'బుమ్రా ఎప్పటికైనా ప్రమాదకారే.. సరైన పిచ్ తగిలితే ఆసీస్‌కు ఉంటది..

అడిలైడ్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగు మ్యాచుల టెస్ట్ సిరీస్‌లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఎప్పటికైనా ప్రమాదకారేనని న్యూజిలాండ్ మాజీ పేసర్ షేన్ బాండ్ పేర్కొన్నాడు. ఇప్పటికే బుమ్రా ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్లను ముప్పతిప్పలు పెట్టడానికి తన అస్త్రాలన్ని సిద్ధం చేసుకుంటున్నాడన్నాడు. అడిలైడ్ వేదికగా గురువారం ఉదయం తొలి టెస్టు ప్రారంభమైన సందర్భంగా బుమ్రా గురించి బాండ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. బాండ్ న్యూజిలాండ్ తరఫున 18 టెస్టులు, 82 వన్డేలు, 20 టీ20లు ఆడాడు. టెస్టుల్లో87, వన్డేల్లో 147, టీ20ల్లో 25వికెట్లు పడగొట్టాడు.

సరైన పిచ్ తగిలితే:
తాజాగా షేన్ బాండ్ మాట్లాడుతూ... 'బూమ్.. బుమ్రా ఫామ్‌లో ఉంటే చాలా ప్రమాదకారి. గంటకు 145 కిమీ వేగంతో వేసే బంతులు ఆస్ట్రేలియాను సర్వనాశనం చేయనున్నాయి. ఇప్పటికే బుమ్రా ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్లను ముప్పతిప్పలు పెట్టడానికి తన అస్త్రాలన్ని సిద్ధం చేసుకుంటున్నాడు. ఒకవేళ సరైన పిచ్ తగిలితే మాత్రం అతన్ని ఆపడం ఎవరితరం కాదు. పేసర్లకు స్వర్గధామంగా నిలిచే పెర్త్ మైదానంలో బుమ్రా చెలరేగే అవకాశం ఉంది. 2018-19 ఆసీస్ పర్యటనను అతను మరోసారి రిపీట్ చేస్తే మాత్రం ఆసీస్‌కు కష్టాలు తప్పకపోవచ్చు' అని అన్నాడు.

ఫ్లాట్ పిచ్‌లు సిద్దం చేయడంతో:
జస్ప్రీత్ బుమ్రాకు ఆస్ట్రేలియా పర్యటన ప్రారంభంలో అంతగా అచ్చి రాలేదు. వన్డే సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు కలిపి నాలుగు వికెట్లు మాత్రమే తీయగలిగాడు. వన్డే మ్యాచ్‌లు జరిగిన వేదికలన్ని ఫ్లాట్ పిచ్‌లు సిద్దం చేయడంతో.. ఎక్కువగా వికెట్లు తీయలేకపోయాడు. ఇక ఆ తర్వాత జరిగిన టీ20 సిరీస్‌లో బుమ్రాను ఆడించలేదు. అయితే టెస్టు సిరీస్‌లో మాత్రం పరిస్థితి అలా ఉండకపోవచ్చు. టెస్టు ఫార్మాట్‌లో సుధీర్ఘంగా బౌలింగ్ చేసే అవకాశం ఉండడం, మ్యాచ్‌లన్నీ పేసర్లకు అనుకూలించే విధంగా వికెట్లు రూపొందించడం బుమ్రాకు కిలిసిరానున్నాయి.

గత పర్యటనలో 21 వికెట్లు:
2018-19 ఆసీస్ పర్యటనలో పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా టెస్టు సిరీస్‌లో దుమ్మురేపే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. నాలుగు టెస్టుల సిరీస్‌లో 21 వికెట్లు తీసి కోహ్లీసేన 2-1 తేడాతో సిరీస్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. ఇప్పుడు కూడా బుమ్రా కీలకం కానున్నాడు. అతడి ప్రదర్శనపైనే టీమిండియా విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఇప్పటివరకు మనం బుమ్రాను ప్రధాన పేసర్‌గానే చూశాం కానీ తాజాగా మరోకొత్త అవతారం కూడా ఎత్తాడు. బ్యాట్స్‌మన్ అవతారం కూడా ఎత్తి ఆస్ట్రేలియా గడ్డపై ఏకంగా హాఫ్ సెంచరీ సాధించాడు. ప్రాక్టీస్ మ్యాచ్‌లో బుమ్రా ముందు ఆసీస్ బౌలర్లు అందరూ తేలిపోయారు. మరి అసలైన సమరంలో 'బూమ్ బూమ్' ఆదుకుంటాడో లేదో చూడాలి.
పృథ్వీ షా ఇక మారవా?.. ఆడటం రాకుంటే పోయి ఇంట్లో కూర్చో!! కుక్కలు, పిల్లులతో పోల్చుతూ!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications