Shakib Al Hasan: తలదించుకునే పని.. అంపైర్ ఔటివ్వలేదని వికెట్లను తన్నిన బంగ్లా స్టార్ (వీడియో)

ఢాకా: బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ క్రికెట్ సమాజం తలదించుకునే పని చేశాడు. అంపైర్ ఔటివ్వలేదనే ఆగ్రహంతో నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లోని వికెట్లను తన్నాడు. అంతటితో ఆగకుండా అంపైర్‌ను దర్భాషలాడుతూ అతని మీదికి దూసుకెళ్లాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఢాకా ప్రీమియర్ డివిజన్ టీ20 క్రికెట్ లీగ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
లీగ్‌లో భాగంగా అబహాని లిమిటెడ్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో మహమ్మెదన్ స్పోర్టింగ్ క్లబ్ జట్టుకు షకీబ్ అల్ హసన్ సారథ్యం వహిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన షకీబ్ అల్ హసన్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 145 రన్స్ చేసింది. అనంతరం అబహాని లిమిటెడ్ టీమ్ బ్యాటింగ్‌కు దిగగా.. షకీబ్ ఐదో ఓవర్ వేసాడు.
ఈ ఓవర్‌లో ముష్షికర్ 6, ఫోర్ బాదాడు. ఆ మరుసటి బంతి అతని బ్యాట్‌ను విస్సై ప్యాడ్లను తాకింది. ఎల్బీ కోసం గట్టిగా అప్పీల్ చేసిన షకీబ్.. అంపైర్ నాటౌట్ ఇవ్వడంతో సహనం కోల్పోయాడు. ఆగ్రహంతో అతనిపైకి దూసుకెళ్తూ నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లోని వికెట్లను పడగొట్టాడు. ఆ తర్వాత మరోసారి అంపైర్ నిర్ణయం పట్ల అసహనానికి గురయ్యాడు. ఫీల్డింగ్ చేస్తున్న అతను అంపైర్ తప్పిదాలకు విసుగు చెంది నాన్ స్ట్రైకర్ వికెట్లను పీకిపారేసాడు. ఈ వీడియో కూడా వైరల్‌గా మారింది.
షకీబ్ అల్ హసన్ తీరు పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఓ కెప్టెన్‌గా, స్టార్ ఆల్‌రౌండర్‌గా యువ క్రికెటర్లకు స్పూర్తిగా నిలవాల్సిన షకీబ్.. ఇలా ప్రవర్తించడం సిగ్గు చేటని నెటిజన్లు ఘాటుగా కామెంట్ చేస్తున్నారు. అయితే షకీబ్ ఇలా ప్రవర్తించడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ అనేకసార్లు అతను ఈ తరహా ప్రవర్తనతోనే మందలింపుకు కూడా గురయ్యాడు.
శ్రీలంకలో జరిగిన నిదహాస్ ట్రోఫీ సందర్భంగాను షకీబ్ అంపైర్ల నిర్ణయం పట్ల అత్యుత్సాహం ప్రదర్శించడం అప్పట్లో విమర్శలకు దారి తీసింది. తాజా వీడియోలను చూస్తుంటే అతనిపై బంగ్లాబోర్డు చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications