
హార్ట్ చెకప్ చేసుకున్నాడు..
ఇక వార్న్ హఠాన్మరణంపై థాయ్‌లాండ్ పోలీసులు జరుపుతున్న విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. షేన్ వార్న్ ఉన్న విల్లా గదిలో ఫ్లోర్‌తో పాటు టవల్‌పై రక్తపు మరకల్ని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. థాయ్‌లాండ్‌కు రాకముందే వార్న్ చాతి నొప్పి సమస్యతో బాధపడ్డాడని, ఇటీవలే హార్ట్ చెకప్ కోసం డాక్టర్‌ను కలిసినట్లు తమ విచారణలో తెలిసిందన్నారు. ఈ క్రమంలోనే వార్న్ మరణాన్ని అనుమానాస్పద మృతిగా పరిగణించట్లేదని చెప్పారు. ఇక వార్న్ మేనేజర్ మాత్రం అతని చాతి నొప్పి గురించి తెలియదన్నాడు.

14 రోజులుగా లిక్విడే..
కాకపోతే బరువు తగ్గడం కోసం గత రెండు వారాలుగా వార్న్ డైట్ మెయింటేన్ చేస్తున్న విషయం మాత్రమే తనకు తెలుసని క్రికెట్ ఆస్ట్రేలియా అధికారిక వెబ్‌సైట్‌కు తెలిపాడు. అయితే అతని మరణానికి ఈ డైట్, తీవ్ర వర్కౌట్సే కారణమయ్యాయనే విషయం తనకు ఇప్పుడే అర్థమైందన్నాడు. ‘బరువు తగ్గాలనే లక్ష్యంతో వార్న్ దారుణమైన డైట్‌లు ఫాలో అయ్యాడు. అందులో ఒక స్టేజ్ మాత్రమే పూర్తి చేశాడు. గత 14 రోజులుగా కేవలం ద్రవపదార్థాలను మాత్రమే ఆహారంగా తీసుకున్నాడు. అయితే గతంలో కూడా ఇలాంటి డైట్స్ అతను ఫాలో అయ్యాడు.'అని ఎర్స్‌కిన్ చెప్పుకొచ్చాడు.
జూలైలో ఫిట్ అవుతానని..
ఫిట్‌నెస్‌ను ఉద్దేశించి ఫిబ్రవరి 28 వార్న్ చేసిన ట్వీట్ కూడా ఎర్స్‌కిన్ వాదనను బలపరుస్తోంది. ఈ ట్వీట్‌లో అత్యంత ఫిట్‌గా ఉన్న ఫొటోను షేర్ చేసిన వార్న్ మరికొద్ది రోజుల్లో ఇలా తయారవుతానని క్యాప్షన్‌గా పేర్కొన్నాడు. 'ఆపరేషన్ ష్రెడ్ ప్రారంభమై 10 రోజులు అవుతుంది. జూలై వరకు ఒకప్పటి షేన్ వార్న్‌లా తయారవ్వడమే లక్ష్యం. హెల్తీ, ఫిట్‌నెస్, ఫీల్ గుడ్ ఫ్రైడే'అనే హ్యాష్ ట్యాగ్‌లను ఆ ట్వీట్‌కు వార్న్ జత చేశాడు. ఫిట్‌గా తయారవ్వాలనే లక్ష్యంతో చేసిన డైట్‌లు వార్న్ ఆరోగ్యాన్ని దెబ్బతీసాయి. వైద్యులు సైతం.. బరువు తగ్గడం కోసం ఇలాంటి డైట్స్ చేయవద్దని సూచిస్తున్నారు.

మందు తాగలేదు..
'మ్యాచ్‌ల కామెంట్రీ కోసం ఇంగ్లండ్ వెళ్లే ముందు దొరికిన సమయాన్ని గడిపేందుకు వార్న్ థాయ్‌లాండ్‌కు వచ్చాడు. మరణానికి ముందు అతను మద్యం తీసుకోలేదు. తన స్నేహితుడు నియోఫిటోను కలిసి భోజనం చేయాలనుకున్నాడు. సాయంత్రం 5 గంటల సమయంలో మరికొంత మందిని వార్న్, నియోఫిటో కలవాలనుకున్నారు.
పక్క గదిలోనే ఉన్న నియో వచ్చేసరికి వార్న్ నిర్జీవంగా పడి ఉన్నాడు. అతనికి ఏదో అయిందని నియో భావించాడు. నోటిలో నోరు పెట్టి శ్వాస ఇచ్చేందుకు ప్రయత్నించాడు.
హృదయ స్పందన లేకపోవడంతో సీపీఆర్ చేశాడు. 20 నిమిషాల తర్వాత అంబులెన్స్ వచ్చింది. ఓ గంట తర్వాత వార్న్ చనిపోయాడనే విషయం తెలిసింది. అతన్ని రెండు గంటల ముందు చివరగా చూశా. అతనెక్కువగా మద్యం తాగడం లేదు. బరువు తగ్గేందుకు ఆహార నియమాలు పాటిస్తున్నాడు'' అని సుదీర్ఘ కాలంగా వార్న్ మేనేజర్‌గా ఉన్న జేమ్స్ చెప్పాడు.


Click it and Unblock the Notifications












