Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Shahrukh Khan: ధోనీలా ఫినిషర్ అవడమే నా టార్గెట్!

Shahrukh Khan says I idolize MS Dhoni and wish to become a finisher like him

న్యూఢిల్లీ: భారత జట్టు తరఫున ఆడేందుకు తాను సిద్దంగా ఉన్నానని తమిళనాడు యువ హిట్టర్ షారుఖ్ ఖాన్ అన్నాడు. వెస్టిండీస్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు ఈ పంజాబ్ కింగ్స్ మాజీ ప్లేయర్ స్టాండ్‌బై ఆటగాడిగా ఎంపికైన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 6 నుంచి అహ్మదాబాద్ వేదికగా మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుండగా.. షారుఖ్ ఖాన్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడాడు. తన అభిమాన క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ అని, అతనిలా మంచి ఫినిషర్ అవ్వడమే తన లక్ష్యమని చెప్పుకొచ్చాడు.

'నా ప్రదర్శనతో ఎట్టకేలకు సెలక్టర్ల దృష్టిలో పడ్డాను. టీమిండియాలోకి రావడం ఎలా ఉందని సంవత్సరం క్రితం అడుగుంటే.. నేనప్పటికి సిద్ధంగా లేను కాబట్టి అర్హుడిని కాదు అని చెప్పేవాడిని. కానీ అదే ప్రశ్న ఇప్పుడు వేస్తే మాత్రం.. నేను టీమిండియా జెర్సీ ధరించడానికి సిద్ధంగా ఉన్నానని చెబుతా. ధోనీ నా అభిమాన ప్లేయర్‌.. అతనిలా మంచి ఫినిషర్‌ కావాలనేదే నా లక్ష్యం'' అని షారుఖ్‌ చెప్పుకొచ్చాడు.

ఇక తమిళనాడు యంగ్‌ ప్లేయర్‌ షారుఖ్‌ ఖాన్‌ గతేడాది దేశవాళీ క్రికెట్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఐపీఎల్‌ 2021 సీజన్‌ వేలంలో పంజాబ్‌ కింగ్స్‌ రూ. 5.25 కోట్ల భారీ ధరకు అతన్ని కొనుగోలు చేసింది. గత సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌ తరపున 11 మ్యాచ్‌ల్లో 153 పరుగులు మాత్రమే చేసిన షారూఖ్.. దేశవాళీ టోర్నీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టి20 ట్రోఫీలో దుమ్మురేపాడు. ఈ టోర్నీలో తమిళనాడు చాంపియన్‌గా నిలవడంలో కీలకపాత్ర పోషించాడు.

ఒక మ్యాచ్‌లో సెంచరీతో ఆకట్టుకున్న షారుఖ్‌ ఖాన్‌.. కీలకమైన ఫైనల్లో 15 బంతుల్లో 33 పరుగులు చేసి తనదైన ఫినిషింగ్‌ టచ్‌తో జట్టుకు టైటిల్‌ అందించాడు. ఈ ఇన్నింగ్స్‌తోనే సెలక్టర్ల దృష్టిని ఆకర్షించిన షారుఖ్‌ ఖాన్‌.. విండీస్‌తో సిరీస్‌కు స్టాండ్‌బైగా ఎంపికయ్యాడు. షారుఖ్‌తో పాటు ఆర్‌. సాయికిషోర్‌ కూడా ఉన్నాడు. ఇక ఫిబ్రవరి 12,13 తేదీల్లో జరగనున్న ఐపీఎల్‌ మెగావేలంలో షారుఖ్‌ఖాన్‌కు మంచి ధర పలికే అవకాశం ఉంది. అతన్ని దక్కించుకోవడానికి సీఎస్‌కే, ఆర్‌సీబీ, కేకేఆర్‌తో పాటు అన్ని ఫ్రాంచైజీలు ఆసక్తి కనబరుస్తున్నాయి.

Story first published: Wednesday, February 2, 2022, 21:42 [IST]
Other articles published on Feb 2, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+