Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అదే మా ఓటమిని శాసించింది: షై హోప్

ట్రినిడాడ్: పేలవ బ్యాటింగ్, నిరాశ, తమపై తమకు నమ్మకం లేకపోవడం టీమిండియాతో ఘోర పరాజయానికి కారణమైందని వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్ అన్నాడు. బుధవారం తెల్లవారుజామున ముగిసిన మూడో వన్డేలో టీమిండియా 200 పరుగుల భారీ తేడాతో వెస్టిండీస్‌ను చిత్తు చేసింది. ఈ ఓటమితో విండీస్ 1-2 తేడాతో వన్డే సిరీస్ కోల్పోయింది.

రెండో వన్డేలో అసాధారణ విజయంతో ఆకట్టుకున్న విండీస్.. కీలకమైన చివరి మ్యాచ్‌లో కనీస పోటీ ఇవ్వలేకపోయింది. మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన హై హోప్ కీలక వ్యాఖ్యలు చేశాడు. 'ఈ మ్యాచ్‌లో మేం కనీస పోటీనివ్వలేకపోయాం. బ్యాక్ ఎండ్‌లో ఈ వికెట్‌ను చూసి మేం భారత్‌ను అద్భుతంగానే కట్టడి చేసామని భావించాను.

Shai Hope says Some days play like the best team in the world, some days we just get steamrolled

ఆరంభంలో బంతితో సవాల్ విసరలేకపోయాం. అయితే ఈ వికెట్‌పై 350 పరుగులను చేధించడం పెద్ద కష్టమేమి కాదు. కానీ మాకు ఈ రోజు కలిసిరాలేదు. ఎప్పుడు.. ఎక్కడ ఆడినా.. గెలుస్తామనే నమ్మకం ఉండాలి. మనపై మనకు నమ్మకం లేకపోతే ఫలితాలు ఇలానే ఉంటాయి. నేను తరుచూ మా ఆటగాళ్లు ఇదే విషయాన్ని నొక్కి చెబుతూ ఉంటాను.

నిలకడగా రాణించడం.. గెలవాలనే కసితో ఆడాలని, ఓడిపోయే మ్యాచ్‌లను గెలవాలని సూచిస్తుంటాను. అయితే కొన్ని రోజులు మేం ప్రపంచంలో అత్యుత్తమ జట్టుగా ఆడుతాం. మరికొన్ని రోజులు మాత్రం చిత్తుగా ఓడిపోతాం.'అని షై హోప్ చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 351 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్(64 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 77), శుభ్‌మన్ గిల్(92 బంతుల్లో 11 ఫోర్లతో 85), సంజూ శాంసన్(41 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 51), హార్దిక్ పాండ్యా(52 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 70 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు.

వెస్టిండీస్ బౌలర్లలో రోమారియో షెఫర్డ్ రెండు వికెట్లు తీయగా.. అల్జారీ జోసెఫ్, గుడకేష్ మోతీ, యాన్నిక్ కరయ్య తలో వికెట్ తీసారు. భారత బ్యాటింగ్‌లో రుతురాజ్ గ్వైకాడ్(8) తప్పా అందరూ రాణించారు. సూర్యకుమార్ యాదవ్(35), రవీంద్ర జడేజా(8 నాటౌట్) పర్వాలేదనిపించారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన వెస్టిండీస్.. శార్దూల్ ఠాకూర్(4/37), ముకేష్ కుమార్(3/30), కుల్దీప్ యాదవ్(2/25) ధాటికి 35.3 ఓవర్లలో 151 పరుగులకే కుప్పకూలింది. జయదేవ్ ఉనాద్కత్ ఓ వికెట్ తీసాడు. వెస్టిండీస్ బ్యాటర్లలో అలిక్ అథనాజ్(50 బంతుల్లో 3 ఫోర్లతో 32), గుడకేష్ మోతీ(34 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 39) టాప్ స్కోరర్లుగా నిలిచారు.

Story first published: Wednesday, August 2, 2023, 8:10 [IST]
Other articles published on Aug 2, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+