For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Shahrukh Khan విధ్వంసం.. 6 సిక్సర్లతో వీర విహారం! ఫ్రాంచైజీలను టెంప్ట్ చేస్తున్న తమిళనాడు కుర్రాడు!

Shahrukh Khan stars with blazing 79 for Tamil Nadu ahead of IPL 2022 mega-auction
Shahrukh Khan The Upcomming Finisher For Teamindia | Oneindia Telugu

జైపూర్: ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు తమిళనాడు క్రికెటర్, పంజాబ్ కింగ్స్ మాజీ హిట్టర్ షారూఖ్ ఖాన్ దుమ్మురేపుతున్నాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో ఐపీఎల్ ఫ్రాంచైజీలను టెంప్ట్ చేస్తున్నాడు. దేశవాళీ ప్రతిష్టాత్మక టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్లో లాస్ట్ బాల్ సిక్స్ కొట్టి తమిళనాడును చాంపియన్‌గా నిలిపిన షారూఖ్ ఖాన్.. విజయ్ హజారే ట్రోఫీలోనూ అదే జోరు కొనసాగిస్తున్నాడు. కర్ణాటకతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో షారూఖ్( 39 బంతుల్లోనే 7 ఫోర్లు, 6 సిక్సర్లతో 79 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 7 ఫోర్లు, 6 సిక్సర్లతో వీర విహారం చేశాడు.

151 రన్స్ భారీ తేడాతో..

151 రన్స్ భారీ తేడాతో..

షారూఖ్ సూపర్ బ్యాటింగ్‌తో ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన తమిళనాడు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 354 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ నారయణ్ జగదీషన్(101 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 102) సెంచరీతో రాణించగా.. రవి శ్రీనివాసన్ సాయి కిషోర్(71 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 61) హాఫ్ సెంచరీతో మెరిసాడు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన కర్ణాటక 39 ఓవర్లలో 203 పరుగులకే కుప్పకూలి 151 పరుగుల తేడాతో ఘోర ఓటమి చవిచూసింది. ఈ విజయంతో తమిళనాడు సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది.

షారూఖ్.. వేలంలో హాట్ కేక్..

షారూఖ్.. వేలంలో హాట్ కేక్..

ఇక షారూఖ్ ఖాన్ ప్రదర్శనను అందరూ కొనియాడుతున్నారు. ఐపీఎల్ 2022 మెగా వేలంలో అతను భారీ ధర పలకడం ఖాయమనిపిస్తోంది. ఐపీఎల్ 2021 సీజన్‌తో భారత క్యాష్ రిచ్ లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన షారూఖ్ ఖాన్.. పంజాబ్ కింగ్స్ తరఫున ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. అతనికి సరైన అవకాశాలు కూడా రాలేదు. అయితే పంజాబ్ కింగ్స్ అతన్ని రిటైన్ చేసుకోకుండా వేలంలోకి వదిలేసింది. అయితే రిటెన్షన్‌కు షారూఖ్ సుముఖంగా లేకపోవడంతోనే పంజాబ్ వదులుకుందనే ప్రచారం జరుగుతుంది.

చెన్నై జట్టులోకి..

చెన్నై జట్టులోకి..

చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ షారూఖ్ ఖాన్‌ను సంప్రదించిందని, వేలంలోకి వచ్చేలా అతనితో లోపకాయిరి ఒప్పందం చేసుకుందనే వాదన కూడా వినిపిస్తోంది. ఆ క్రమంలోనే పంజాబ్ రిటెన్షన్‌కు ఈ తమిళనాడు హిట్టర్ ఒప్పుకోలేదట. అయితే పంజాబ్ కింగ్స్ మాత్రం షారూఖ్ ఖాన్ వదిలేసి ఘోర తప్పిదం చేసిందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారీ డబ్బు ఆశ చూపి అయినా అతన్ని ఉంచుకోవాల్సింది అంటున్నారు. ఇక కెరీర్ పరంగా షారూఖ్‌కు ఐపీఎల్ 2022 సీజన్ చాలా కీలకం. టీమిండియా తరఫున ఆడాలంటే ఈ ధనాధన్ లీగ్‌లో దుమ్మురేపాల్సిందే.

వేలం మరింత ఆలస్యం..

వేలం మరింత ఆలస్యం..

ఐపీఎల్ 2022 మెగా వేలం ఫిబ్రవరి తొలి వారంలో జరిగే అవకాశం ఉంది. వాస్తవానికి జనవరి మొదటి వారంలోనే ఈ మెగా వేలం నిర్వహించాలనుకున్నప్పటికీ.. అహ్మదాబాద్ ఫ్రాంచైజీకి సంబంధించిన సమస్య పరిష్కారం కాకపోవడంతో వాయిదా వేయాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. అహ్మదాబాద్ ఫ్రాంచైజీని సొంతం చేసుకున్న సీవీసీ ఓనర్‌షిప్ అంశాన్ని తేల్చేందుకు ఏర్పాటు చేసిన స్పెషల్ కమిటీ ఎలాంటి నిర్ణయం వెల్లడించలేదు. ఇది తేలేవరకు మెగా ఆక్షన్ డేట్స్ ఫైనలైజ్ అయ్యే చాన్స్ లేదు. ఇక ముగ్గురు ప్లేయర్లతో కాంట్రాక్ట్ చేసుకునేందుకు అహ్మదాబాద్, లక్నో ఫ్రాంచైజీలకు మరింత టైమ్ ఇవ్వాల్సి ఉంటుంది'అని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు.

Story first published: Tuesday, December 21, 2021, 19:41 [IST]
Other articles published on Dec 21, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+