయాడు.. మీరే చెప్పండి అది ఎలా నాటౌటో?

Shane Warne reacts to clip of bowling to Sachin Tendulkar

మెల్‌బోర్న్‌: కరోనా దెబ్బతో ఓవైపు ప్రపంచమంతా అతలాకుతలమవుతుండగా.. మరోవైపు క్రీడారంగం కుదేలైంది. ఇప్పటికే కొన్ని టోర్నీలు పూర్తిగా రద్దవ్వగా.. మరికొన్ని వాయిదా పడ్డాయి. ఇంకొన్ని జరుగుతాయో లేదోననే సందిగ్ధత నెలకొంది. ఇక ఈ ప్రాణాంతక వైరస్ నిర్మూలనకు ప్రపంచమే స్వీయ నిర్బంధంలోకి వెళ్లింది. దీంతో స్టార్ ప్లేయర్లంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో పాత జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ వాటికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు.ఇంకొంతమంది లైవ్ చాట్‌లు.. ఫ్యాన్స్‌తో చిట్‌చాట్‌లు చేస్తున్నారు. తమ కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు.

ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ కూడా ఓ ఆసక్తికర వీడియోను పంచుకున్నాడు. పైగా ఎన్నో ఏళ్లుగా తనకు ఉన్న సందేహాన్ని తీర్చాలని ఫ్యాన్స్‌ను కోరాడు. అది కూడా టీమిండియా లెజండరీ క్రికెటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్‌ టెండూల్కర్‌ ఔట్ విషయమని దానికి సంబంధించిన వీడియోను షేర్ చేశాడు. 'రండి సీరియస్‌గా చర్చలో పాల్గొనండి.. ఇదెలా నాటౌటో చెప్పండి?'అని ట్వీట్ చేశాడు.

1998లో చెన్నై వేదికగా ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో సచిన్‌ టెండూల్కర్‌ తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైనా.. రెండో ఇన్నింగ్స్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చాడు. తొలి ఇన్నింగ్స్‌లో 4 పరుగుల వద్ద షేన్ వార్న్ బౌలింగ్‌లోనే ఔటయ్యాడు. సెకండ్ ఇన్నింగ్స్‌లో మాత్రం 155 పరుగులతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.

అయితే ఈ ఇన్నింగ్స్‌లో అంపైర్ తప్పిదంతో సచిన్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడనేది వార్న్ ఫీలింగ్. ఈ మ్యాచ్‌లో వార్న్ వేసిన ఓ బంతి సచిన్ ప్యాడ్లను తాకింది. దీంతో వార్న్ ఎల్బీ కోసం గట్టిగా అప్పీల్ చేశాడు. కానీ ఫీల్డ్అంపైర్ దాన్ని తిరస్కరించాడు. ఈ వీడియోనే తాజాగా షేర్ చేసిన వార్న్ ఇదెలా నాటౌటో చెప్పాలని ప్రశ్నించాడు.

Story first published: Monday, April 6, 2020, 19:03 [IST]
Other articles published on Apr 6, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X