Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పృథ్వీ షా ఇక మారవా?.. ఆడటం రాకుంటే పోయి ఇంట్లో కూర్చో!! కుక్కలు, పిల్లులతో పోల్చుతూ!

Prithvi Shaw Out for Duck, Fans Brutally Troll him
Ind vs Aus 2020,1st Test : Netigens Trolling Prithvi Shaw's Perfomence During 1st Test

హైదరాబాద్: అడిలైడ్ వేదికగా గురువారం ఉదయం ప్రారంభమైన డే/నైట్ టెస్టులో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమిండియాకు ఆదిలోనే భారీ ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. యువ ఓపెనర్‌ పృథ్వీ షా తొలి ఓవర్‌ రెండో బంతికే మిచెల్‌ స్టార్క్‌ బౌలింగ్‌లో డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. స్టార్క్‌ గుడ్ లెంగ్త్ రూపంలో ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా బంతిని సంధించగా.. ఏమాత్రం పాదాల కదలిక లేకుండా కవర్స్ దిశగా హిట్ చేసేందుకు షా ప్రయత్నించాడు. బ్యాట్ ఎడ్జ్ తాకిన బంతి నేరుగా వచ్చి మిడిల్ స్టంప్‌ని గీరాటేసింది. దాంతో స్కోరు బోర్డుపై ఒక్క పరుగు కూడా చేరకుండానే టీమిండియా వికెట్ చేజార్చుకుంది.

పృథ్వీ షా డకౌట్‌:

మయాంక్ అగర్వాల్‌తో కలిసి భారత్ ఇన్నింగ్స్‌ని ప్రారంభించిన పృథ్వీ షా పూర్తిగా నిరచాపరిచాడు. ఫామ్‌లో ఉన్న మరో యువ ఓపెనర్ శుభమన్ గిల్‌ని కాదని తొలి టెస్టుకి షాని ఎంపిక చేయడంపై ఫాన్స్ పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. వాస్తవానికి ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో గిల్‌ మంచి ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్నాడు. హాఫ్ సెంచరీ కూడా చేశాడు. అదే సమయంలో షా విఫలమయ్యాడు. దీంతో తొలి మ్యాచ్‌కు ఒకరోజు ముందు ప్రకటించిన తుది జట్టులో గిల్‌ ఉంటాడని అంతా భావించారు. అయితే అనూహ్యంగా షాకు చాన్స్‌ దక్కింది. కానీ షా ఆ అవకాశాన్ని వినియోగించుకోకుండానే డకౌట్‌గా వెనుదిరగడం పెద్ద దుమారమే రేపుతోంది.

 10 ఇన్నింగ్స్‌ల్లో విఫలం:

10 ఇన్నింగ్స్‌ల్లో విఫలం:

2018లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చిన పృథ్వీ షా.. తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో అదరగొట్టాడు. అతని ఆటతీరుని చూసి 'జూనియర్ సచిన్' అంటూ మాజీ క్రికెటర్లు కితాబిచ్చారు. కానీ ఆ అంచనాల్ని అందుకోవడంలో షా విఫలమయ్యాడు. గత కొంతకాలంగా షా పేలవ ఫామ్‌తో నిరాశపరుస్తున్నాడు. తొలి టెస్టుకి ముందు చివరి 10 ఇన్నింగ్స్‌ల్లో షా చేసిన పరుగులు వరుసగా ఇలా ఉన్నాయి. 0, 0, 7, 10, 9, 0, 0, 19, 40, 3 ఇవి మనోడి గణాంకాలు. దాంతో శుభమన్ గిల్‌కి అవకాశమివ్వాలని అందరూ సూచించారు. కానీ టీమిండియా మేనేజ్మెంట్ షాకే ఓటేసింది.

పోయి ఇంట్లో కూర్చో:

పోయి ఇంట్లో కూర్చో:

పృథ్వీ షా డకౌట్‌గా వెనుదిరగడంతో నెటిజన్లు తమదైన శైలిలో ట్రోల్‌ చేస్తున్నారు. కుక్కలు, పిల్లులతో పోల్చుతూ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. కొందరయితే బీర్ గ్లాసులో బిస్కట్ ముంచుకుని తింటున్న పోటోలను పోస్ట్ చేస్తున్నారు. 'పృథ్వీ షాకు అవకాశాలు ఎందుకిస్తారో అర్థం కావడం లేదు', 'పృథ్వీ షా స్థానంలో గిల్‌ లేదా రాహుల్‌కు అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేది', 'పృథ్వీ షా వన్డే, టెస్టు, ప్రాక్టీస్‌ ఇలా ఏదైనా నీ ఆటతీరు మారదా?', 'వరుసగా విఫలమవుతున్న షాకు ఇంకా ఎన్ని అవకాశాలు ఇస్తారో', 'పృథ్వీ నీకు అవకాశాలు ఇచ్చి దండగ.. పోయి ఇంట్లో కూర్చో' అంటూ నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు.

విరాట్ కోహ్లీ టాస్‌ గెలిస్తే.. ఇక మ్యాచ్‌ గెలిచినట్లే! ఇప్పటికే 21 సార్లు!

Story first published: Thursday, December 17, 2020, 14:35 [IST]
Other articles published on Dec 17, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+