Shakib Al Hasan: అదే మా కొంప ముంచింది!
PAK vs BAN, World Cup 2023: బ్యాటింగ్ వైఫల్యమే తమ పతనాన్ని శాసించిందని బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ అన్నాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా పాకిస్థాన్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 7 వికెట్ల తేడాతో చిత్తు అయ్యింది. ఈ పరాజయంతో సెమీస్ రేసు నుంచి బంగ్లాదేశ్ అధికారికంగా తప్పుకుంది. 7 మ్యాచ్‌ల్లో 6 ఓడిన బంగ్లాదేశ్ చివరి 2 మ్యాచ్‌లు గెలిచినా సెమీస్ చేరలేదు.
మ్యాచ్ అనంతరం తమ ఘోర పరాజయంపై స్పందించిన షకీబ్ అల్ హసన్ (Shakib Al Hasan) తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. జట్టు ప్రదర్శన ఎందుకు ఇలా ఉందో అర్థం కావడం లేదన్నాడు. 'పోరాడే లక్ష్యాన్ని నమోదు చేయలేకపోయాం. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. కానీ ఆరంభంలోనే మేం వికెట్లు కోల్పోయాం.

మాకు మంచి భాగస్వామ్యం లభించినా.. అది సరిపోలేదు. దాంతో భారీ స్కోర్ నమోదు చేయలేకపోయాం. కనీసం బౌలింగ్‌లోనైనా మేం మెరుగైన ప్రదర్శన చేయాల్సింది. పాకిస్థాన్ పవర్ ప్లేలో అద్భుతంగా ఆడింది. ఈ విజయానికి వారు పూర్తి అర్హులు. నా బ్యాటింగ్ ఆర్డర్ గురించి మేం ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను చాలా ముందుగా బ్యాటింగ్ చేస్తున్నాను.
పరుగులు చేయలేకపోతున్నాను. నా ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది. ఈ దశలో భారీ మార్పులు కష్టమే. తప్పని పరిస్థితుల్లో మేం చేసిన మార్పులు కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మేం సమష్టిగా రాణించాల్సింది. కానీ అది జరగడం లేదు. మా వైఫల్యానికి గల కారణాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. కానీ తెలియడం లేదు. మేం ఎక్కడికి వెళ్లినా మా అభిమానులు మైదానానికి వచ్చి మద్దతు తెలుపుతారు. ఎప్పుడూ మాకు తోడుగా ఉంటారు. వారే మా ప్రధాన బలం.'అని షకీబ్ అల్ హసన్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 45.1 ఓవర్లలో 204 పరుగులకు ఆలౌట్ అయ్యింది. మహ్మదుల్లా(70 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 56) హాఫ్ సెంచరీతో రాణించగా.. లిటన్ దాస్(64 బంతుల్లో 6 ఫోర్లతో 45), షకీబ్ అల్ హసన్(64 బంతుల్లో 4 ఫోర్లతో 43) పర్వాలేదనిపించారు. పాకిస్థాన్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది, మహమ్మద్ వసీమ్ మూడేసి వికెట్లు తీయగా.. ఇఫ్తికర్ అహ్మద్, ఉసామా మిర్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన పాకిస్థాన్ 32.3 ఓవర్లలో 3 వికెట్లకు 205 పరుగులు చేసి 105 బంతులు మిగిలి ఉండగానే సునాయస విజయాన్నందుకుంది. ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్(69 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 68), ఫకార్ జమాన్(74 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో 81) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. బంగ్లాదేశ్ బౌలర్లలో మెహ్‌దీహసన్ మీరాజ్(3/60) ఒక్కడే మూడు వికెట్లు తీసాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications