Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ ఇద్దరి వల్లే ఓడాం.. అయినా భారత్‌ను వణికించాం: షకీబ్ అల్ హసన్

Shakib Al Hasan Says Credit goes to Shreyas and Ashwin after Indias win over Bangladesh in 2nd Test

మిర్పూర్: రవిచంద్రన్ అశ్విన్, శ్రేయస్ అయ్యర్ అసాధారణ బ్యాటింగ్‌తో తమ ఓటమిని శాసించారని బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ అన్నాడు. తీవ్ర ఒత్తిడిని అధిగమిస్తూ ఈ ఇద్దరూ ఆడిన తీరు అమోఘమని కొనియాడాడు. ఆదివారం ముగిసిన రెండో టెస్ట్‌లో భారత్ 3 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించి రెండు టెస్ట్‌ల సిరీస్‌ను 2-0తో క్లీన్‌ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఓటమి అనంతరం మాట్లాడిన షకీబ్ అల్ హసన్.. గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమిపాలయ్యామని చెప్పాడు. ఒక్క వికెట్ తీసినా.. మరో 70 పరుగులు అదనంగా చేసినా ఫలితం మరోలా ఉండేదన్నాడు. ఏది ఏమైనప్పటికీ ఈ మ్యాచ్‌లో తమ జట్టు గొప్పగా పోరాడిందని, బ్రాండ్ ఆఫ్ క్రికెట్‌తో పటిష్ట భారత్‌ను వణికించిందని చెప్పుకొచ్చాడు.

'జట్టులోని ప్రతీ ఒక్కరు విజయం కోసం కృషి చేశారు. మిర్పూర్‌లో గెలిచే అవకాశాలున్నాయని మాకు బాగా తెలుసు. ఈ మ్యాచ్‌తో టెస్ట్ క్రికెట్‌‌లోని అసలు మజా లభించింది. ఈ మ్యాచ్‌ను గ్యాలరీలోని ప్రేక్షకులు బాగా ఆస్వాదించారు. రెండు జట్లు అసాధారణ ఆటతీరుతో ఆకట్టుకున్నాయి. ఈ విజయం క్రెడిట్ మాత్రం అశ్విన్, శ్రేయస్‌దే. వాళ్లు ఒత్తిడిని అధిగమించిన తీరు అమోఘం. అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

Shakib Al Hasan Says Credit goes to Shreyas and Ashwin after Indias win over Bangladesh in 2nd Test

70 పరుగుల తక్కువతో ఆడాల్సి వచ్చింది. ఒక్క వికెట్ తీసినా.. మరో 70 పరుగులు స్కోర్ బోర్డుపై ఉన్నా ఫలితం మరోలా ఉండేది. మ్యాచ్ అయిన తర్వాత ఇలా, అలా జరిగితే బాగుండని చాలా అనిపిస్తది. కానీ మేం ఆడిన తీరు.. కనబర్చిన పోరాటం పట్ల గర్వంగా ఫీలవుతున్నా. ఆల్‌రౌండర్‌గా రాణించడం నా బాధ్యత. తొలి మ్యాచ్‌లో అంతగా బౌలింగ్ చేయలేకపోయాను. ఈ ఏడాది మాకు అద్భుతంగా సాగింది. వచ్చ సవంత్సరం కూడా సంచలన విజయాలతో బంగ్లాదేశ్ క్రికెట్‌ను మరోస్థాయికి చేరుస్తామని ఆశిస్తున్నా.'అని షకీబ్ అల్ హసన్ చెప్పుకొచ్చాడు.

145 పరుగుల ఛేదనలో.. ఓవర్‌నైట్‌ స్కోరు 45/4తో ఆదివారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన టీమ్‌ఇండియా నాలుగో రోజు మరో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. అశ్విన్‌ ( 62 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 42 నాటౌట్‌), శ్రేయస్‌ అయ్యర్‌ (46 బంతుల్లో 4 ఫోర్లతో 29 నాటౌట్‌) జట్టును ఆదుకున్నారు. మెహిదీ మిరాజ్‌ (5/63) సత్తాచాటాడు. మ్యాచ్‌లో ఆరు వికెట్లు తీయడమే కాకుండా బ్యాటింగ్‌లో మెరిసిన అశ్వినే 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌'. పుజారా (2 టెస్టుల్లో 222 పరుగులు) 'మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌'గా నిలిచాడు. రెండు టెస్టుల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన భారత్‌.. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో రెండో స్థానాన్ని బలోపేతం చేసుకుంది.

Story first published: Monday, December 26, 2022, 10:11 [IST]
Other articles published on Dec 26, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+