Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

షకీబ్ అల్ హసన్ బెస్ట్ ఐపీఎల్ ఎలెవన్.. కెప్టెన్‌గా గంభీర్

Shakib Al Hasan forms IPL XI of the players he played alongside

ఢాకా: కరోనా కారణంగా టోర్నీలన్నీ నిలిచిపోవడంతో ఫాంటసీ క్రికెట్‌కు పిచ్చ క్రేజ్ వచ్చింది. లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమైన ఆటగాళ్లు సోషల్ మీడియా వేదికగా కాలక్షేపం చేస్తూ.. ఇన్‌స్టా లైవ్ సెషన్స్‌తో ఫ్యాన్స్‌తో చిట్‌చాట్ చేశారు. ఈ నేపథ్యంలో మాజీ, ప్రస్తుత క్రికెటర్లు తమ అత్యుత్తమ జట్లను ప్రకటిస్తూ ఓ కొత్త ట్రెండ్ సృష్టించారు. లాక్‌డౌన్ ముగిసినా.. క్రికెట్ పున:ప్రారంభమయ్యే దశలో ఉన్నా.. బెస్ట్ ఎలెవన్ టీమ్స్ ప్రకటన మాత్రం ఆగడం లేదు.

తాజాగా బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ ఐపీఎల్‌లో తాను ఆడిన జట్ల నుంచి అత్యుత్తమ టీమ్‌ను ఎంపిక చేశాడు. షకీబ్ 8 ఏళ్ల ఐపీఎల్ కెరీర్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టులకు ప్రాతినిధ్యం వహించాడు. కేకేఆర్ చాంపియన్‌గా నిలిచిన రెండు సీజన్లలో షకీబ్ కీలక ఆటగాడు. 2018 సీజన్‌లో ఫైనల్ చేరిన హైదరాబాద్ జట్టులో కూడా ఉన్నాడు.

ఇక ఈ రెండు టీమ్స్ నుంచి ఓ బెస్ట్ ఎలెవన్‌ను ఎంపిక చేసిన షకీబ్.. ఈ జట్టుకు కోల్‌కతా నైట్ రైడర్స్ మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్‌ను సారథిగా ఎంచుకున్నాడు. ఇక ఓపెనర్లుగా రాబిన్ ఊతప్ప, డేవిడ్ వార్నర్‌లను తీసుకున్నాడు. కెప్టెన్ గౌతమ్ గంభీర్‌ను ఫస్ట్ డౌన్, మనీష్ పాండే, తనను రెండు, మూడు స్థానాల్లో ఎంపిక చేసుకున్నాడు. నాలుగు, ఐదు స్థానాల్లో యూసఫ్ పఠాన్, ఆండ్రూ రసెల్, స్పిన్నర్‌గా సునీల్ నరైన్, భువనేశ్వర్ కుమార్, లక్ష్మీపతి బాలాజీ, ఉమేశ్ యాదవ్‌లను పేసర్లుగా ఎంచుకున్నాడు. అయితే ఐపీఎల్‌లో అత్యంత ప్రభావవంతమైన, అఫ్గాన్ సెన్సేషన్, హైదరాబాద్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌ను ఎంపికచేయలేదు.

షకీబ్ ఐపీఎల్ ఎలెవన్:
రాబిన్ ఊతప్ప, డేవిడ్ వార్నర్, గౌతమ్ గంభీర్, మనీష్ పాండే, షకీబ్ అల్ హసన్, యూసఫ్ పఠాన్, ఆండ్రూ రసెల్, సునీల్ నరైన్, భువనేశ్వర్ కుమార్, భువనేశ్వర్ కుమార్, లక్ష్మీపతి బాలాజీ, ఉమేశ్ యాదవ్

Story first published: Wednesday, June 24, 2020, 18:35 [IST]
Other articles published on Jun 24, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+