బంగారం కోసం పోయి డైమండ్లను వదులుకున్నాం.. రోహిత్, ద్రవిడ్ తీరుపై ఫ్యాన్స్ ఫైర్!

హైదరాబాద్: ఆసియాకప్ 2022 వైఫల్యానికి ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు తిరుగులేదు. ఐపీఎల్‌లో అత్యధికసార్లు టైటిల్ గెలిచిన కెప్టెన్‌గా రోహిత్ శర్మకు వంక పెట్టినోడు లేడు. విరాట్ కోహ్లీ గైర్హాజరీలో అప్పుడప్పుడు భారత జట్టు పగ్గాలు చేపట్టిన రోహిత్.. జట్టును విజయపథంలో నడిపించాడు. సారథిగా 2018 ఆసియాకప్ అందించాడు. ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచి నిదహాస్ ట్రోఫీని తీసుకొచ్చాడు. కోహ్లీ నాయకత్వంలో భారత జట్టు ద్వైపాక్షిక సిరీస్‌లు గెలుస్తున్నప్పటికీ.. ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా నెగ్గలేకపోవడంతో.. విరాట్ స్థానంలో రోహిత్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించాలనే డిమాండ్ మొదలైంది. టెస్టుల్లో కోహ్లీని కెప్టెన్‌గా కొనసాగిస్తూ.. టీ20, వన్డేలకు రోహిత్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని కూడా చాలా మంది డిమాండ్ చేశారు.
రోహిత్ కెప్టెన్సీ వైఫల్యం..
ఆ తర్వాత బోర్డు ఒత్తిడి మేరకు విరాట్ కోహ్లీనే కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో రోహిత్ శర్మ పూర్తి స్థాయి పగ్గాలు అందుకున్నాడు. అతనికి తోడుగా జూనియర్ క్రికెట్‌లో కోచ్‌గా సత్తా చాటిన రాహుల్ ద్రవిడ్‌ను తీసుకొచ్చారు. దాంతో టీమిండియా ప్రపంచకప్ గెలవడం ఖాయమని అంతా అనుకున్నారు. కెప్టెన్‌గా రోహిత్ శర్మ సైతం వరుస విజయాలందించి టీమ్‌ను అగ్రస్థానంలో నిలబెట్టాడు. కానీ ఆసియా కప్‌లో ఫైనల్ చేరకుండా ఇంటిదారిపట్టడంతో రోహిత్ కెప్టెన్సీపై అసంతృప్తి మొదలైంది. అతను కూడా అందరిలా సాధా సీదా సారథి అనే విషయం బోధపడింది. తాజాగా ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన పరాజయంతో రోహిత్ కెప్టెన్సీ డొల్లతనం బయటపడింది.
డైమండ్లను వదులుకున్నాం..
దాంతో అభిమానులు రోహిత్ శర్మపై విమర్శలు గుప్పిస్తున్నారు. 209 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోకపోవడం ఏంటని నిలదీస్తున్నారు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో 200+ స్కోర్ చేసి ఎప్పుడూ ఓడిపోలేదనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. రోహిత్ శర్మ కంటే కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ ఎంతో నయమని కామెంట్ చేస్తున్నారు. బంగారం కోసం వెతకబోయి.. డైమండ్లను వదులుకున్నామని సెటైర్లు పేల్చుతున్నారు. కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ అసమర్థుడని, అతని కారణంగానే రోహిత్ సైతం చెత్త కెప్టెన్‌గా మారుతున్నాడని మండిపడుతున్నారు.
ఒత్తిడిలో రోహిత్..
రోహిత్ ఒత్తిడిలో ఉన్నాడని మ్యాచ్ సందర్భంగా అతడు వ్యవహరిస్తోన్న తీరును బట్టి అర్థమవుతోంది. పాక్‌తో మ్యాచ్‌లో కీలక సమయంలో అర్షదీప్ సింగ్ క్యాచ్‌ను చేజార్చినప్పుడు రోహిత్ తన భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయాడు. శ్రీలంకపై చివరి ఓవర్ బౌలింగ్ చేసిన అర్షదీప్ సూచనలు ఇవ్వబోగా కెప్టెన్ పట్టించుకోలేదు. భారత్ ఆసియా కప్ ఫైనల్ చేరలేకపోయినా.. రోహిత్ 'చిల్' అంటూ చేసిన వ్యాఖ్యల పట్ల అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
భువీతో 19వ ఓవర్..?
ఆసీస్‌తో మ్యాచ్‌లో చేతిలో ఆరుగురు బౌలర్లున్నప్పటికీ.. 19వ ఓవర్‌ను మళ్లీ భువనేశ్వర్ కుమార్‌తోనే వేయించడం పట్ల కూడా కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆసియా కప్‌లో పాక్, శ్రీలంకతో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ 19 ఓవర్ బౌలింగ్ చేసిన భువీ.. ధారాళంగా పరుగులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లోనూ 19వ ఓవర్లో భువీ 16 పరుగులు ఇచ్చుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications