
టెస్ట్ మ్యాచ్‌తో ఫలితం లేదు..
'శ్రీలంకతో ఆడాల్సిన రెండు టెస్టుల సిరీస్.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో మాకు చివరిది. ఏలాగూ మేం ఫైనల్లో ఆడట్లేదు. ఆ పాయింట్ల పట్టికలో మా జట్టు చివరి స్థానంలో ఉంది. కాబట్టి, నేను ఆ సిరీస్‌లో ఆడినా, ఆడకపోయినా జట్టుకు వచ్చే నష్టం లేదు. కానీ ఐపీఎల్ ఆడటం ద్వారా జట్టుకు మేలు జరుగుతుంది. ఎలా అంటే.. ఈ ఏడాది చివర్లో భారత్‌లోనే టీ20 ప్రపంచకప్ జరగనుంది. అందులో మేం సాధించాల్సింది చాలా ఉంది. అదెంతో ముఖ్యమైన టోర్నీ. ఈ టెస్టు సిరీస్‌లో మేం సాధించాల్సింది ఏమీ లేదు. దీంతో ఐపీఎల్ ఆడటమే మంచిదని నేను అనుకున్నా' అని షకీబ్ పేర్కొన్నాడు.

నేను ఆడనని చెప్పలేదు..
అలాగే ఇకపై తాను టెస్టు క్రికెట్ ఆడనని చాలా మంది మాట్లాడుతున్నారని, దీంతో వారికి ఒక స్పష్టత ఇవ్వాలనుకుంటున్నట్లు ఈ బంగ్లా ఆల్‌రౌండర్ చెప్పుకొచ్చాడు. 'ఇకపై నేను టెస్టు క్రికెట్ ఆడనని చెప్పేవారందరూ.. నేను బీసీబీకి రాసిన లేఖను పూర్తిగా చదవలేదని అనుకుంటా. ఆ లేఖలో నేనెక్కడా టెస్టు క్రికెట్ ఆడనని చెప్పలేదు. రాబోయే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకునే ఐపీఎల్‌లో ఆడాలనుకుంటున్నట్లు వివరించాను. కానీ, అక్రమ్ భాయ్(బంగ్లా క్రికెట్ ఆపరేషన్స్ ఛైర్మన్) ఇది చెప్పకుండా ఎంతసేపూ నేను టెస్టు క్రికెట్ ఆడాలనుకోవడం లేదనే అన్నాడు' అని షకీబ్ అసలు విషయం బయటపెట్టాడు.

కేకేఆర్‌లోకి రీఎంట్రీ..
ఐసీసీ నిషేధం కారణంగా షకీబ్ ఏడాది పాటు క్రికెట్‌కు దూరమయ్యాడు. 2019 వన్డే ప్రపంచకప్ ముంగిట మ్యాచ్ ఫిక్సింగ్ కోసం తనని ఓ బుకీ సంప్రదించగా.. ఆ విషయాన్ని ఐసీసీ అవినీతి నిరోధక శాఖకు సమాచారం ఇవ్వకుండా షకీబ్ దాచాడు. దాంతో అతనిపై తొలుత రెండేళ్ల నిషేధం విధించిన ఐసీసీ.. ఆ తర్వాత తప్పును ఒప్పుకోవడంతో నిషేధాన్ని ఏడాదికి కుదించింది.
గతేడాది ఏడాది అక్టోబరు 29తో అతనిపై ఉన్న నిషేధం ముగిసింది. దాంతో అంతర్జాతీయ క్రికెట్‌లో రీఎంట్రి ఇచ్చాడు. ఈ సీజన్ ఐపీఎల్ వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ ఈ స్టార్ ఆల్‌రౌండర్‌ను రూ. 3.30 కోట్లకు కొనుగోలు చేసింది. 2012, 2014 సీజన్లలో కోల్ కతా చాంపియన్‌గా నిలవడంలో షకీబ్ కీలక పాత్ర పోషించాడు.


Click it and Unblock the Notifications












