For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Shakib Al Hasan: అందుకే ఈ ఘోర పరాజయం!

NED vs BAN: చెత్త ఫీల్డింగ్, పేలవ బ్యాటింగ్‌తో ఘోర పరాజయం చవి చూసామని బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ అన్నాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా నెదర్లాండ్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 87 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన షకీబ్ అల్ హసన్.. ఈ పరాజయం తీవ్రంగా నిరాశ పరిచిందన్నాడు.

'మేం అద్భుతంగానే బౌలింగ్ చేశాం. కానీ చెత్త ఫీల్డింగ్‌తో మూల్యం చెల్లించుకున్నాం. నెదర్లాండ్స్‌ను 160-170 పరుగులకు కట్టడి చేయాల్సింది. మాకు ఆ అవకాశం కూడా దక్కింది. కానీ మా పేలవ ఫీల్డింగ్‌తో ఆ జట్టు 229 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమయ్యాం. ఈ టోర్నీలో మా బ్యాటింగ్ స్థాయికి తగ్గట్లు లేదు.

 Shakib Al Hasan reveals the reason why Netherlands beat Bangladesh by 87-run in World Cup 2023

ఇది మమ్మల్ని తీవ్రంగా నిరాశపరిచింది. మేం మెరుగైన ప్రదర్శన ఇవ్వాలి. మాకు మేం ఉత్తేజ పరుచుకొని టోర్నీని ఘనంగా ముగించే ప్రయత్నం చేయాలి. ఈ టోర్నీ మొత్తం మేం తడబడుతున్నాం. ఆటగాళ్ల మదిలో ఏం ఉందో నాకు అర్థం కావడం లేదు.'అని షకీబ్ అల్ హసన్ చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ నిర్ణీత 50 ఓవర్లలో 229 పరుగులకు కుప్పకూలింది.

కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్(89 బంతుల్లో 6 ఫోర్లతో 68) హాఫ్ సెంచరీతో రాణించగా.. వెస్లీ బార్రెసీ(41 బంతుల్లో 8 ఫోర్లతో 41), సైబ్రాండ్(61 బంతుల్లో 3 ఫోర్లతో 35) విలువైన పరుగులు చేశారు. బంగ్లాదేశ్ బౌలర్లలో షోరిఫుల్ ఇస్లామ్(2/51), టస్కిన్ అహ్మద్(2/43), ముస్తాఫిజుర్ రెహ్మాన్(2/36), మెహ్‌దీ హసన్(2/40) రెండేసి వికెట్లు తీసారు. షకీబ్ అల్ హసన్(1/37)కు ఓ వికెట్ దక్కింది.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన బంగ్లాదేశ్ 42.2 ఓవర్లలో 142 పరుగులకు కుప్పకూలింది. మెహ్‌దీ హసన్ మీరాజ్(40 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 35) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. నెదర్లాండ్స్ బౌలర్లలో పాల్ వాన్ మీకెరెన్(4/23) నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. బాస్ డీ లీడే(2/25) రెండు వికెట్లు పడగొట్టాడు. ఆర్యన్ దత్, లోగాన్ వాన్ బీక్, కోలిన్ అకెర్‌మన్ తలో వికెట్ తీసారు.

Story first published: Saturday, October 28, 2023, 22:32 [IST]
Other articles published on Oct 28, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+